- Home
- Entertainment
- శ్రీముఖికి సీక్రెట్ వాలెంటైన్స్ డే బొకే..సైలెంట్‌గా షాకిచ్చిన రాములమ్మ.. నెటిజన్ల హార్ట్ బ్రేకింగ్ కామెంట్స్
శ్రీముఖికి సీక్రెట్ వాలెంటైన్స్ డే బొకే..సైలెంట్‌గా షాకిచ్చిన రాములమ్మ.. నెటిజన్ల హార్ట్ బ్రేకింగ్ కామెంట్స్
బొద్దు అందాల భామ శ్రీముఖి తన అభిమానులకు షాకిచ్చింది. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ఈ భామ ఉన్నట్టుండి హార్ట్ బ్రేక్ అయ్యే వార్త చెప్పింది. సింపుల్‌గా బొకేతో ఫోటోని పంచుకుని అభిమానులకు గుండెబద్దలయ్యేలా చేసింది.

శ్రీముఖి లేటెస్ట్ గా ఇన్‌స్టాగ్రామ్ లో తన ఫోటోని పంచుకుంది. ఇందులో ఆమె బొకేని పట్టుకుని ఉంది. అయితే తనకిది `బెస్ట్ వాలెంటైన్స్ డే ఎవర్` అని తెలిపింది. అంతేకాదు `ఇది గుర్తు పెట్టుకోండి. మళ్లీ మాట్లాడుకుందాం` అని పేర్కొంది. లవ్ ఎమోజీలను కూడా షేర్ చేసుకుంది శ్రీముఖి. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
దీంతో అభిమానులకు, ఆమెని ఫాలో అయ్యే నెటిజన్లకి అసలు విషయం అర్థమైంది. తనకు ఎవరో వాలెంటైన్స్ డే సందర్భంగా విషెస్ చెబుతూ బొకే ఇచ్చారని. ప్రేమికులు మాత్రమే ఇలా ప్రేమికుల రోజున గిఫ్ట్ లు ఇచ్చుకుంటారు. అలా శ్రీముఖి కూడా వాలెంటైన్స్ డే విషెస్ పొందింది ఆమె ప్రియుడి నుంచే అని ఫిక్స్ అవుతున్నారు నెటిజన్లు. అయితే అతనెవరనేది మాత్రం తెలుసుకునే పనిలో బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉంటే శ్రీముఖి అభిమానులు, ఆమెని ఆరాధించే వారు మాత్రం షాక్‌తింటున్నారు. ఉన్నట్టుండి శ్రీముఖి ఇలా షాకింగ్ విషయం వెల్లడించడంతో హార్ట్ బ్రేక్ అయ్యిందంటూ వాపోతున్నారు. ఇది తమకి బ్లాక్ డే అంటూ కామెంట్లు పెడుతున్నారు. హార్ట్ బ్రేకింగ్ ఎమోజీలతో శ్రీముఖికి తమ ప్రేమ నిరసన తెలియజేస్తున్నారు.
అయితే శ్రీముఖికి బొకే ఇచ్చిందెవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. గతంలో ఆమె ప్రేమలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఓ సందర్భంలో శ్రీముఖి కూడా లవ్ ఫెయిల్యూర్ అని, మరో సందర్భంలో తనకు లవర్ ఉన్నాడనే విసయాన్ని తెలిపింది. అయితే ఆమె సరదాగా చెప్పిందనే కామెంట్లు కూడా వచ్చాయి. కానీ ఇంత వరకు అతనెవరనేది మాత్రం చెప్పలేదు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఉన్నట్టుండి బొకే చూపిస్తూ ఈ విషయాన్నిగుర్తు పెట్టుకోండి తర్వాత మాట్లాడుకుందామని చెప్పడం అనుమానాలకు తావిస్తుంది. శ్రీముఖి తన ప్రియుడి నుంచే ఈ బొకే పొంది ఉంటుందని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీముఖి మాత్రం అసలు విషయం దాస్తూ అభిమానులకు టెస్ట్ పెడుతుంది. మరి ఈ ఫోటో సీక్రెట్ ఎప్పుడు బయటపెడుతుందో చూడాలి.
ప్రస్తుతం శ్రీముఖి యాంకర్‌గా బిజీగా ఉంది. స్పెషల్ ఈవెంట్లకి, ఫెస్టివల్స్ సందర్భంగా చేసే ప్రత్యేక ప్రోగ్రామ్‌లకు శ్రీముఖి బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. మరోవైపు ఆమె `కామెడీస్టార్స్` షోకి యాంకర్‌గా చేస్తున్న విసయం తెలిసిందే. త్వరలో `సరిగమప` సింగింగ్ షోకి యాంకర్‌గా చేయబోతుంది శ్రీముఖి.
అలాగే తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటు కుర్రాళ్లకి అందాల విందుని వడ్డిస్తుంది శ్రీముఖి. తన భారీ అందాల వర్షంలో నెటిజన్లు, ఆమె అభిమానులు తడిసి ముద్దవుతుంటారు. రాములమ్మ అందాలను ఆస్వాధిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అదే సమయంలో గ్లామర్ పిక్స్ తో నెట్టింట తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది యాంకర్ శ్రీముఖ