- Home
- Entertainment
- రష్మిక మందన్న ఔట్, కొత్త నేషనల్ క్రష్ ఎవరో తెలుసా? వారంలో 500 కోట్లు కొల్ల గొట్టిన హీరోయిన్
రష్మిక మందన్న ఔట్, కొత్త నేషనల్ క్రష్ ఎవరో తెలుసా? వారంలో 500 కోట్లు కొల్ల గొట్టిన హీరోయిన్
ఇండియన్ సినిమాకు కొత్త నేషనల్ క్రష్ దొరికింది. ఇంత కాలం రష్మిక మందన్నను నేషనల్ క్రష్ గా పిలుచుకున్నారు ఆడియన్స్. కానీ ఇప్పుడు వారంలో 500 కోట్లు కలెక్ట్ చేసిన ఓసినిమాతో హీరోయిన్ రుక్మిణి వసంత్ ఇంటర్నేషనల్ క్రష్ గా మారింది.

ట్రెండింగ్‌లో రుక్మిణి వసంత్
కన్నడ నటి, 'సప్త సాగరదాచె ఎల్లో' సినిమా ఫేమ్ రుక్మిణి వసంత్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన 'కాంతార చాప్టర్ 1'లో 'కనకవతి'గా నటించిన రుక్మిణి వసంత్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. కాంతార చాప్టర్ 1 సినిమా వారంలోనే 500 కోట్లు దాటిందని నిర్మాణ సంస్థ 'హోంబాలే ఫిల్మ్స్' అధికారికంగా ప్రకటించింది.
కొత్త నేషనల్ క్రష్ దొరికింది
రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార చాప్టర్ 1’ సినిమాలో కనకవతి గా నటించిన నటి రుక్మిణి వసంత్ ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఇప్పటివరకూ నేషనల్ క్రష్ గా ఉంది రష్మిక మందన్న. కాని కాంతార తరువాత రుక్మిణి వసంత్ ను కన్నడ ఆడియన్స్ హైలెట్ చేస్తూ వస్తున్నారు.
500 కోట్లు దాటిన కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
రిషబ్ శెట్టి ‘కాంతార చాప్టర్ 1’ సినిమా కలెక్షన్ 500 కోట్లు దాటిందని ఈ సినిమా నిర్మాణ సంస్థ ‘హొంబాలే ఫిల్మ్స్’ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించింది. ఒక కన్నడ సినిమా ఒకే వారంలో 500 కోట్లు వసూలు చేసి కొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో అద్భుతంగా నటించిన రుక్మిణి వసంత్ పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హీరోయిన్ గా, విలన్ గా ఆమె నటన ఎవర్ గ్రీన్ అంటున్నారు.
ఇంటర్నేషనల్ క్రష్ గా రుక్మిణి
రుక్మిణి వసంత్, ప్రస్తుతం తమిళ, కన్నడ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా బిజీ అయిపోయారు. అయితే ఆమెను ఇప్పుడు ఏమని పిలవాలి అని కన్నడ ఆడియన్స్ ఆలోచనలో పడ్డారు. కన్నడ క్రష్, కర్ణాటక క్రష్, నేషనల్ క్రష్ లేదా ఇంటర్నేషనల్ క్రష్ - వీటిలో ఏది ఆమెకు బాగా సరిపోతుందో అనే చర్చ ఇప్పుడు ప్రారంభమైంది.
రష్మికపై వ్యతిరేకత
రష్మిక మందన్నపై కన్నడనాట కొంత వ్యతిరేకత ఉంది. అలా ఆమెను విమర్శించే వారు రుక్మిణి వసంత్ కు హైలెట్ చేయాలని చూస్తున్నారు. రుక్మిణి వసంత్ ను ఏకంగా 'ఇంటర్నేషనల్ క్రష్' అని పిలవడం ప్రారంభించారు.
రష్మిక స్థానంలో రుక్మిణి..?
మొత్తానికి కన్నడ నటి రుక్మిణి వసంత్ కొత్త అధ్యాయం కాంతారతో మొదలైంది. విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం, త్వరలో ఆమె పెళ్లి జరగబోనుండటంతో .. రష్మిక మందన్న స్థానాన్ని ఈ నటి భర్తీ చేయబోతోంది అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి రుక్మిణి వసంత్ నించగా ఆ స్థాయికి చేరుతుందా, లేదా అనేది చూడాలి?