- Home
- Entertainment
- రీతూ చౌదరీ ప్లాన్ అంతా రివర్స్, మరో చీకటి కోణం బయటపెట్టిన హీరో ధర్మ మహేష్ భార్య.. కోలుకోలేని దెబ్బే
రీతూ చౌదరీ ప్లాన్ అంతా రివర్స్, మరో చీకటి కోణం బయటపెట్టిన హీరో ధర్మ మహేష్ భార్య.. కోలుకోలేని దెబ్బే
హీరో ధర్మ మహేష్ భార్య గౌతమి చేసిన ఆరోపణలు ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ రీతూ చౌదరీ మెడకు చుట్టుకుంటున్నాయి. హౌజ్‌లో ఆమె ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడమేకాదు, ఆమె ప్లాన్స్ అన్నింటిని తలక్రిందులు చేస్తున్నాయి.

బిగ్ బాస్ హౌజ్‌లో రీతూ రచ్చ
రీతూ చౌదరీ ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 9 షోలో రచ్చ చేస్తోన్న విషయం తెలిసిందే. తనదైన ఫైరింగ్ గేమ్‌తో ఆకట్టుకుంటోంది. మరోవైపు అటు డీమాన్ పవన్, ఇటు కళ్యాణ్‌తోనూ పులిహోర(రొమాంటిక్ రిలేషన్) కలుపుతూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది. అంతేకాదు నామినేషన్స్ లోనూ తగ్గేదెలే అంటోంది. మొత్తంగా ఎక్కువగా కెమెరాలో కనిపిస్తూ వార్తల్లో నిలుస్తోంది. నిజానికి తన టార్గెట్ కూడా అదే. ఎలాగైనా తాను పాపులర్ కావాలనేది. ఇప్పుడు షోలో అదే చేస్తుంది. కానీ బయట చోటు చేసుకున్న ఒక సంఘటన ఇప్పుడు ఆమె ప్లాన్స్ అన్నింటిని తలక్రిందులు చేస్తోంది. క్రేజ్ కాస్త బ్యాడ్ నేమ్‌గా మారుతుంది. ఆమె ఇమేజ్ డ్యామేజ్ చేస్తోంది.
చీకటి కోణం బయటపెట్టి ధర్మ మహేష్ భార్య
రీతూ చౌదరీకి సంబంధించిన చీకటి కోసం బయటపెట్టింది యంగ్ హీరో ధర్మ మహేష్ భార్య గౌతమీ చౌదరీ. `సింధూరం`, `డ్రింకర్ సాయి` చిత్రాలతో హీరోగా ఆకట్టుకున్నాడు ధర్మమహేష్. తన భార్యతో గొడవల విషయంలో ఆ మధ్య వార్తల్లోకి ఎక్కారు. వరకట్న వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా ధర్మ మహేష్ భార్య గౌతమీ మరో సంచలన విషయాన్ని బయటపెట్టింది. ధర్మ మహేష్‌కి, రీతూ చౌదరీతో ఉన్న ఎఫైర్‌ని లీక్ చేసింది. సీసీ కెమెరా వీడియోలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రీతూ జీవితంలోని చీకటి కోణాన్ని, తన భర్త ధర్మమహేష్ బండారాన్ని బయటపెట్టింది. వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని ఆమె ఆరోపించింది. అంతేకాదు రీతూ విషయంలో తమ మధ్య జరిగిన కన్వర్జేషన్‌ని ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
నా బిడ్డ సంతోషాన్ని లాగేసుకుంది, నరకం చూపించారు
ఎంత ఫ్రెండ్స్ అయినా అర్థరాత్రి ఒంటి గంటకు వచ్చి నాలుగు గంటల వరకు ఉంటారా? అని ప్రశ్నించింది. 2023లో తాను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు రీతూ వల్ల తనతో మహేష్ గొడవపడ్డాడని గౌతమి తెలిపింది. తన పుట్టిన రోజున ఫోన్‌లో ఛాటింగ్ చేస్తే చూశాను. రీతూ గురించి ఆరా తీసినందుకే తనను దూరం పెడుతున్నావా? అని మహేష్‌తో గౌతమి చేసిన వాట్సాప్ ఛాట్ స్క్రీన్ షాట్లను ఆమె లైవ్‌లో బయటపెట్టింది. ఓ యువతి తన జీవితాన్ని నరకంలా మార్చిందని తనతోపాటు తన బిడ్డ సంతోషాన్ని ఆమె లాగేసుకుందని గౌతమి ఆరోపించారు. ఆ అమ్మాయి ఫ్లాట్‌కి వెళ్తున్న 3 నెలల ఫుటేజ్ తన దగ్గర ఉందని, 2023లో వీళ్లిద్దరికీ ఎఫైర్ నడిచిందని తెలుసు కానీ, ఇప్పటికీ కంటిన్యూ అవుతుందని తాను అనుకోలేదని, తన ఖరీదైన ఫుట్‌వేర్ కూడా మిస్ అయినట్టు చెప్పింది గౌతమి. తనని ఫ్లాట్‌కి రానివ్వడం లేదని, అయితే తన ఫుట్‌వేర్ చూసుకోవడానికి వెళ్లి ఫుటేజ్ చెక్ చేస్తే ఈ అమ్మాయి రోజూ ఆ ఫ్లాట్‌కి వస్తున్నట్టుగా తేలిందని చెప్పింది.
బాధితుల వైపు నిలబడాలని గౌతమీ ఆవేదన
అంతేకాదు తాజాగా ప్రెగ్నెంట్ సమయంలో జరిగిన సంఘటనలు కూడా పంచుకుంది. ఆ సమయంలోనే తనని టార్చర్ చేశారని, తాను ఎంతో క్షోభని అనుభవించానని, ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు తాను మానసికంగా ఇబ్బంది పడుతున్న వీడియోని పంచుకుంది గౌతమి. తనని, తన బిడ్డ సంతోషాన్ని లాక్కున్నారని, ప్రశాంతత లేదని తెలిపింది. ఈ విషయంలో ఇన్‌ఫ్లూయెన్సర్లు, బిగ్ బాస్ ఆర్టిస్ట్ లు, మీమర్స్ ఆలోచించాలని, బాధితుల వైపు నిలబడాలని ఆమె కోరుతుంది. అదే సమయంలో ధర్మ మహేష్ చాటింగ్‌ని వెల్లడించింది. తన నాన్నకి ఆయన పెట్టిన మెసేజ్‌లను పోస్ట్ చేసింది. ఇవన్నీ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
గతంలో రూ.700కోట్ల ల్యాండ్ కబ్జా కేసులో రీతూ పేరు
ఈ రచ్చ అంతా ఇప్పుడు రీతూ చౌదరీ మెడకు చుట్టుకుంటోంది. ఆమెకి దారుణమైన బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ అవుతోంది. గతంలోనే ఆమె రూ.700కోట్ల ల్యాండ్ కబ్జా విషయంలో ఆరోపణలు ఎదుర్కొంది. ఇది కేసుల వరకు వెళ్లింది. అయితే ఇందులో తన ప్రమేయం లేదని, తనకు ఈ విషయాలు తెలియవని వెల్లడించింది రీతూ. తన భర్త చీమకూర్తి శ్రీకాంత్ స్పందించి `మొదటి నుంచి నా ఫ్యామిలీ టాక్స్ కరెక్ట్ గా పే చేస్తున్నాం.. రీతూ చౌదరి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ పూర్తిగా నాకు చెందినవి, మేము సంపాదించుకున్నవి అని, నేను ఎవరికీ బినామీని కాదు. నాపై వస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తవం` అని అన్నారు. అంతటితో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ఈ క్రమంలో ఇప్పుడు రీతూ చౌదరీ మరో వివాదంలో ఇరుక్కోవడం గమనార్హం.
రీతూ చౌదరీ ప్లాన్స్ అన్నీ రివర్స్
ఇదంతా ఇప్పుడు రీతూ చౌదరీ బిగ్ బాస్ షో పై ప్రభావం పడుతుంది. ఆమె ఈ వారం నామినేషన్‌లో ఉంది. ఆమెకి చాలా తక్కువ ఓటింగ్ పడుతుంది. ఓటింగ్‌లో లీస్ట్ లో ఉండిపోయింది. దీనికి ఈ ధర్మ మహేష్ భార్య ఆరోపణలే కారణమని తెలుస్తోంది. అయితే తనపై ఉన్న గతం తాలూకు నెగటివ్ ఇమేజ్‌ని క్లీన్ చేసుకోవడానికి, తానేంటో నిరూపించుకోవడానికి, టైటిల్ విన్నర్ కావాలనే లక్ష్యంతో హౌజ్‌లోకి వెళ్లింది రీతూ. దానికి మించి మంచి క్రేజ్‌ని, పాపులారిటీని పొందాలని భావించింది. కానీ ఇప్పుడు ఆమె ప్లాన్స్ అన్నీ తలక్రిందులవుతున్నాయి. నెగటివ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ప్రస్తుతం స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న రీతూ ఈ వివాదం కారణంగా డౌన్ కాబోతున్నట్టు తెలుస్తోంది. కేవలం డౌన్ కావడమే కాదు, అది ఆమె ఎలిమినేషన్‌కి దారితీసినా ఆశ్చర్యం లేదని బిగ్ బాస్ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. రీతూ బిగ్ బాస్ షోలో ఉండటం వల్ల ఈ ఇష్యూ మరింతగా హైలైట్ అవుతుంది. మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఈ ప్రభావం ఆమెపై గట్టిగా పడబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.