MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్ కు శ్రీలీల కౌంటర్, తెలుగు హీరోయిన్స్ గురించి ఐకాన్ స్టార్ ఏమన్నారంటే?

అల్లు అర్జున్ కు శ్రీలీల కౌంటర్, తెలుగు హీరోయిన్స్ గురించి ఐకాన్ స్టార్ ఏమన్నారంటే?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు స్టార్ హీరోయిన్ శ్రీలీల కౌంటర్ ఇచ్చారు. గతంలో బన్నీ తెలుగు హీరోయిన్ల గురించి చేసిన కామెంట్స్ కు శ్రీలీల ఎలా రెస్పాండ్ అయ్యిందంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 11 2025, 07:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తక్కువ టైమ్ లో స్టార్ హీరోయిన్ గా
Image Credit : sreeleela instagram

తక్కువ టైమ్ లో స్టార్ హీరోయిన్ గా

కన్నడ బ్యూటీ శ్రీలీల ఏ హీరోయిన్‌కు సాధ్యం కాని రీతిలో చాలా తక్కువ టైమ్ లో, వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యావేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో శ్రీలీల తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ సినిమా తర్వాత శ్రీలీల రవితేజ, మహేష్ బాబు, రామ్, బాలకృష్ణ, నితిన్ లాంటి తెలుగు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఈ క్రమంలో శ్రీలీలకు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అల్లు అర్జున్ కు శ్రీలీల కౌంటర్
Image Credit : Asianet News

అల్లు అర్జున్ కు శ్రీలీల కౌంటర్

గతంలో టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు హీరోగా నటించిన 'స్లమ్ డాగ్ హస్బెండ్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు శ్రీలీల ముఖ్య అతిథిగా వచ్చింది. ఆ టైంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి శ్రీలీల మాట్లాడిన మాటలు తెగ వైరల్ అయ్యాయి. ‘’ అల్లు అర్జున్ చెప్పినట్టు ' తెలుగు అమ్మాయిలు ఎక్కువగా ఇండస్ట్రీకి వస్తున్నారు. ఇది నిజం, మంచిదే. నేను స్క్రిప్ట్‌లను ఎలా ఎంచుకుంటున్నానో నటి ప్రణవి నన్ను అడుగుతోంది. ఇక్కడికి రావడం అంత ఈజీ కాదు, నా కుటుంబానికి ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అలాంటప్పుడు ఇక్కడికి రావడం ఒక డేరింగ్ స్టెప్. కానీ ఇక్కడున్న వాళ్లందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు. సినిమా ఒక గౌరవప్రదమైన వృత్తి. మనం మన హద్దులు పెట్టుకుంటే, ఎవరూ మనల్ని ఆపలేరు. స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్'' అని శ్రీలీల అన్నారు.

35
తెలుగు హీరోయిన్లపై అల్లు అర్జున్ కామెంట్స్
Image Credit : Asianet News

తెలుగు హీరోయిన్లపై అల్లు అర్జున్ కామెంట్స్

ఇక హీరోయిన్ల గురించి అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'బేబీ' సినిమా ఈవెంట్ కు వచ్చిన అల్లు అర్జున్ ఈ విధంగా అన్నారు. '' బేబీ సినిమా చూసి చాలా సంతోషించాను. అప్పుడు నాకు అనిపించింది, చివరికి తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌లోకి వచ్చే టైం వచ్చింది. ఇది నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. శ్రీలీల అనే అమ్మాయి వచ్చి, హీరోయిన్‌గా పెద్ద పెద్ద స్టార్ల సినిమాల్లో నటిస్తోంది, అలాగే వైష్ణవి కూడా ఇండస్ట్రీకి వచ్చింది. పెద్ద పెద్ద సినిమాలు చేయాలి '' అని అన్నారు.

45
వైష్ణవి వల్లే వచ్చాను
Image Credit : Asianet News

వైష్ణవి వల్లే వచ్చాను

అంతే కాదు '' వైష్ణవిలాగానే తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌కి వచ్చి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను . నేను ఈ వేడుకకు రావడానికి నటి వైష్ణవియే ముఖ్య కారణం. తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌లో మెరవాలి, గొప్పవాళ్లు కావాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. నేను వైష్ణవితో 'అల వైకుంఠపురములో'నటించినప్పుడు, ఇలాంటి అమ్మాయి హీరోయిన్ అయ్యే రోజు వస్తుందని అనుకున్నాను. చివరకు నేను అనుకున్నది జరిగింది. '' అని అల్లు అర్జున్ అన్నారు.

55
ఆడపిల్లల తల్లీ తండ్రులకు విజ్ఞప్తి
Image Credit : Asianet News

ఆడపిల్లల తల్లీ తండ్రులకు విజ్ఞప్తి

అల్లు అర్జున్ మాట్లాడుతూ ''తెలుగు అమ్మాయిలందరూ టాలీవుడ్‌లోకి వచ్చి మెయిన్‌స్ట్రీమ్ సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. టాలీవుడ్ దేశంలో ఎదుగుతున్న పరిశ్రమలలో ఒకటి, తెలుగు సినిమాలకు ఇప్పుడు ఇండియన్ సినిమాకు దారి చూపిస్తున్నాయి. మన చిత్ర పరిశ్రమ అన్ని విషయాలో మార్గదర్శక పాత్ర పోషిస్తోంది. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను, ముఖ్యంగా ఆడపిల్లలను సినిమా రంగానికి పంపాలని నేను కోరుతున్నాను'' అని అల్లు అర్జున్ అన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jailer 2 Review: జైలర్‌ 2 ఫస్ట్ రివ్యూ.. ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీ విశ్వరూపం, కానీ మైనస్‌ ఏంటంటే?
Recommended image2
Villains Turned Comedians: ఒకప్పుడు టెర్రర్ విలన్లు.. ఇప్పుడు కామెడీ స్టార్స్! రూటు మార్చిన 5గురు నటులు
Recommended image3
Jailer 2: జన నాయకన్ రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అయిన జైలర్ 2.. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఇన్ని కోట్లా?
Related Stories
Recommended image1
సౌందర్య తో వెంకటేష్ రొమాన్స్.. షాక్ ఇచ్చిన రామానాయుడు.. ఏం చేశాడంటే?
Recommended image2
రష్మిక మందన్న ఔట్, కొత్త నేషనల్ క్రష్ ఎవరో తెలుసా? వారంలో 500 కోట్లు కొల్ల గొట్టిన హీరోయిన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved