- Home
- Entertainment
- Sreemukhi: ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు, అతని కోసమే ఇంకా పెళ్లి చేసుకోలేదు.. శ్రీముఖి కామెంట్స్ వైరల్
Sreemukhi: ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు, అతని కోసమే ఇంకా పెళ్లి చేసుకోలేదు.. శ్రీముఖి కామెంట్స్ వైరల్
టాలీవుడ్ లో ఎనెర్జిటిక్ యాంకర్ గా, బుల్లితెర రాములమ్మగా గుర్తింపు సొంతం చేసుకుంది శ్రీముఖి. శ్రీముఖి అందంతో కూడా అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది.

Sreemukhi
టాలీవుడ్ లో ఎనెర్జిటిక్ యాంకర్ గా, బుల్లితెర రాములమ్మగా గుర్తింపు సొంతం చేసుకుంది శ్రీముఖి. శ్రీముఖి అందంతో కూడా అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే వెండితెరపై కూడా మెరవాలని శ్రీముఖి ప్రయత్నిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది.
Sreemukhi
ప్రస్తుతం శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇదిలా ఉండగా శ్రీముఖి ప్రస్తుతం పలు టీవీ కార్యక్రమాలలో సందడి చేస్తోంది. సీనియర్ యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తున్న శ్రీరామనవమి స్పెషల్ క్యాష్ ప్రోగ్రాంలో శ్రీముఖి పాల్గొంది. తాజాగా ఆ ప్రోగ్రాం ప్రోమో విడుదల చేశారు.
Sreemukhi
వీలైనంత వరకు శ్రీముఖి తన పర్సనల్ లైఫ్ ని సీక్రెట్ గానే ఉంచుతుంది. కానీ తొలిసారి క్యాష్ ప్రోగ్రాంలో తన పర్సనల్ లైఫ్, మ్యారేజ్ గురించి శ్రీముఖి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అది కూడా ఎమోషనల్ గా.. దీనితో శ్రీముఖి మ్యారేజ్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలయింది.
Sreemukhi
నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతోంది. ఎంతో అందమైన హీరోలు, కో యాంకర్స్ తో వర్క్ చేశాను. కానీ ఎవ్వరికి నా మనసు ఇవ్వలేదు. పెళ్లి చేసుకోలేదు. ఇప్పటికి ఆ మూడు ముళ్ళు వేయించుకోకుండా ఉండడానికి కారణం ఒక వ్యక్తి అని శ్రీముఖి తెలిపింది. ఆ వ్యక్తి పేరు చెప్పే లోపు ప్రోమో ఎండ్ అవుతుంది. ఆ వ్యక్తి ఎవరో తెలియాలంటే 9వ తేదీ ప్రసారం అయ్యే క్యాష్ ప్రోగ్రాం చూడాల్సిందే.
Sreemukhi
లేడి యాంకర్స్ చాలా మందిపై లవ్ అఫైర్ రూమర్స్ వస్తుంటాయి. కానీ శ్రీముఖి గురించి అలాంటి రూమర్స్ వినిపించలేదు. శ్రీముఖి మాటలని బట్టి ఆమెకి కాబోయే వాడు ఫిక్స్ అయినట్లు ఉన్నాడు. ఎవరో అజ్ఞాత వ్యక్తితో శ్రీముఖి ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అతని కోసమే ఎదురుచూస్తున్నట్లు శ్రీముఖి తెలిపింది.
Sreemukhi
శ్రీముఖి తన జాతి రత్నాలు టీం తో కలసి క్యాష్ ప్రోగ్రాంలో పాల్గొంది. నూకరాజు, ఇమ్మాన్యుయేల్, పంచ్ ప్రసాద్ వీరంతా శ్రీరామనవమి క్యాష్ ప్రోగ్రాంలో సందడి చేశారు.