- Home
- Entertainment
- Sreemukhi: ఇదేం పని శ్రీముఖి, విమానం బాత్రూంలో సెల్ఫీ వీడియో.. యూఎస్ కి వెళుతూ రచ్చ
Sreemukhi: ఇదేం పని శ్రీముఖి, విమానం బాత్రూంలో సెల్ఫీ వీడియో.. యూఎస్ కి వెళుతూ రచ్చ
బుల్లితెర రాములమ్మ శ్రీముఖి గురించి పరిచయం అవసరం లేదు. ఎనెర్జిటిక్ యానకరింగ్ తో శ్రీముఖి అభిమానులని అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది.

బుల్లితెర రాములమ్మ శ్రీముఖి గురించి పరిచయం అవసరం లేదు. ఎనెర్జిటిక్ యానకరింగ్ తో శ్రీముఖి అభిమానులని అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు మెరిపించాలని ఈ హాట్ యాంకర్ భావిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది.
ఇక శ్రీముఖి ఇటీవల ఎక్కువగా వెకేషన్స్ కి వెళుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా శ్రీముఖి యుఎస్ టూర్ వెళ్ళింది. శ్రీముఖితో పాటు ఆమె ఫ్రెండ్స్.. సింగర్ సాకేత్, శేఖర్ మాస్టర్, మంగ్లీ కూడా యుఎస్ టూర్ వెళ్లారు. తొలిసారి శ్రీముఖి ఎమిరేట్స్ విమానంలో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించినట్లు పేర్కొంది. తన ఫ్లైట్ జర్నీ విశేషాలని శ్రీముఖి సెల్ఫీ వీడియో రూపంలో అభిమానులతో పంచుకుంది.
ఫస్ట్ క్లాస్ ప్రయాణం కావడంతో ఆమె జర్నీ చాలా రిచ్ గా సాగింది.ఈ జర్నీలో శ్రీముఖి తనతో సింగర్ సాకేత్, మంగ్లీ, శేఖర్ మాస్టర్ లని పరిచయం చేసింది. తన ఫోటోలు బాగా తీయాలని శ్రీముఖి సాకేత్ కి సరదాగా వార్నింగ్ ఇచ్చింది. మొదట హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో దుబాయ్ వెళ్లారు. అక్కడ ఎమిరేట్స్ ఫ్లైట్ లోకి మారారు.
దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో రెస్ట్ తీసుకునే ఏరియా, లాబీ, ఫుడ్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఇక ఫ్లైట్ లో ఉన్న బాత్రూంలో కూడా శ్రీముఖి సెల్ఫీ వీడియో తీసుకుంది. ఎమిరేట్స్ విమానంలో ఉన్న అధునాతన సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయి అంటూ శ్రీముఖి ఆశ్చర్యపోయింది.
బాత్రూంలో అన్ని సౌకర్యాలతో కంప్లీట్ శానిటైజేషన్ తో ఉందని శ్రీముఖి సెల్ఫీ వీడియోలో పేర్కొంది. బాత్రూమ్ లో ఏంటి భయ్యా ఇది అంటూ మధ్యలో తనకి తానే కామెంట్ చేసుకుంది. ఇక ఫ్లైట్ లో తనకి ఇచ్చిన క్యాబిన్ విశేషాల్ని కూడా పేర్కొంది. తన క్యాబిన్ లో టివి, ఫ్లైట్ జర్నీ ట్రాకింగ్ సిస్టం, అలాగే డ్రింక్స్ ఇతర సౌకర్యాలని శ్రీముఖి చూపించింది.
ఇక యుఎస్ కి వెళ్ళాక రోడ్డుపై సింగర్ సాకేత్ శ్రీముఖిని వీడియో తీశారు. రోడ్డుపై పొట్టి బట్టలు ధరించి ఓ అందమైన యుఎస్ లేడి వెళుతుండడంతో ఆమెని చూపించారు. దీనితో శ్రీముఖి.. ఒరేయ్ వెధవ.. నా బ్లాగ్ లో ఆవిడ అప్పియరెన్స్ ఏంటి రా అని చిలిపిగా కసిరింది. మొత్తంగా శ్రీముఖి యుఎస్ టూర్ సరదాగా సాగింది.