- Home
- Entertainment
- ఆ మసాజ్ అంటే ఇష్టం, స్నానానికి ముందు అలా చేస్తా... బుట్ట బొమ్మ పూజా హెగ్డే బ్యూటీ సీక్రెట్స్ ఇవే!
ఆ మసాజ్ అంటే ఇష్టం, స్నానానికి ముందు అలా చేస్తా... బుట్ట బొమ్మ పూజా హెగ్డే బ్యూటీ సీక్రెట్స్ ఇవే!
హీరోయిన్ పూజా హెగ్డే తన బ్యూటీ సీక్రెట్స్ ఫ్యాన్స్ తో పంచుకున్నారు. తన మేని ఛాయ, ఆరోగ్యం వెనకున్న కారణాలు బహిర్గతం చేశారు.

Pooja Hegde
హీరోయిన్స్ కి అందమే పెట్టుబడి. అది ఉన్నంత కాలమే కెరీర్. అందుకే ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా సౌందర్యం కోసం సమయం కేటాయిస్తారు. మంచి ఆహారం, వ్యాయామం, బ్యూటీ టిప్స్ ఫాలో అవుతారు. బుట్ట బొమ్మ పూజా హెగ్డే గ్లామర్ పొందేందుకు ప్రత్యేకంగా కొన్ని టిప్స్ ఫాలో అవుతున్నారు. అవి అభిమానులతో పంచుకున్నారు.
Pooja Hegde
హీరోయిన్స్ అంటే మేకప్ తప్పనిసరి. శరీరం మీద రసాయనాల ప్రభావం ఉంటుంది. అందుకే సహజమైన ఫేస్ ఫ్యాక్స్ వేసుకుంటుందట. పసుపు, పాల మీగడ కలిసి ముఖానికి ప్యాక్ లా పెట్టుకుంటారట. కొద్ది నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకుంటారట. దాంతో ముఖం తాజాగా తయారవుతుందట. రోజూ ఓ టీ స్పూన్ నెయ్యి తింటుందట. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే కూరగాయలు, పాలు, పాల పదార్థాలు ఆహారంగా తీసుకుంటారట.
Pooja Hegde
పూజా హెగ్డేకు ఎగ్జిమా సమస్య ఉందట. ఆ కారణంగా శరీరం పొడిబారిపోతూ ఉంటుందట. అందుకే నిద్ర లేవగానే ముఖం శుభ్రంగా కడుక్కుని మాయిశ్చరైజర్ రాసుకుంటారట. నీళ్లు ఎక్కువగా తాగుతారట. నీటి శాతం అధికంగా ఉండే పళ్ళు, కూరగాయలు తింటారట. ఎండలో ట్యాన్ కాకుండా సన్ స్క్రీన్ రాసుకుంటారట.
షూటింగ్స్ లేకపోతే మేకప్ కి దూరంగా ఉంటుందట. ఒకవేళ వేసుకున్నా రాత్రివేళ తొలగించి మాయిశ్చరైజర్ రాసుకుని పడుకుంటారట. బయట వాతావరణానికి చర్మం చెబ్బతినకుండా తన బ్యాగ్ లో మాయిశ్చరైజర్, లిప్స్టిక్, గ్లాసెస్, సన్స్క్రీన్ ఉంటాయని చెప్పుకొచ్చింది. సమయం దొరికితే స్పాకు వెళతారట. డీప్ టిష్యూ మసాజ్ అంటే ఇష్టమని పూజా హెగ్డే వెల్లడించారు.
pooja hegde
జుట్టును సంరక్షించడంలో కొబ్బరి నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే స్నానానికి ముందు తలను కొబ్బరి నూనుతో మసాజ్ చేస్తాను. ఉదయాన్నే ఒక టీ స్పూన్ కొబ్బరి నేను తాగుతాను... అంటూ పూజా హెగ్డే పలు విషయాలు వెల్లడించారు.
కాగా పూజా హెగ్డే లేటెస్ట్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. సల్మాన్ ఖాన్ హీరోగా విడుదలైన ఈ చిత్రం వసూల్ పరంగా మెల్లగా పుంజుకుంటుంది. ఈ చిత్ర ఫలితం తెలియాలంటే ఫస్ట్ వీక్ గడవాలి. అలాగే మహేష్ కి జంటగా నటిస్తున్న ఎస్ఎస్ఎంబి 28 చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.