బుల్లితెర ఈ హాట్ యాంకర్ ని గుర్తు పట్టారా? మేకప్ లేకపోతే ఇలా ఉంటుందా!
గ్లామర్ ఫీల్డ్ లో అందమే పెట్టుబడి. అందుకే హీరోయిన్స్, యాంకర్స్ సాధ్యమైనంత అందంగా కనిపించే ప్రయత్నం చేస్తారు. ఉన్న గ్లామర్ కి మెరుగులు పెట్టే ప్రయత్నం చేస్తారు. అలాగే మేకప్ లేకుండా పబ్లిక్ లో కనిపించడానికి ఇష్టపడరు.

Rashmi Gautam
అయితే స్టార్ యాంకర్ రష్మీ (Rashmi Gautam)దీనికి భిన్నంగా ఉన్నారు. ఆమె తరచుగా తన మేకప్ లెస్ లుక్స్ రివీల్ చేస్తుంది. తాజాగా ఓ రెస్టారెంట్ లో ఫుడ్ ఎంజాయ్ చేస్తున్న రష్మీ మేకప్ లేకుండా కనిపించారు. బుల్లితెరపై కురచబట్టల్లో సూపర్ హాట్ గ్లామర్ తో మెస్మరైజ్ చేసే రష్మీ... సదా సీదా లుక్ షాక్ ఇస్తుంది. ఒక విధంగా ఆమెను గుర్తించడం కష్టంగా ఉంది.
Rashmi Gautam
ఇలాంటి సాహసం చేయాలంటే గట్స్ ఉండాలి. నాకు నచ్చినట్లు ఉంటానంటున్న రష్మీ ఇలాంటి షాకింగ్ లుక్స్ లో దర్శనమిస్తుంది. ఏది ఏమైనా ఆమె పబ్లిక్ లో కనిపిస్తే జంక్షన్ జామ్ కావలసిందే. ఓ టీవీ యాంకర్ కి ఈ రేంజ్ క్రేజ్ అంటే సాధారణ విషయం కాదు.
Rashmi Gautam
రష్మీ పబ్లిక్ లోకి వస్తే చాలు, చూడడానికి జనాలు ఎగబడిపోతారు. ఆమెతో ఫోటో దిగడానికి సాహసాలు చేస్తారు. ఫ్యాన్స్ అభిమానం అప్పుడప్పుడు ఆమెకు తలనొప్పులు కూడా తెచ్చిపెడుతుంది. ఆ మధ్య ఓ బట్టల షాప్ ఓపెనింగ్ కి వెళ్లగా, కుర్రాళ్ళు ఆమెను చూడడానికి పోటీపడ్డారు. సరైన భద్రత, సెక్యూరిటీ కూడా లేకపోవడంతో జనాల మధ్య రష్మీ నలిగిపోయారు.
Rashmi Gautam
రష్మీ క్రేజ్ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేస్తుందని అందరూ భావించారు. అయితే బుల్లితెర కలిసొచ్చినంతగా ఆమెకు వెండితెర కలిసి రావడం లేదు. హీరోయిన్ గా పలు ఆఫర్స్ దక్కినా, హిట్ అనేది దక్కలేదు. దీంతో ఆమెకు చిన్నగా అక్కడ ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి.
Rashmi Gautam
ప్రస్తుతం రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ విడుదల కావాల్సి ఉంది. నందు హీరోగా నటించిన ఈ చిత్రంలో రష్మీ గౌతమ్ పల్లెటూరి అమ్మాయి పాత్ర చేశారు.ట్రైలర్ కూడా విడుదల చేశారు. సినిమా మాత్రం విడుదల కావడం లేదు. చిన్న చిత్రాలు థియేటర్స్ విడుదల కావడం ఈ రోజుల్లో గగనంగా ఉంది.
Rashmi Gautam
మరోవైపు రష్మీని ఢీ సీజన్ 14 నుండి తొలగించారు. అలాగే సుడిగాలి సుధీర్, జడ్జి పూర్ణ, దీపికా పిల్లిని సైతం తొలగించడం జరిగింది. వీళ్ల సారథ్యంలో షో సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. మరి ఢీ నిర్వాహకులు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదు. వీరి నిష్క్రమణతో రేటింగ్ కూడా బాగా తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి.
Rashmi Gautam
సుధీర్, రష్మీ తమకు తామే షో నుండి తప్పుకున్నారా? లేక నిర్వాహకులు పక్కనబెట్టారనేది తెలియదు. ఢీ షో ప్రేక్షకులు మాత్రం ఈ జంటలు బాగా మిస్ అవుతున్నారు. ఇక వెండితెరపై రష్మీ తగ్గింది.
Rashmi Gautam
ఆమెకు గతంలో హీరోయిన్ వరుస ఆఫర్స్ దక్కేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కనీసం ఐటెం సాంగ్స్ చేసే ఛాన్స్ కూడా రావడం లేదు. చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్ మూవీలో రష్మీ నటిస్తున్నారు.