Sri Reddy Counter: మరి నువ్వు చేసిందేమిటి...? దీప్తి సునైనాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన శ్రీరెడ్డి.
దీప్తి సునైనా..షణ్ముఖ్ బ్రేకప్ స్టోరీపై స్పందించింది..సెన్సేషనల్ యాక్ట్రస్ శ్రీరెడ్డి. దీప్తికి అదరిపోయే కౌంటర్ వేసింది. నువ్వు చేస్తే తప్పులేదు కాని.. ఎదుటివారిపై ఏడవదంటుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఇష్యూ.. దీప్తి సునైనా(Deepthi Sunaina )-షణ్ముఖ్(Shanmukh) బ్రేకప్. వీరిద్దరు విడిపోతున్నారని తెలిసి..వారికంటే ఎక్కువగా వారి ఫ్యాన్స్ బాధపడుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో సిరీ హగ్గులు..ముద్దులే వీరి మధ్య చిచ్చు పెట్టాయంటూ సోషల్ మీడియా కోడై చూస్తుంది. ఈమధ్యలో బాధతో దీప్తీ సునైనా పోస్ట్ లమీద పోస్ట్ లు పెడుతూనే ఉంది. అంతే కాదు షన్నూ చెప్పేది వినిపించుకోకుండా.. అతని నెంబర్ ను బ్లాక్ చేసిందట దీప్తి.
సోషల్ మీడియాలో వీరి బ్రేకప్ స్టోరీపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఎక్కువ మంది దీప్తీ సునైనానే(Deepthi Sunaina ) నిందిస్తున్నారు. వన్ సైడ్ డెసిసెషన్స్ తీసుకుందంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ ఇష్యూ గురించి లేటేస్ట్ గా ఐటమ్ బాంబ్ శ్రీరెడ్డి(Sri Reddy) స్పందించింది. తన మార్క్ కామెంట్స్ తో.. నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. దీప్తి-షన్నూ బ్రేకప్ విషయం పై కరెక్ట్ గా స్పందించింది శ్రీరెడ్డి.
దీప్తి సునైనా- షణ్ముఖ్ బ్రేకప్ చెప్పుకోవడం తనను కూడా బాధించిందన్నారు శ్రీరెడ్డి(Sri Reddy). కాని బిగ్ బాస్ లో జరిగిన సిరీ-షణ్ముఖ్(Shanmukh) హగ్గులు కారణంగానే షన్నూకి దీప్తీ బ్రేకప్ చెప్పడం కరెక్ట్ కాదు అన్నారు. షణ్ముఖ్ ను అనే ముందు తాను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఏ చేసిందో తెలుసుకోవాలి.. ఒక పర్సన్(తనిష్) తో నువ్వు ఎంత క్లోజ్ గా ఉన్నావు.. అతనికి నీకు మధ్య ఎన్ని రూమర్స్ బయటకు వచ్చాయి. అయినా బిగ్ బాస్ హౌస్ లో మీ వేశాలు అందరూ చూశారు.. మరి ఈ విషయంలో నువ్వు ఏం సమాధానం చెపుతావు. నీకు ఒక రూలు.. షణ్ముఖ్ కి ఒక రూలా.. ఇదెక్కడి న్యాయం అంటూ.. మండి పడింది శ్రీరెడ్డి(Sri Reddy).
మనుషులు అన్నాక తప్పులు చేయడం సహజం.. ఎవరైనా తప్పులు చేస్తుంటారు. మీరు ఐదేళ్లు కలిసి నడిచారు. ఒకరి గురించి ఒకరికి తెలుసు, మీరు బాగా అర్ధం చేసుకున్నారంటూ చాలా సార్లు నువ్వే చెప్పావు. అలాంటప్పుడు ఈ ఇష్యూ గురించి అర్ధం చేసుకోకుండా షణ్ముఖ్ కు బ్రేకప్ ఎలా చెప్పావంటూ .. దీప్తీ(Deepthi Sunaina )ని కడిగిపారేసింది శ్రీరెడ్డి. అయినా మీకు పెళ్ళి కాలేదు కాబట్టి బ్రేకప్ చెప్పావు.. మరి పెళ్లి అయ్యి ఉంటే.. ఇలా సింపుల్ గా బ్రేకప్ చెప్పేదానివా అంటూ ప్రశ్నించింది శ్రీరెడ్డి.
ఓపికతో ఉంటే సమస్యలు అవే పరిష్కారం అవుతాయి. తొందరపడితే జీవితాలు నాశనం అవుతాయి. మనిషి అన్నాక తప్పులు చేయడం సహజం. ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంటే.. ఒకరి తప్పులు మరొకరు క్షమించుకుని ముందుకు నడవాలి.. అంతే కాని చిన్న చిన్న విషయాలకు విడిపోవాలి అనుకోకూడదు అంటూ.. జీవిత పాఠాలు చెప్పింది శ్రీరెడ్డి.
అయినా ఇప్పుడు పిల్లలు చాలా సెన్సిటీవ్ గా ఉంటున్నారు. చిన్న విషయాలకే డీలా పడిపోతున్నారు. స్ట్రాంగ్ గా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారంటుంది శ్రీరెడ్డి. మనం ఎంత ఫ్యాషన్ గా తయారు అయినా.. ఎంత టెక్నాలజీ పెంచుకున్నా.. భారతీయులం అని మర్చిపోకూడదు. మన సంస్కృతి చెడిపోయేలా పనులు చేయకూడదంటుంది శ్రీరెడ్డి.