- Home
- Entertainment
- ఆమె అయితే వద్దనే వద్దు బాబోయ్.. ప్రభాస్ కి జోడిగా ఆ హీరోయిన్, ఊహించినట్లే రియాక్షన్స్
ఆమె అయితే వద్దనే వద్దు బాబోయ్.. ప్రభాస్ కి జోడిగా ఆ హీరోయిన్, ఊహించినట్లే రియాక్షన్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది చివర్లో సలార్ చిత్రంతో ఫ్యాన్స్ ని ఖుషి చేశాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ చిత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద మంచి విజయంగా నిలిచింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది చివర్లో సలార్ చిత్రంతో ఫ్యాన్స్ ని ఖుషి చేశాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ చిత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద మంచి విజయంగా నిలిచింది. బాహుబలి తర్వాత ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్న హిట్ దక్కింది.
Prabhas
ఇక ఈ ఏడాది మరో భారీ చిత్రంతో ప్రభాస్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. మేలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898 చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. హాలీవుడ్ స్టాండర్డ్స్ తో కమల్ హాసన్, అమితాబ్, దీపికా లాంటి స్టార్ కాస్టింగ్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఆ తర్వాత కూడా ప్రభాస్ లైనప్ బలంగానే ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రంలో నటించాల్సి ఉంది. ఈ గ్యాప్ లో ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే సీతారామన్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఒక చిత్రానికి కమిటయ్యారు అనేది జోరుగా ప్రచారం జరుగుతున్న న్యూస్.
సీతారామన్ చిత్రంతో ఎమోషనల్ గా మెప్పించి క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు హను రాఘవపూడి. అయితే ఈ కాంబినేషన్ పట్ల ప్రభాస్ అభిమానులు కొందరు సుముఖంగా లేరు. ఎందుకంటే హను రాఘవపూడి మాస్ డైరెక్టర్ కాదు. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం కచ్చితంగా మాస్ ఎలిమెంట్స్ కోరుకుంటారు.
హను రాఘవపూడి చిత్రమే వద్దని ఫ్యాన్స్ అంటుంటే వారికి మరో షాక్ తగిలింది. మరో రూమర్ వైరల్ గా మారింది. అదేంటంటే హను రాఘవపూడి లోలోపల ఈ చిత్రానికి సంబంధించిన పనులు పూర్తి చేస్తున్నారట. అంతే కాదు ఈ చిత్రంలో హీరోయిన్ గా క్రేజీ పిల్ల శ్రీలీలని సంప్రదించినట్లు తెలుస్తోంది.
శ్రీలీల అసలే ఫ్లాపుల్లో ఉంది. లేటెస్ట్ గా రిలీజైన గుంటూరు కారం చిత్రం వల్ల కూడా ఆమె ట్రోలింగ్ ఎదుర్కొంది. శ్రీలీల నటిస్తున్న ఏ చిత్రమూ బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కావడం లేదు. ప్రభాస్ కి జోడిగా ఆమెని హను రాఘవపూడి ఎంపిక చేస్తున్నారు అనే న్యూస్ రాగానే ఫ్యాన్స్ వద్దు బాబోయ్ అనేస్తున్నారు. ఫ్యాన్స్ నుంచి ఇలాంటి రియాక్షన్స్ ఊహించినవే అనే చెప్పాలి. ఎందుకంటే శ్రీలీల అతితక్కువ సమయంలో ఎంతలా పాపులర్ అయిందో అదే స్థాయిలో నెగిటివిటి కూడా మూటగట్టుకుంది.