MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi: చిరంజీవి మూవీ బ్లాక్ టికెట్స్ గురించి స్టార్ డైరెక్టర్ హాట్ కామెంట్స్

Chiranjeevi: చిరంజీవి మూవీ బ్లాక్ టికెట్స్ గురించి స్టార్ డైరెక్టర్ హాట్ కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి కూడా తగ్గించిన టికెట్ ధరలపై ప్రభత్వం పునరాలోచించాలని రెండుమూడుసార్లు రిక్వస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్, నాని, ఆర్జీవీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Jan 07 2022, 11:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా టికెట్ ధరల గురించి హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. కొంతమంది మాత్రమే ఈ సమస్య గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. మిగిలిన స్టార్స్, నిర్మాతలు, దర్శకులు ఆ సాహసం చేయనప్పటికీ లోలోపల మాత్రం చర్చించుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వం థియేటర్స్ పై ఆంక్షలు విధిస్తూ టికెట్ ధరల్ని తగ్గించిన సంగతి తెలిసిందే. అభిమానాన్ని క్యాష్ చేసుకుంటున్నారు అనేది ప్రభుత్వ వాదన అయితే.. నిర్మాతకు, ప్రేక్షకుడికి లేని సమస్య ప్రభుత్వానికి ఎందుకు అనేది చిత్ర పరిశ్రమ వాదన. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

మెగాస్టార్ చిరంజీవి కూడా తగ్గించిన టికెట్ ధరలపై ప్రభత్వం పునరాలోచించాలని రెండుమూడుసార్లు రిక్వస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్, నాని, ఆర్జీవీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమస్యతో సంబంధం లేనప్పటికీ తాజాగా స్టార్ డైరెక్టర్ బి గోపాల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

 

36

తమ అభిమాన హీరో కోసం ఫ్యాన్స్ టికెట్స్ దొరక్కుంటే ఎంత వెచ్చించి అయినా బ్లాక్ లో కొంటారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఇంద్ర చిత్రం ఒకటి. బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2002లో విడుదలై అఖండ విజయం అందుకుంది. ఈ చిత్ర విశేషాల గురించి దర్శకుడు బి గోపాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 

 

46

అప్పట్లో ఫ్యాక్షన్ మూవీస్ అంటే బాలకృష్ణ మాత్రమే గుర్తుకు వచ్చేవాడు. కానీ మెగాస్టార్ నటించిన ఏకైక ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ ఇంద్ర. ఈ చిత్రంలో చిరంజీవి డైలాగులు, డ్యాన్సులు, ఫైట్స్ ప్రతి ఒక్కటి అభిమానులని ఉర్రూతలూగించాయి. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, రాననుకున్నారా రాలేననుకున్నారా అంటూ చిరు చెప్పిన డైలాగ్స్ మోతెక్కించాయి. 

 

56

ఆ చిత్రం సృష్టించిన ప్రభంజనం తన కెరీర్ లో గొప్ప అనుభూతి అని బి గోపాల్ అన్నారు. రాష్ట్రం నలువైపులా నుంచి ఇంద్ర చిత్ర గురించి వస్తున్న వార్తలు తెలుసుకుని ఆశ్చర్యపోయాను అని బి గోపాల్ తెలిపారు. ఆ చిత్రం సృష్టించిన సెన్సేషన్, బ్లాక్ బస్టర్ టాక్ తో నాకు వరుసగా ఫోన్లు వచ్చాయి. 

 

66

అప్పట్లో మహా అయితే బ్లాక్ లో టికెట్స్ ని 500 పెట్టి కొనేవారు. కానీ మదనపల్లిలో ఓ వ్యక్తి రూ.10 వేల కట్ట అలాగే ఇచ్చేసి 5 టికెట్లు తీసుకున్నాడు. ఆ సంగతి తెలుసుకుని ఆశ్చర్యపోయినట్లు బి గోపాల్ చెప్పుకొచ్చారు. ఇంద్ర చిత్రం విడుదలైన టైంలోనే మాకు ఓ ఐపీఎస్ అధికారి డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆమెతో మాతో మాట్లాడుతూ.. సాధారణంగా కొత్త సినిమాలు విడుదలైతే ఎస్సై, కానిస్టేబుల్స్ వెళ్లి జనాలని కంట్రోల్ చేస్తారు. కానీ ఇంద్ర చిత్రానికి ఎస్పీ స్థాయిలో ఉన్న తనలాంటి అధికారులు స్వయంగా వెళ్లి జనాల్ని కంట్రోల్ చేయాల్సి వచ్చిందని ఆమె చెప్పినట్లు బి గోపాల్ తెలిపారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: కమెడియన్ సత్య నుంచి ధనుష్ వరకు, ఓటీటీలోకి దిగుతున్నారుగా.. ఈ వారం తప్పక చూడాల్సిన మూవీస్ ఇవే
Recommended image2
Celebrity brothers: ఒకరు సూపర్ స్టార్, మరొకరు ఫ్లాప్ స్టార్.. ఇండియన్ సినిమాలో సెలెబ్రిటీ బ్రదర్స్ వింత కథ!
Recommended image3
Balakrishna: బాలయ్య గురించి గుండెలపై చేయి వేసుకుని చెప్పిన డైరెక్టర్.. ఆమె వల్లే మళ్ళీ స్టార్ట్ చేశా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved