- Home
- Entertainment
- క్రాప్ టాప్ లెహంగాలో చందమామలా మెరిసిన శ్రీముఖి... సాంప్రదాయ కట్టులో మెస్మరైజ్ చేసిన అమ్మడు!
క్రాప్ టాప్ లెహంగాలో చందమామలా మెరిసిన శ్రీముఖి... సాంప్రదాయ కట్టులో మెస్మరైజ్ చేసిన అమ్మడు!
ఆయుధం లేకుండా అందాలతో చంపేస్తుంది శ్రీముఖి. విచ్చలవిడిగా అందాల ప్రదర్శన చేస్తూ పిచ్చెక్కిస్తుంది. శ్రీముఖి వరుస ఫోటో షూట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Sreemukhi
మరోవైపు యాంకర్ గా జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది.శ్రీముఖి సంపాదన కోట్లకు చేరిన నేపథ్యంలో ఇటీవల లగ్జరీ హౌస్ నిర్మించుకున్నారు. హైదరాబాద్ లో సొంతింటి కల నెరవేర్చుకున్నారు. నటిగా, యాంకర్ గా ఆమె రాణిస్తున్నారు.
Sreemukhi
అరడజనుకు పైగా షోలకు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. షోల పరంగా చూస్తే శ్రీముఖినే నంబర్ వన్ యాంకర్. సుమ, రష్మీ కూడా ఈ విషయంలో శ్రీముఖి వెనుకే.
Sreemukhi
శ్రీముఖి కెరీర్ పరిశీలిస్తే... పటాస్ షోతో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి అనతి కాలంలో గుర్తింపు తెచ్చుకున్నారు. పటాస్ కొంత మేర సక్సెస్ అయిన నేపథ్యంలో శ్రీముఖికి మెల్లగా ఆఫర్స్ క్యూ కట్టాయి.
Sreemukhi
బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి పాల్గొన్నారు. తన ఆటతీరుతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరింది. బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ కోసం పోటీ పడిన శ్రీముఖి రన్నర్ గా మిగిలారు. రాహుల్ సిప్లిగంజ్ ఆ సీజన్ విన్నర్ అయ్యారు.
Sreemukhi
స్టార్ యాంకర్ కావడంతో శ్రీముఖికి భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. టైటిల్ విన్నర్ కంటే కూడా శ్రీముఖినే ఎక్కువగా లబ్ధి పొందారన్న మాట వినిపించింది. అప్పటి నుండి శ్రీముఖికి అవకాశాలు పెరుగుతూ వచ్చాయి.
Sreemukhi
యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండితెరపై కూడా రాణించాలని ఆమె కోరుకుంటుంది. దానిలో భాగంగా... క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. . అనసూయ, రష్మీ మాదిరి నటిగా బిజీ కావాలని కోరుకుంటున్నారు.
Sreemukhi
శ్రీముఖి స్టార్ హీరోయిన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చిరంజీవి భోళా శంకర్, బాలకృష్ణ-అనిల్ రావిపూడి చిత్రాల్లో శ్రీముఖి నటిస్తున్నారట. భోళా శంకర్ లో మెగాస్టార్ తో ఆమెకు రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయనే ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
Sreemukhi
అలాగే బాలయ్య 108వ చిత్రంలో కూడా శ్రీముఖి కీలక రోల్ చేస్తున్నారట. ఈ మేరకు టాలీవుడ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. క్రేజీ అంకుల్స్ మూవీతో శ్రీముఖి హీరోయిన్ అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. పలు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.
Sreemukhi
కాగా శ్రీముఖి వివాహం అంటూ తరచుగా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.ఈ వార్తలపై శ్రీముఖి మండిపడ్డారు. తన వ్యక్తిగత విషయాల మీద నిరాధార కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడుతున్నారు. మా నాన్న ఫోటో బ్లర్ చేసి పెళ్లి కొడుకు అంటూ ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.