ఆరెంజ్ డ్రెస్ లో ఓ రేంజ్ లో శ్రీలీల ఫోజులు.. చిరునవ్వుతో చంపేస్తున్న రామ్ బ్యూటీ.
టాలీవుడ్ ఆడియన్స్ ను మాయ చేస్తోంది హీరోయిన్ శ్రీలీల. అందంతో అద్భుతం చేస్తోంది. నటనతో మెప్పిస్తోంది. వరుసగా అవకాశాలు సాధిస్తోంది. ప్రస్తుతం డజను సినిమాలకు పైగా తన ఖాతాలో వేసుకుంది బ్యూటీ.
టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడమే ప్లాప్ సినిమా పెళ్లిపందిరితో వచ్చినా.. ఈసినిమాలో తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది బ్యూటీ. తన నటన, గ్లామర్ తో ఎప్పటికప్పుడు ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తూనే ఉంది శ్రీలీల. తెలుగులో స్టార్ మేకర్స్ ను తన వైపు తిప్పుకుంది.
ప్రస్తుతం టాలీవుడ్ గట్టిగా వినిపిస్తున్న ఏకైక హీరోయిన్ పేరు శ్రీలీల. స్టార్ హీరోలు.. యంగ్ హీరోలు కూడా శ్రీలీలా ఉంటే సినిమా హిట్లు అన్నట్టుగా మారిపోయింది. ఇండస్ట్రీ మొత్తం యంగ్ హీరోయిన్ శ్రీలీల జపం చేస్తున్నారు. అంతే కాదు రెమ్యునరేషన్ కూడా గట్టిగానే డిమాండ్ చేస్తుందట చిన్నది.
ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ అయ్యింది శ్రీలీలా. గతంలో పెద్దగా పట్టించుకోలేదు కాని.. ఈమధ్య ఇన్ స్టాను బాగా అప్ డేట్ చేస్తోంది. గ్లామర్ ఫోటోలతో నింపేస్తోంది. తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది. ఆరెంజ్ కలర్ డ్రస్ లో... అందాలు ఆరబోస్తూ.. చిరునవ్వులతో చంపేస్తోంది బ్యూటీ. ప్రస్తుతం శ్రీలీలా ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
నిన్న గాక మొన్న ఇండస్ట్రీ కి వచ్చిన శ్రీలీలా.. ఇలా చూస్తుండగానే అలా వరుస సినిమాలు చేసుకుంటూ పోతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏకంగా 12 సినిమాలు ఉన్నాయి. కృతీ శెట్టి లాంటివారిని పక్కకు నెట్టి.. టాలీవుడ్ ను ఏలేస్తోంది బ్యూటీ. తిరుగులేని ఇమేజ్ ను సాధించింది శ్రీలీలా.
రామ్ లాంటి యంగ్ హీరో సరసన.. రవితేజ లాంటి సీనియర్ హీరో పక్కన కూడా నటిస్తూ.. వారి ఎనర్జీకి ఎదురెళ్తూ.. పర్ఫామెన్స్ తో పాటు.. డాన్స్ విషయంలో కూడా సత్తా చాటుతోంది బ్యూటీ. ఈ ఏడాది ఈమె నటించిన మూడు సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి.
ఉస్తాద్ రామ్ పోతినేని - శ్రీలీలా జంటగా నటించిన చిత్రం విడుదల కాబోతోంది. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తున్నారు. వీటితో పాటు.. ‘ఆదికేశవ’, ‘స్కంద’, ‘గుంటూరు కారం’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘భగవంత్ కేసరి’, VD12, అనగనగ ఒక రాజు, ఎక్ట్రార్డినరీ మ్యాన్ లాంటిసినిమాలు చేస్తోంది. టాలీవుడ్ లో బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది.