MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీముఖి హాట్ కామెంట్స్ తో చిరంజీవికి చెమటలు.. పక్కనే కూర్చుని అడగాల్సినవన్నీ అడిగేసిందిగా 

శ్రీముఖి హాట్ కామెంట్స్ తో చిరంజీవికి చెమటలు.. పక్కనే కూర్చుని అడగాల్సినవన్నీ అడిగేసిందిగా 

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. రాజకీయాల నుంచి నేను దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ చిన్న డైలాగ్ బిట్ తో గాడ్ ఫాదర్ మూవీ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 24 2022, 03:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. రాజకీయాల నుంచి నేను దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ చిన్న డైలాగ్ బిట్ తో గాడ్ ఫాదర్ మూవీ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే జోరుగా మెగాస్టార్ గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగారు. 

26

మలయాళీ సూపర్ హిట్ మూవీ లూసిఫెర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ తెరకెక్కుతోంది. ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కింది. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్ర విశేషాలని వివరిస్తూ మెగాస్టార్.. శ్రీముఖితో ఓ ఇంటర్వ్యూ చేశారు. ఫ్లైట్ జర్నీలో చాలా సరదాగా ఈ ఇంటర్వ్యూ జరిగింది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలై వైరల్ గా మారింది. 

36

చిరంజీవి చెమటలు పట్టేలా, ఆయన సిగ్గుతో ఇబ్బందిపడిపోయేలా శ్రీముఖి తనదైన శైలిలో హాట్ కామెంట్స్ తో రచ్చ చేసింది. శ్రీముఖి కామెంట్స్ కి చిరు సరదాగా రిప్లై ఇస్తూనే , తన ఫన్నీ మ్యానరిజమ్స్ తో ఆకట్టుకున్నారు. ఐ లవ్ యూ చిరంజీవి గారు, ఈ లుక్ లో మీరు చాలా హాట్ గా ఉన్నారు అంటూ శ్రీముఖి మెగాస్టార్ ని ఇబ్బంది పెట్టింది. 

46

శ్రీముఖి అలా అనేసరికి చిరంజీవి సిగ్గుపడుతూ తడబడిపోయారు. తార్ మార్ టక్కర్ మార్ సాంగ్ లో డాన్స్ మూమెంట్ ఐడియా ప్రభుదేవా ఇచ్చారు అని చిరంజీవి అన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ లేదని కానీ, పాటలు లేవని కానీ .. అసలు ఆ ఆలోచనే ప్రేక్షకులకు రాదు. అలాంటి అద్భుతమైన కథతో ఈ చిత్రం తెరకెక్కించినట్లు మెగాస్టార్ వివరించారు. 

56

కామియో రోల్స్ చేసిన సల్మాన్ ఖాన్, పూరి జగన్నాధ్ పై చిరు ప్రశంసలు కురిపించారు. గాడ్ ఫాదర్ చిత్రం నిశ్శబ్ద విప్లవం అని అన్నారు. ఫ్యాన్స్ ఎంత ఊహించుకున్నా అంతకి మించి ఈ చిత్రం ఉండబోతోంది అని మెగాస్టార్ భరోసా ఇచ్చారు. ఇది జస్ట్ ప్రోమో మాత్రమే కంప్లీట్ ఇంటర్వ్యూ త్వరలో రిలీజ్ చేయనున్నారు. 

66

మెగాస్టార్ స్వయంగా హామీ ఇవ్వడంతో గాడ్ ఫాదర్ పై అంచనాలు తారా స్థాయికి చేరాయి. అక్టోబర్ 5న గ్రాండ్ రిలీజ్ కి సర్వం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. సెన్సార్ సభ్యుల నుంచి కూడానా అదిరిపోయే టాక్ వచ్చిందని సమాచారం. సో విజయదశమి రోజున మెగా బ్లాస్టింగ్ ఖాయం అని అంటున్నారు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Super Star Krishna: మహేష్ బాబు చేయాల్సిన మూవీ నాగార్జున చేతికి.. కృష్ణ అడ్డుపడకపోతే పెద్ద ఘోరమే జరిగేది
Recommended image2
20 ఏళ్ళ గ్యాప్ తరువాత టాలీవుడ్ లో రచ్చ చేస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
దుబాయ్‌లో చిక్కుకున్న వాళ్లకు సోనూ సూద్ సహాయం.. ఫ్రీగా ఉండొచ్చు.. ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved