Anasuya Bharadwaj: ఎర్ర చీరలో అనసూయ... అందుకే కట్టాను అంటూ మైండ్ బ్లోయింగ్ కామెంట్!
ఎర్ర చీరలో ముస్తాబైంది నటి అనసూయ. పండగ వేళ అనసూయ రెడ్ శారీ ధరించడం వెనుక ఓ కారణం ఉందట.
Anasuya Bharadwaj
అనసూయ ఏమైనా ప్రత్యేకం. జనాలకు కూడా ఆమె అదే చెప్పాలని అంటుకుంటుంది. తాను వీక్ కాదు, ఎవరెంతగా టార్గెట్ చేసినా లొంగే రకం కానని నిరూపించాలి అనుకుంటుంది. ఇక దసరా పండగ రోజు అనసూయ ఎర్ర చీర కట్టింది. దానికి కారణం ఉందట. ఎరుపు రంగు ప్రేమకు, ధైర్యానికి నిదర్శనం అట. అలాగే దుర్గా మాతకు ఇష్టమైన రంగు అట. ఇక అనసూయ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతుంది.
Anasuya Bharadwaj
తాజాగా అనసూయ ప్రేమ విమానం మూవీతో ప్రేక్షకులను పలకరించారు. ఈ చిత్రంలో కీలక రోల్ చేసిన అనసూయ చిత్ర ప్రమోషన్స్ లో విరివిగా పాల్గొన్నారు. జీ 5 ఒరిజినల్ గా తెరకెక్కిన ప్రేమ విమానం అక్టోబర్ 12 నుండి స్ట్రీమ్ అవుతుంది.ప్రేమ విమానం పీరియాడిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ చిత్రంలో భర్తను కోల్పోయిన ఇద్దరు పిల్లల పేద తల్లి పాత్రలో ఆమె నటించారు. అనసూయ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. మీరు అద్బుతంగా చేశారని నెటిజెన్స్ ఆమెను కొనియాడుతున్నారు.
Anasuya Bharadwaj
అలాగే అనసూయ నటించిన పెదకాపు 1 ఇటీవల విడుదలైంది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలేజ్ విమెన్ గా డీగ్లామర్ రోల్ చేసింది. కొత్త హీరో విరాట్ కర్ణ నటించాడు. పెదకాపు డిజాస్టర్ కావడంతో చిత్ర యూనిట్ నిరాశ చెందారు. నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కోటి రూపాయలు కూడా రాబట్టలేకపోయింది.
Anasuya Bharadwaj
ఇక జయాపజయాలతో సంబంధం లేకుండా అనసూయకు అవకాశాలు వస్తున్నాయి. అనసూయ ఓ తరహా పాత్రలకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతున్నారు. ఇటీవల ఆమె నటించిన విమానం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు.విమానం మూవీలో అనసూయ వేశ్య రోల్ చేయడం విశేషం. బోల్డ్ రోల్ లో ఆమె ఒదిగిపోయి నటించారు. విమానం జీ 5 లో స్ట్రీమ్ అవుతుంది. ఓటీటీలో విమానం చిత్రానికి విశేష ఆదరణ దక్కింది.
Anasuya Bharadwaj
దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రంగమార్తాండ మూవీలో హైటెక్ కోడలిగా మెప్పించింది. రంగమార్తాండ సైతం అనసూయకు మంచి పేరు తెచ్చింది. షూటింగ్ దశలో ఉన్న పుష్ప 2లో నటిస్తుంది. సీక్వెల్ లో సైతం అనసూయ దాక్షాయణిగా కనిపించనున్నారు. దర్శకుడు సుకుమార్ త్వరితగతిన ఈ క్రేజీ సీక్వెల్ షూట్ పూర్తి చేస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి. వేర్ ఈజ్ పుష్ప కాన్సెప్ట్ టీజర్ ఆకట్టుకుంది.
Anasuya Bharadwaj
అయితే అనసూయను బుల్లితెర ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారు. అనసూయకు యాంకరింగ్ మీద విరక్తి పుట్టిందట. మేకర్స్ టీఆర్పీ కోసం ప్లే చేస్తున్న ట్రిక్స్ తనకు నచ్చడం లేదట. అందుకే యాంకరింగ్ మానేశానని ఆమె వెల్లడించారు. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని ఖరాకండిగా చెప్పింది.
Anasuya Bharadwaj
అనసూయ కెరీర్ కి జబర్దస్త్ పునాది వేసింది. సదరు కామెడీ షో ఊహించని విజయం సాధించగా... అనసూయ బుల్లితెర స్టార్ అయ్యారు. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ అనసూయ నటిగా ఎదిగారు.
Anasuya Bharadwaj
మరోవైపు సోషల్ మీడియాలో అనసూయ మీద నెగిటివిటీ ఎక్కువైపోయింది. అవేమీ పట్టించుకోని అనసూయ విజయ పథంలో దూసుకుపోతుంది. హద్దు మీరు కామెంట్స్ చేస్తే తనదైన స్టైల్ లో ఇచ్చి పడేస్తుంది.