- Home
- Entertainment
- కిర్రాక్ ఆర్పీ మోసం చేశాడు, ఆయన వల్లే జబర్దస్త్ వదిలేశా.. ప్రియుడు హ్యాండిచ్చాడు.. జబర్దస్త్ కమెడియన్ ఆవేదన
కిర్రాక్ ఆర్పీ మోసం చేశాడు, ఆయన వల్లే జబర్దస్త్ వదిలేశా.. ప్రియుడు హ్యాండిచ్చాడు.. జబర్దస్త్ కమెడియన్ ఆవేదన
జబర్దస్త్ కమెడియన్ తన్మయ్ షాకింగ్ విషయాలు వెల్లడించారు. కిర్రాక్ ఆర్పీ తనని మోసం చేశాడని తెలిపారు. అంతేకాదు ప్రేమించినవాడు కూడా మోసం చేసినట్టు తెలిపారు.

`జబర్దస్త్` షోతో పాపులర్ అయిన తన్మయ్
జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఈ షో ద్వారా ఎంతో మంది స్టార్ కమెడియన్‌గా ఎదిగారు. ఇప్పుడు సినిమాల్లోనూ రాణిస్తున్నారు. మరికొంత మంది బుల్లితెర స్టార్స్ గా రాణిస్తున్నారు. కానీ ఇది హాస్యనటులకు మంచి వేదికగా చెప్పొచ్చు. అయితే ఈ షోకి ప్రారంభంలో లేడీ కమెడియన్లు వచ్చేవారు కాదు, దీంతో లేడీ గెటప్ వేసిన వారికి మంచి డిమాండ్ ఉండేది. అలా వచ్చి స్టార్ కమెడియన్‌గా ఎదిగారు తన్మయ్. చలాకీ చంటి సపోర్ట్ తో పరిచయమై, రాకింగ్ రాకేష్ టీమ్‌లో వర్క్ చేసి మంచి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.
జబర్దస్త్ కమెడియన్ తన్మయ్ ఫేస్ చేసిన మోసాలు
ట్రాన్స్ జెండర్‌గా మారిన తన్మయ్ ఇటీవల కనిపించడం లేదు. జబర్దస్త్ కి, బుల్లితెరకు దూరమయ్యారు. అడపాదడపా కనిపించినా, మునుపటి జోరు కనిపించడం లేదు. ఈ క్రమంలో తన పర్సనల్ లైఫ్‌లోని షాకిచ్చే విషయాలను పంచుకున్నారు తన్మయ్. తాను మోసపోయినట్టు తెలిపారు. అటు జబర్దస్త్ లో తోటివారే మోసం చేస్తే, మరోవైపు వ్యక్తిగత జీవితంలో ప్రేమించిన వాడు మోసం చేశాడని తెలిపారు. తాను అనేక ఇబ్బందులు ఫేస్ చేసినట్టు, ఇప్పుడు ఏకంగా ఆర్థికంగానూ ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. మనుషులను ప్రేమించే వారు కరువయ్యారని, డబ్బుని ప్రేమించే వారు ఎక్కువగా ఉంటున్నారని, ప్రేమించిన వాడు కూడా డబ్బునే ప్రేమించినట్టు తెలిపారు. ఐడ్రీమ్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు తన్మయ్.
రాకింగ్ రాకేష్ లైఫ్ ఇచ్చాడు
తాను కాలేజీలో ఉన్న సమయంలో జబర్దస్త్ టీమ్ ఒకసారి కాలేజీ ఈవెంట్‌కి వచ్చారని, ఆ సమయంలో తాను వారితో కలిసి పర్‌ఫామ్ చేస్తే మెచ్చుకున్నారని, గెటప్ వేసి కనిపించడం, వారితో బాగా కలిసిపోయి ఎంటర్‌టైన్ చేయడంతో వెంటనే తనని జబర్దస్త్ కి పిలిచారని తెలిపారు తన్మయ్. చలాకీ చంటి, రాకింగ్ రాకేష్ పిలుపు మేరకు కామెడీ షోకి వెళ్లానని, జబర్దస్త్ కమెడియన్‌గా గుర్తింపు, లైఫ్ ఇచ్చింది రాకేష్ అని తెలిపారు. ఆయన టీమ్‌లోనే ఎక్కువగా పనిచేసినట్టు తెలిపారు. ఈ షో తనకు విశేషమైన గుర్తింపుని, పాపులారిటీని తీసుకొచ్చిందన్నారు. ఆ పేరుతోనే ఇన్నాళ్లు సర్వైవ్ అవుతున్నట్టు తెలిపారు. అయితే తాను ట్రాన్స్ జెండర్‌గా మారడంతో అనేక విమర్శలు, హేళనలు ఫేస్ చేశాను. కానీ జబర్దస్త్ షో ఇమేజ్ కాపాడిందన్నారు.
కిర్రాక్ ఆర్పీ మోసం చేశాడుః తన్మయ్
ఇదిలా ఉంటే కిర్రాక్ ఆర్ఫీ తనని మోసం చేశాడని వెల్లడించారు తన్మయ్. ఆయన పిలవడంతోనే జబర్దస్త్ మానేసి `అదిరింది` షోకి వెళ్లానని, ఆ తర్వాత తనని వదిలేశాడని, నమ్మించి మోసం చేశాడని చెప్పారు. `కిర్రాక్ ఆర్పీని సొంత అన్నగా ట్రీట్ చేశాను, కానీ ఆయన మైండ్ సెట్ అంతా వేరు. దాని గురించి నేనేమీ అనను. కానీ పర్సనల్ విషయాల్లో ఆయన విషయంలో బాధపడ్డాను. తనకు ఒక దశలో చాలా సపోర్టివ్‌గా నిలబడ్డాను. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. ఆర్థికపరంగానూ హెల్ప్ చేశాను, కానీ ఆయన వల్లే షో నుంచి బయటకు వచ్చాను. ఆ తర్వాత తనతో మాట్లాడటంగానీ, ఎలా ఉన్నావ్, ఏం చేస్తున్నావని ఎప్పుడూ ఫోన్ చేయలేదని, ఇబ్బందుల్లో ఉన్న కూడా పట్టించుకోలేదని, ఆయన్ని నమ్మి చాలా మోసపోయానని, చాలా నష్టపోయానని తెలిపారు తన్మయ్.
ప్రేమించిన వాడు కూడా మోసం చేశాడు
డబ్బు, నమ్మకం చాలా పాపిష్టివి. ఒక మనిషిని బాగా చేయాలన్నా, నాశనం చేయాలన్నా ఈ రెండే కారణం. ఈ రోజుల్లో డబ్బు మీదనే అన్నీ నడుస్తున్నాయి. నో రిలేషన్స్, నో ఎఫెక్షన్స్. అరే మనకు ఎంత సహాయం చేశారనేది కూడా లేదు కొందరికి. నేను ఎంత సాయం చేశాననేది కిర్రాక్ ఆర్పీకి తెలుసు. ఆర్పీనే కాదు, ఒకడు ప్రేమించి మోసం చేశాడు. నీకు నేనున్నా అన్నాడు. ప్రేమ చూపించారు. అతనికి అన్నిరకాలుగా సహాయం చేశాను. ఆర్థికంగానూ సపోర్ట్ చేశాను. ఎనిమిదేళ్లు అతన్ని, అతని కుటుంబాన్ని చూసుకున్నా. కానీ తీరా నన్ను మోసం చేసి వెళ్లిపోయాడు. ఇక ప్రేమపై నమ్మకం లేదని, కొన్ని బయట చూస్తుంటే మళ్లీ ఇలాంటివి వద్దులే అనిపిస్తుంది. పెళ్లిపై కూడా ఆసక్తిలేదని తెలిపారు తన్మయ్. ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.