- Home
- Entertainment
- `కలిసుందాం రా` సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా? `సమరసింహారెడ్డి` రికార్డులు బ్రేక్
`కలిసుందాం రా` సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా? `సమరసింహారెడ్డి` రికార్డులు బ్రేక్
వెంకటేష్ నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీస్‌లో `కలిసుందాం రా` ఒకటి. ఈ మూవీ బాలయ్య `సమరసింహారెడ్డి` రికార్డులను బ్రేక్ చేసింది. మరి ఈ చిత్రానికి మొదట అనుకున్న హీరో ఎవరో చూద్దాం.

`కలిసుందాం రా`తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న వెంకటేష్
వెంకటేష్ హీరోగా వచ్చిన `కలిసుందాం రా` మూవీ టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇందులో వెంకటేష్‌కి జోడీగా సిమ్రాన్ నటించింది. తమిళ దర్శకుడు ఉదయ్ శంకర్ దర్వకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ ఆ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు, ఇండస్ట్రీ హిట్ జాబితాలో చేరిపోయింది. అయితే ఈ మూవీకి చేయాల్సిన మొదటి హీరో వెంకటేష్ కాదు. మరో సూపర్ స్టార్ వదులుకుంటే వెంకీ వద్దకు వచ్చింది.
`కలిసుందాం రా`ని మిస్ చేసుకున్న నాగార్జున
తమిళ దర్శకుడు ఉదయ్ శంకర్ `కలిసుందాం రా` అనే ఫ్యామిలీ కథని రెడీ చేసుకుని వచ్చి మొదట నాగార్జునని కలిశారు. అయితే అప్పటికే నాగార్జున వరుసగా ఫ్యామిలీ సినిమాలు చేశారు. `చంద్రలేఖ`, `సీతారామరాజు` వంటి సినిమాలు ఆ కోవకు చెందినవే. మళ్లీ ఫ్యామిలీ సినిమా అంటే బోర్ కొడుతుందని, ఆడియెన్స్ చూడరని భావించారు నాగ్. దీంతో ఈ కథకి నో చెప్పారు. అలా నాగార్జున `కలిసుందాం రా` సినిమాని వదులుకున్నారు. అయితే ఇది చాలా చిన్న కారణం. నిజానికి నాగ్ సినిమా చేసి ఉంటే ఆయన ఇండస్ట్రీ హిట్‌ని అందుకునేవారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
నాగ్ నో చెబితే వెంకీ ఓకే చెప్పాడు
నాగార్జున నో చెప్పడంతో ఈ కథతో వెళ్లి వెంకటేష్‌ని కలిశాడు దర్శకుడు ఉదయ్ శంకర్. అప్పటికే వరుసగా ఫ్యామిలీ చిత్రాలతో ఆకట్టుకుంటున్నారు వెంకీ. వరుసగా విజయాలు అందుకుంటున్నారు. పైగా కెరీర్ పరంగానూ పీక్‌లో ఉన్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ లో వెంకటేష్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ఈ స్టోరీకి వెంకీనే న్యాయం చేస్తాడని భావించారు ఉదయ్ శంకర్. లక్కీగా వెంకీకి, సురేష్ బాబుకి నచ్చింది. దీంతో తమ సురేష్ ప్రొడక్షన్‌లోనే ఈ సినిమా చేశారు.
ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన `కలిసుందాం రా`
2000లో జనవరి 14న విడుదలైంది. ఫ్యామిలీ కంటెంట్ ఉన్న సినిమా కావడం, పైగా సంక్రాంతి పండగ కావడంతో ఆడియెన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఈ ఏడాది `సంక్రాంతికి వస్తున్నాం` కి ఎలా అయితే ఆడియెన్స్ క్యూ కట్టారో. అప్పుడు కూడా అదే స్థాయిలో ఆడియెన్స్ బండ్లు కట్టుకుని వెళ్లి సినిమా చూశారు. దీంతో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను ఈ చిత్రం బ్రేక్ చేసింది. సంచలన విజయం సాధించింది. ఏకంగా సుమారు రూ. 27కోట్ల కలెక్షన్లని రాబట్టింది.
`సమరసింహారెడ్డి` రికార్డులు బ్రేక్
అంతకు ముందు ఏడాది బాలకృష్ణ నటించిన `సమరసింహారెడ్డి` మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ సినిమా రికార్డులను బద్దలు కొట్టింది వెంకీ `కలిసుందాం రా`. ఫ్యామిలీ కంటెంట్‌తో వస్తే ఏ రేంజ్‌లో సక్సెస్ అవుతుందో నిరూపించింది. ఈ సినిమా 76సెంటర్లలో వంద రోజులు, 17 సెంటర్లలో 175 రోజులు, మూడు సెంటర్లలో రెండు వందల రోజులు ప్రదర్శించడం విశేషం. అంతేకాదు ఆ ఏడాదికిగానూ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డుని సొంతం చేసుకుంది. నాలుగు నంది అవార్డులను దక్కించుకుంది.