- Home
- Entertainment
- అల్లు అర్జున్ నుంచి చిరు, నాగార్జున వరకూ ప్రైవేట్ జెట్ కలిగి ఉన్న టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా?
అల్లు అర్జున్ నుంచి చిరు, నాగార్జున వరకూ ప్రైవేట్ జెట్ కలిగి ఉన్న టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా?
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సొంతంగా ప్రైవేట్ జెట్ ను కలిగి ఉన్న హీరోలు ఎవరో తెలుసా? కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోన్న స్టార్ హీరోలు ఎవరంటే?

ప్రైవేట్ జెట్ కలిగి ఉన్న టాలీవుడ్ హీరోలు
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు సినిమాల కోసం ఎంత కష్టపడతారో, ఆతరువాత వారు అంత లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. సినిమాల రెమ్యునరేషన్, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్స్, బిజినెస్ పెట్టుబడులతో కోట్ల రూపాయలు సంపాదించే ఈ స్టార్‌లు తమ ప్రయాణాల కోసం సొంతంగా ప్రైవేట్ జెట్‌లను కలిగి ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి ప్రముఖుల దగ్గర విలువైన ప్రైవేట్ విమానాలు ఉన్నట్లు సమాచారం. వీటిని వారు తమ సినిమా ప్రమోషన్లు, వ్యక్తిగత ప్రయాణాలు, రాజకీయ కార్యక్రమాల కోసం ఉపయోగిస్తున్నారు.
చిరంజీవి - రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్‌లోని అత్యంత ధనవంతులలో ఒకరు. ఆయనకు చార్టర్డ్ విమానం ఉంది. ఇదే విమానాన్ని ఆయన కుమారుడు రామ్ చరణ్ కూడా వినియోగిస్తారు. రామ్ చరణ్ కు కూడా సొంతంగా మరో చార్టెడ్ ప్లైట్ ఉంది. సినిమాల ప్రమోషన్ కోసం, కుటుంబంతో కలిసి ట్రావెల్ చేయడం కోసం వీరు దీనిని ఉపయోగిస్తారు. రామ్ చరణ్ ఇటీవలే ఓ ఎయిర్ లైన్స్ స్టార్టప్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తన భార్య ఉపాసనతో కలిసి ఎన్నో సార్లు చరణ్ విదేశీ ట్రిప్పులకు వెళ్లారు.
నాగార్జునకు ప్రత్యేకమైన ప్రైవేట్ జెట్
రీసెంట్ గా 66 వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు టాలీవుడ్ కింగ్, అక్కినేని నాగార్జున. తెలుగు సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆయన రీసెంట్ గా తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టాడు. సినిమాలతో పాటు వందల కోట్ల విలువైన వ్యాపారాలు కలిగి ఉన్న నాగర్జునకు సొంతంగా ఒక ప్రైవేట్ జెట్ ఉంది. కుటుంబంతో కలిసి తరచూ ఈ విమానంలో ప్రయాణించారని సమాచారం. సినిమా షూటింగ్‌లు, సెలవుల ట్రిప్స్ కోసం ఈ విమానాన్ని వినియోగిస్తారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్
'పుష్ప' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అల్లు అర్జున్, తన సినిమా ప్రమోషన్ కోసం తన సొంత ప్రైవేట్ జెట్‌ను వినియోగించారు. అల్లు అర్జున్ ప్రయాణిస్తున్న సమయంలో నటి రష్మిక మందన్నా తీసిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం. అంతే కాదు గతంలో అల్లు ఫ్యామిలీ అంతా వెకేషన్ కోసం ప్రైవేట్ జెట్ ను ఉపమోగించిన ఫోటోలు ఉన్నాయి. ఆ విమానం అల్లువారి సొంతమని సమాచారం.
సూపర్ స్టార్ మహేష్ బాబు
టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో ఒకరైన మహేష్ బాబు కూడా సొంతంగా విమానం కలిగి ఉన్నారు. ఏడాదికి ఒక్క సినిమా చేసే మహేష్ ఎక్కువగా ఫ్యామిలీతో టైమ్ గడుపుతుంటారు. విదేశీ ప్రయాణాలు ఎక్కువగా చేసే ఆయన కొన్నిసమయాల్లో మాత్రమే తనప్రైవేట్ జెట్ ను ఉపయోగిస్తుంటారు. అవసరమైనప్పుడు మాత్రమే ఆయన తన సొంత ప్రైవేట్ విమానంలో భార్య నమ్రత, పిల్లలతో కలిసి ప్రయాణిస్తుంటారు.
జూనియర్ ఎన్టీఆర్ 80 కోట్ల జెట్
నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక విలువైన ప్రైవేట్ జెట్‌ను కలిగి ఉన్నారు. ఈ జెట్ విలువ దాదాపు 80 కోట్లు అని సమాచారం. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ విమానం పార్క్ చేసి ఉంటుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రయాణాల కోసం ఎన్టీఆర్ దీనిని వినియోగిస్తారు.
పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రంగంతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్‌లు, రాజకీయ సభలు, పర్యటనల కోసం ఆయన సొంత ప్రైవేట్ జెట్‌ను వినియోగిస్తున్నారని సమాచారం. వీరితో పాటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా సొంత జెట్ ను కలిగి ఉన్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు తమ విలాసవంతమైన లైఫ్ స్టైన్ ను చూపించడానికి అప్పుడప్పుడు తమ ప్రైవేట్ జెట్‌లను బయటకు తీస్తుంటారు. వీటిని వారు సినిమా, కుటుంబం, రాజకీయ అవసరాల కోసం వినియోగిస్తుంటారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా సొంత జెట్ ను కలిగి ఉన్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు తమ విలాసవంతమైన లైఫ్ స్టైన్ ను చూపించడానికి అప్పుడప్పుడు తమ ప్రైవేట్ జెట్‌లను బయటకు తీస్తుంటారు. వీటిని వారు సినిమా, కుటుంబం, రాజకీయ అవసరాల కోసం వినియోగిస్తుంటారు.