ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపిస్తూ.. చీర కట్టులో పిచ్చెక్కిస్తున్న రష్మీ గౌతమ్..
చీరకట్టులో చంపేస్తోంది స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్. వరుసగా టీవీ షోలతో బిజీ బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో రకరకాల ఫోటో షూట్లతో మతి పొగోడుతోంది.
నెట్టింట రష్మీ అందాల విందుకు హద్దులు లేకుండా పోతున్నాయి. పొట్టి గౌను వేసుకున్నా.. నిండుగా చీర కట్టుకున్నా.. చిరునవ్వులు చిందిస్తూ.. జబర్థస్త్ యాంకర్ చేసే అద్భుతానికి ఫ్యాన్స్ తో పాటు.. నెటిజన్లు అంతా ఫిదా అవుతున్నారు. ఎప్పుడెప్పుడు రష్మీ కొత్త ఫోటోలు పెడుతుందా అని ఎదురుచూస్తున్నారు.
ఈక్రమంలోనే రోజుకో రకమైన ఫోటో షూట్లతో రచ్చ చేస్తోంది రష్మీ గౌతమ్. తాజాగా చీరకట్టులో మెరిసింది బుల్లితెర బ్యూటీ. క్లాసిక్ శారీ కట్టులో.. పద్దతిగా కనిపించింది. టెలివిజన్ బుట్టబొమ్మ. ఎప్పుడూ పొట్టిబట్టలతో కనిపించే బ్యూటీ.. ఈసారి నిండుగా అచ్చ తెలుగు ఆడపిల్లలా మారింది.
చీరకట్టు కట్టినా.. రష్మీ ఫోజులు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపిస్తూ.. పిచ్చెక్కిస్తోంది.. అందమైన కురులు, చిరునవ్వులు చిందించే మోముతో.. కుర్ర కారుకు వెర్రెక్కిస్తోంది బ్యూటీ. ప్రస్తుతం రష్మీ శారీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇండస్ట్రీకి హీరోయిన్ అవ్వాలని వచ్చింది రష్మీ. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కూడా. కాని తాజాగా రష్మీ వెండితెర కెరీర్ నెమ్మదించింది. వరుస ప్లాప్స్ ప్రతికూల ప్రభావం చూపాయి. రష్మీ హీరోయిన్ గా నటించిన చివరి చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. ఏళ్ల తరబడి విడుదలకు నోచుకోని ఈ చిత్రాన్ని గత ఏడాది విడుదల చేశారు. పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ కమర్షియల్ గా ఆడలేదు.
దాదాపు 12 ఏళ్లుగా బుల్లితెరపై రాణిస్తోంది రష్మీ గౌతమ్. లగ్జరీ లైఫ్ తో దూసుకుపోతోంది. ఆర్థికంగా బాగానే నిలదొక్కుకున్నారు. హైదరాబాద్ లో లగ్జరీ హౌస్ తో పాటు ఖరీదైన కార్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాదు ప్రస్తుతం ఆమె కోటీశ్వరురాలయ్యిందట. కూడా.
యాంకర్ గా బుల్లితెనపై తన హవా నడిపిస్తోంది రష్మీ గౌతమ్. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అంతే కాదు అడపా దడపా సినిమా అవకాశాలు కూడా అందిపుచ్చుకుంటుంది. ఇంకా కొత్త షోస్ కోసం ఎదరుచూస్తోంది బ్యూటీ.
ప్రస్తుతం హీరోగా రాణిస్తున్న జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ తో రష్మీ ప్రేమాయణం అంట ఎన్నో ఏళ్ళుగా టాక్ నడుస్తూనే ఉంది. ఆన్ స్క్రీన్ లో నాన్ స్టాప్ రొమాన్స్ కురిపించిన ఈ జంట నిజంగానే ప్రేమికులని కొంత మంది నమ్ముతుంటే.. అదంతా షో రేటింగ్ కోసమే అని మరికొంత మంది వాదిస్తుంటారు. వాళ్లిద్దరు మాత్రం అది బుల్లితెర వరకే, ఆఫ్ స్క్రీన్ లో మేము బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు.