భోజనానికి కూర్చుంటే లేపేశారు, టాలీవుడ్ స్టార్ కమెడియన్ సినిమా కష్టాలు
ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రయాణం ఈజీ కాదు. స్టార్ డమ్ వచ్చే వరకూ ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది. ఈక్రమంలోనే ఓ స్టార్ కమెడియన్ తన కెరిర్ బిగినింగ్ లో ఫేస్ చేసిన ఘోర అవమానాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్లు గా వెలుగు వెలుగుతున్నవారు ఎందరో ఆ కాలంలో ఇబ్బందులు ఫేస్ చేసినవారే. కెరీర్ బిగినింగ్ లో స్టూడియో గేట్ల దగ్గర పడిగాపులు పడి, ఆతరువాత అదే స్టూడియోల్లోకి కాస్ట్లీ కార్లలో ఎంట్రీ ఇచ్చినవారు ఎందరో ఉన్నారు. అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగిన వారు, ప్రస్తుతం ఎండకన్ను ఎరగకుండా భారీ బంగ్లాల్లో బ్రతుకుతున్నారు. అయితే వారిలో ఎంతో మంది గతాన్ని గుర్తు పెట్టుకుని ఒదిగి ఉంటారు.
జీవితంలో పడ్డ కష్టాలను మర్చిపోకుండా డబ్బు, పని విలువ తెలసుకోగలిగి ఉంటారు. అటువంటి వారు తమ గతాన్ని గుర్తు చేసకోవాడానికి ఏమాత్రం సిగ్గుపడరు. నలుగురికి ఆదర్శంగా బ్రతుకుతుంటారు. ఇండస్ట్రీలో ఇబ్బందులు ఫేస్ చేసిన వారిలో కమెడియన్లు కూడా ఉన్నారు. సునిల్, వేణుమాధవ్, శివారెడ్డి లాంటి కమెడి యాక్టర్లు కెరీర్ బిగినింగ్ లో అవకాశాల కోసం ఇబ్బందులు పడ్డవారే. మరీ ముఖ్యంగా శివారెడ్డి మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి, ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఫైల్ పట్టుకుని కాళ్లు అరిగేలా తిరిగాడు. సరైన తిండి కూడా లేకుండా ఎన్నో ఇబ్బందులు పడి, ఇండస్ట్రీలో సెటిల్ అయ్యాడు.
ఈక్రమంలో తనకు ఎదురైన అవామానాలను శివారెడ్డి ఓఇంటర్వ్యూలో వెల్లడించారు. గతంలో జరిగిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఆయన కొన్ని విషయాలు పంచుకున్నారు. అవకాశాల కోసం స్టూడియోల చుట్టు తిరుగుతున్న టైమ్ లో శివారెడ్డి ఓ సినిమా ఓపెనింగ్ కు వెళ్లారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ శివారెడ్డి ఏమన్నాడంటే? '' సినిమా పేరు చెప్పకూడదు కాని, అన్నపూర్ణ స్టూడియోలో మూవీ ఓపెనింగ్ కువెళ్లాను. ఏదైనా అవకాశం ఇస్తారేమో అని ఆశగా అక్కడికి వెళ్లాను. ఉదయం నుంచి ఏం తినలేదు. అప్పుడే అక్కడ భోజనాలు పెడుతున్నారు. ధైర్యం చేసుకుని తినడానికి వెళ్లి కూర్చున్నాను.
తినడానికి కూర్చొని ఉండగా..అప్పుడే ఎవరో వచ్చి మీరు ఎవరు అని అడిగారు. నాచేతిలో ఫైల్ చూసి వారికి అర్ధం అయ్యింది. నేను ఆర్టిస్టును అని చెప్పాను, ఈసినిమాలో సెలెక్ట్ అయ్యారా అని అడిగారు, లేదు అవకాశం కోసం వచ్చానని చెప్పాను. అయితే లేవండి..తరువాత కూర్చుందురుగాని,నెక్ట్స్ లైన్ లో తినవచ్చు అని అన్నారు. తినడానికి కూర్చుంటే లేపేశారు. తరువాత తినడం కాదు, వెళ్లిపొమ్మాని చెప్పారు. అది అర్ధం అయ్యింది. అలా తిండికి కూడా ఇబ్బందిపడుతూ.. అవకాశాల కోసం తిరిగాను అని కమెడియన్ శివారెడ్డి వెల్లడించారు. గతంలో జరిగిన ఇంటర్వ్యూలోని ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.