తల్లిగా, చెల్లిగా, కూతురిగా నటించి అదే హీరోతో 30 సినిమాల్లో రొమాన్స్ చేసిన హీరోయిన్.. రేర్ రికార్డ్
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఘనత కొందరికి మాత్రమే సాధ్యం. గతంలో చాలా మంది హీరోయిన్లు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించి ఆ తర్వాత హీరోయిన్లు అయ్యారు. ఒక హీరోకి తల్లిగా, చెల్లిగా, కూతురిగా నటించిన స్టార్ హీరోయిన్ ఒకరు ఆయనతో 30 చిత్రాల్లో రొమాన్స్ చేశారు. ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

Sridevi
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఘనత కొందరికి మాత్రమే సాధ్యం. గతంలో చాలా మంది హీరోయిన్లు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించి ఆ తర్వాత హీరోయిన్లు అయ్యారు. ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి కూడా బాల్యం నుంచే నటించడం ప్రారంభించారు. సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్ లాంటి హీరోలతో శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ తర్వాత వారితోనే శ్రీదేవి అనేక చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు.

అయితే సూపర్ స్టార్ కృష్ణతో ఎవ్వరికీ సాధ్యం కానీ రేర్ రికార్డ్ శ్రీదేవికి ఉంది. శ్రీదేవి, కృష్ణ కలసి నటిస్తున్నారు అంటే ఆ చిత్రం దాదాపుగా హిట్ అయినట్లే అని భావించేవారు. వీళ్ళిద్దరూ కలసి ఏకంగా 30 పైగా చిత్రాల్లో నటించారు. శ్రీదేవి, కృష్ణ కెమిస్ట్రీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. కేవలం హీరోయిన్ గా కృష్ణతో రొమాన్స్ చేసిన శ్రీదేవి.. బాల్యంలో ఆయనకి కూతురిగా నటించింది. హీరోయిన్ అయ్యాక చెల్లి పాత్రలో కూడా నటించింది.

Super Star Krishna
మా నాన్న నిర్దోషి అనే చిత్రంలో శ్రీదేవి.. కృష్ణకి కూతురిగా నటించింది. దేవుడు లాంటి మనిషి చిత్రంలో చెల్లిగా నటించింది. అంతే కాదు కృష్ణకి తల్లిగా కూడా శ్రీదేవి నటించడం విశేషం. సమాజానికి సవాల్ అనే చిత్రంలో కృష్ణ తల్లిగా శ్రీదేవి నటించారు. అందుకే శ్రీదేవి, కృష్ణ కాంబినేషన్ టాలీవుడ్ లో ప్రత్యేకంగా నిలిపోయింది.

Super Star Krishna
కృష్ణ తన కెరీర్ లో నలుగురు హీరోయిన్లతో 30 పైగా చిత్రాల్లో నటించారు. వారిలో ఒకరు శ్రీదేవి కాగా.. మిగిలిన ముగ్గురు జయప్రద, విజయ నిర్మల, రాధా. 1980లో కృష్ణ శ్రీదేవి కలసి వరుసగా మూడు చిత్రాల్లో నటించారు. 1982లో కూడా ఇదే విధంగా జరిగింది.