- Home
- Entertainment
- బండ్ల గణేష్ మాదిరి నన్ను కూడా ఈవెంట్ కి రాకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారు... అనుమానాస్పదంగా సుమ కామెంట్స్
బండ్ల గణేష్ మాదిరి నన్ను కూడా ఈవెంట్ కి రాకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారు... అనుమానాస్పదంగా సుమ కామెంట్స్
బుల్లితెర స్టార్ సుమ చేసిన లేటెస్ట్ కామెంట్స్ పలు అనుమానాలకు దారితీశాయి. ఆమె ఫ్లో చెప్పేసిన ఈ మాటలు వెనుక ఆంతర్యం ఏమిటని అందరూ ఆరా తీస్తున్నారు. బండ్ల గణేష్ ని ఈవెంట్స్ రాకుండా అడ్డుకున్నట్లు నన్ను కూడా కొందరు అడ్డుకుంటున్నారని ఆమె చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Bandla Ganesh -suma
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముందు ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బండ్ల గణేష్ దర్శకుడు త్రివిక్రమ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఓ ఆడియో రికార్డు బయటికొచ్చింది. పవన్ అభిమాని ఒకరు బండ్ల గణేష్ కి ఫోన్ చేసి.. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావాలని కోరాడు. దానికి బండ్ల రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓ అదిరిపోయే స్పీచ్ కూడా సిద్ధం చేశాను.
Bandla Ganesh -suma
కాకపోతే ఆ త్రివిక్రమ్ నన్ను రానీయడం లేదు. నేనొస్తే తాను డామినేట్ అవుతాడని, నన్ను రానీయకుండా చేస్తున్నాడు. నాకు ఆహ్వానం లేదని అంటాడు. అయితే నేను వేదిక బయటే ఉంటాను. మీరందరూ బండ్లన్న అంటూ నినాదాలు చేయడం, అప్పుడు నేను లోపలి వస్తాను అంటూ.. సదరు అభిమానితో బండ్ల గణేష్ చెప్పారు. ఈ ఆడియో వైరల్ కాగా బండ్ల గణేష్ ఖండించారు. అది నా వాయిస్ కాదు, గిట్టనివారు చేశారంటూ కొట్టిపారేశారు.
Bandla Ganesh -suma
అనూహ్యంగా భీమ్లా నాయక్ ఫ్రీరిలీజ్ ఈవెంట్ కి బండ్ల గణేష్ రాలేదు. అలాగే త్రివిక్రమ్ వేదికపై మాట్లాడలేదు. ఈ సంఘటన తర్వాత బండ్ల గణేష్, పవన్ మధ్య గ్యాప్ పెరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి.
తాజాగా ఈ ఉదంతాన్ని యాంకర్ సుమ గుర్తు చేశారు. మే 27న విడుదల కానున్న ఎఫ్ 3 మూవీ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించగా సుమ యాంకర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఎప్పటిలాగే అనేక పంచెస్ విసిరిన సుమ, బండ్ల గణేష్ పై కూడా పంచ్ విసిరారు. బండ్ల గణేష్ మాదిరి నన్ను కూడా ఎఫ్ 3 ఈవెంట్ కి రాకుండా కొందరు అడ్డుకున్నారంటూ కామెంట్ చేశారు.
సుమ చేసిన ఈ కామెంట్ వెనుక కారణం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఆమె సరదాగా ఆ పంచ్ విసిరారా.. లేక నిజంగానే వేదికకు రాకుండా ఎవరైనా అడ్డుకుంటున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సుమ కామెంట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.