- Home
- Entertainment
- Sreemukhi: చికెన్ పీసులతో శ్రీముఖి ఫోజులు అదుర్స్.. వైరల్ అవుతున్న పిక్స్, అసలు మ్యాటర్ ఇదే..
Sreemukhi: చికెన్ పీసులతో శ్రీముఖి ఫోజులు అదుర్స్.. వైరల్ అవుతున్న పిక్స్, అసలు మ్యాటర్ ఇదే..
టాలీవుడ్ లో ఎనెర్జిటిక్ యాంకర్ గా, బుల్లితెర రాములమ్మగా గుర్తింపు సొంతం చేసుకుంది శ్రీముఖి. శ్రీముఖి అందంతో కూడా అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది.

టాలీవుడ్ లో ఎనెర్జిటిక్ యాంకర్ గా, బుల్లితెర రాములమ్మగా గుర్తింపు సొంతం చేసుకుంది శ్రీముఖి. శ్రీముఖి అందంతో కూడా అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది.
బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే వెండితెరపై కూడా మెరవాలని శ్రీముఖి ప్రయత్నిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది.
శ్రీముఖి గత ఏడాది 'క్రేజీ అంకుల్స్' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. చంద్రబింబం లాంటి అందమైన రూపం శ్రీముఖి సొంతం. తరచుగా ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి.
శ్రీముఖి క్రేజీ సెలెబ్రిటీ కావడంతో అప్పుడప్పుడూ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లో కూడా మెరుస్తూ ఉంటుంది. తాజాగా శ్రీముఖి 'AB's' అనే రెస్టారెంట్ ఓపెనింగ్ లో పాల్గొంది. బంజారాహిల్స్ లో ఈ రెసారెంట్ ని ఓపెన్ చేశారు. అందమైన గౌనులో మెరిసిన శ్రీముఖి రెస్టారెంట్ ఓపెనింగ్ లో గ్లామర్ అట్రాక్షన్ గా నిలిచింది.
చేతిలో రెస్టారెంట్ వంటకాలు పట్టుకుని ఫోజులు ఇచ్చింది. గ్రిల్ చికెన్ తో శ్రీముఖి ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. ఒకవైపు ఊరించే శ్రీముఖి అందాలు.. మరోవైపు నొరించే చికెన్ పీసులు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
ఇక శ్రీముఖి ఇంస్టాగ్రామ్లో తరచుగా గ్లామర్ ఫోజులు ఎలాగూ ఇస్తూనే ఉంటుంది. ఇక శ్రీముఖి యాంకర్ గా పలు టివి కార్యక్రమాలకు హోస్ట్ గా చేస్తోంది. శ్రీముఖి బుల్లితెర షోలలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.
శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో శ్రీముఖి కీలక పాత్రలో నటిస్తోంది. మెహర్ రమేష్ ఈ దర్శకుడు. అయితే శ్రీముఖి రోల్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.