- Home
- Entertainment
- స్టార్ డైరెక్టర్ కొడుకునైనా.. సెట్ లో టీ, కాఫీలు మోశా.. ఆకాశ్ పూరీ షాకింగ్ కామెంట్స్..
స్టార్ డైరెక్టర్ కొడుకునైనా.. సెట్ లో టీ, కాఫీలు మోశా.. ఆకాశ్ పూరీ షాకింగ్ కామెంట్స్..
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆకాశ్ పూరి (Akash Puri) మాస్ కంటెంట్ తో ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు. మాస్ హీరోగా ముద్ర వేసుకునేందుకు సినిమా సినిమాకు బాగా కష్టపడుతున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని పలు విషయాలను పంచుకున్నాడు.

యంగ్ హీరో ఆకాష్ పూరీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘చోర్ బజార్’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధమైంది. జార్జ్ రెడ్డి ఫేమ్ దర్శకుడు జీవన్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. యంగ్ అండ్ టాలెండెట్ హీరో ఆకాష్ పూరి సరసన ముంబయి బ్యూటీ గెహనా సిప్పీ నటిస్తోంది.
Chor Bazaar నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నందమూరి బాలకృష్ణ విడుదల చేసిన ‘చోర్ బజార్’ ట్రైలర్‌కి విశేషమైన స్పందన లభించింది.ప్రతిష్టాత్మక యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జూన్ 24న మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
ఈ క్రమంలో చిత్ర ప్రచార కార్యక్రమాలను యూనిట్ జోరుగా నిర్వహిస్తోంది. ఇటీవల ‘అలీతో సరదాగా’ టాక్ షోకు ఆకాశ్ పూరి హాజరయ్యారు. అలీ అడిగిన అన్ని ప్రశ్నలకు అద్భుతంగా బదులిచ్చాడు. ఈ సందర్భంగా స్టార్ డైరెక్టర్ కొడుకైనప్పటికీ క్లీనింగ్ బాయ్ గా, ప్రొడక్షన్ బాయ్ గా సెట్స్ లోటీ, కాఫీలు మోశానని తెలిపారు.
పూరీ జగన్నాథ్ గురించి చెబుతూ.. ‘నాన్న చాలా క్రమశిక్షణగా ఉంటారు. ఏదైమనా కష్టపడితే ఫలితం వస్తుందని బాగా నమ్ముతాడు. ప్రతి పనిని చాలా కొత్తగా చేయాలనే తపన ఉంటుంది. మరోవైపు బద్ధకంగా ఉంటే ఆయనకు అస్సలు నచ్చదు. అందుకే ఏదోక పనిచేస్తూ ఉండాలంటాడు. అదే క్రమంలో నా టెన్త్ క్లాస్ చేరే సమయానికి నేను చదువు మానేస్తానని చెప్పాను.
కొద్ది రోజుల తర్వాత ఖాళీగా ఉంటున్నానే నేపంతోనూ.. స్టార్ కిడ్ ను అనే ధ్యాస నాలో ఉండకూదనే ఆలోచనతో మా నాన్న (Puri Jagannadh) నాకు జిమ్ లో పార్ట్ టైం జాబ్ చూశాడు. అక్కడ పూరీ జగన్నాథ్ కొడుకునని తెలియడంతో వారు తీసేశారు. నాకూ స్వశక్తితో ఎదగాలని ఉంటుంది. అందుకు నాన్న ఏం చెప్పినా నాకు హ్యాపీగా ఉంటుంది.
మాస్ మహారాజ రవితేజ (Raviteja) నటించిన ‘నేనింతే’ చిత్రానికి నేను టీ, కాఫీలు సైతం మోశాను. ఆ రోజు ప్రొడక్షన్ బాయ్స్ తక్కువగా ఉండటంతో నాన్న నన్ను సెట్ బాయ్ గా రోజంతా పనిచేయాలని చెప్పాడు. దీంతో రోజంతా సెట్ లోని రవితేజ, హీరోయిన్ మిగితా యాక్ట్రెస్ అందరికీ కాఫీ, టీలు అందించాను. వారు మాత్రం నన్ను ఆకాశ్ అంటూ దగ్గరికి తీసుకునే వారు. కానీ నాన్న మాత్రం నీకు చెప్పిన పని పూర్తి చేయ్ అని మాత్రమే అనేవాడు.
అందుకు నేను ఏమాత్రం ఫీలవలేదు. ఎందుకంటే.. నాన్న ఎప్పుడూ గ్రౌండ్ నుంచి ఎదగాలని చెబుతుంటాడు. అప్పుడే జీవితంలో స్ట్రాంగ్ గా ఉంటామని నమ్మే వ్యక్తి. ఆయన చేత ఎప్పుడూ గుడ్ బాయ్ అనిపించుకునేందుకు చాలానే కష్టపడుతుంటాను. ఇప్పటి వరకు ఎప్పుడూ నన్ను ఆయన తిట్టలేదు.’ అని చెప్పుకొచ్చాడు.
ఆకాశ్ పూరి చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం. ‘బుజ్జిగాడు’, ‘చిరుత’, ‘గబ్బర్ సింగ్’ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా వర్క్ చేశాడు. ఆంధ్రపోరి సినిమాతో హీరోగా తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయ్యాడు. తర్వాత ‘రొమాంటిక్’తో దుమ్ములేపాడు. ప్రస్తుతం ‘చోర్ బజార్’తో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు.