- Home
- Entertainment
- రవితేజతో రొమాన్స్, ఏజ్ గ్యాప్ కామెంట్స్ పై శ్రీలీల దిమ్మతిరిగే కౌంటర్.. నోర్లు మూయించిన 'ధమాకా' పిల్ల
రవితేజతో రొమాన్స్, ఏజ్ గ్యాప్ కామెంట్స్ పై శ్రీలీల దిమ్మతిరిగే కౌంటర్.. నోర్లు మూయించిన 'ధమాకా' పిల్ల
మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో.. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ స్టఫ్ అంతా సూపర్బ్ గా వర్కౌట్ అయింది.

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో.. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ స్టఫ్ అంతా సూపర్బ్ గా వర్కౌట్ అయింది. దీనితో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో ధమాకా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
'పెళ్లి సందD' తర్వాత శ్రీలీల జోరు మాములుగా లేదు. వరుస చిత్రాలకు ఈ యంగ్ బ్యూటీ సైన్ చేస్తోంది. అందులో భాగంగా ధమాకా చిత్రంతో రానుంది. అయితే ఈ చిత్రం ప్రారంభం అయినప్పటి నుంచి రవితేజ, శ్రీలీల కాంబినేషన్ పై కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
శ్రీలీల 21 ఏళ్ల యంగ్ బ్యూటీ, రవితేజ ఐదుపదులు దాటిన సీనియర్ హీరో. దీనితో ఈ కాంబోపై సెటైర్లు పడుతూనే ఉన్నాయి. సీనియర్లతో కుర్ర హీరోయిన్లు.. వయసు బాగా తక్కువ ఉన్నవారు నటించడం కొత్తకాదు. కానీ ఎందుకనో శ్రీలీల, రవితేజ టార్గెట్ అయ్యారు. చిరంజీవి, బాలయ్య, నాగార్జున లాంటి సీనియర్స్ తో ఈ తరం హీరోయిన్లు ఆడిపాడడం చూస్తూనే ఉన్నాం.
ధమాకా ప్రమోషన్స్ లో శ్రీలీలకి రవితేజతో ఏజ్ గ్యాప్ గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి శ్రీలీల తనదైన శైలిలో కూల్ గా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. 'నాకన్నా ముందు ఎంతోమంది స్టార్ హీరోయిన్లు వయసు ఎక్కువ ఉన్న హీరోయిన్లతో నటించి విజయం సాధించారు. వాళ్లే వయసు గురించి పట్టించుకోలేదు. ఇక నేనెంత చెప్పండి' అంటూ నవ్వుతూ నోర్లు మూయించే సమాధానం ఇచ్చింది.
యాక్టింగ్, డ్యాన్స్, అందంలో మాత్రమే కాదు వివాదాలు ఎదుర్కోవడంలో కూడా శ్రీలీల ఆరితేరిపోయిందంటూ ప్రశంసిస్తున్నారు. ధమాకా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్స్ యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా జింతాక్ అంటూ సాగే మాస్ సాంగ్ లో శ్రీలీల డ్యాన్స్ తో దుమ్మురేపింది. ఆమె డ్యాన్స్ పెర్ఫామెన్స్, గ్లామర్ కి అందరూ షాక్ అవుతున్నారు.
ఆమె గ్లామర్, డ్యాన్స్ స్కిల్స్ చూస్తుంటే ఫ్యూచర్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదగడం ఖాయం అని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. టాలీవుడ్ లో నెక్స్ట్ బిగ్ హీరోయిన్ శ్రీలీల అంటూ రవితేజ ఇప్పటికే ఆమెపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.