MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • శ్రీలీల ఓల్డ్ వీడియో వైరల్, కావాలనే కొందరు ఈ టైమ్ లో

శ్రీలీల ఓల్డ్ వీడియో వైరల్, కావాలనే కొందరు ఈ టైమ్ లో

శ్రీలీల గతంలో ఐటెం సాంగ్స్ చేయనని చెప్పినప్పటికీ, పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై నెటిజన్లు స్పందిస్తూ, శ్రీలీల, అల్లు అర్జున్ ల డ్యాన్స్ టాలెంట్ ను ప్రశంసిస్తున్నారు.

2 Min read
Author : Surya Prakash
Published : Nov 04 2024, 10:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Sreeleela, Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2,

Sreeleela, Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2,


సోషల్ మీడియాలో కొన్ని చిత్రమైన విషయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అక్కడ కొంతమంది జనం ఎప్పటికప్పుడు పాత వీడియోలను తవ్వి వైరల్ చేసే పనిలో ఉంటారు. ప్రతీ విషయమీదా స్పందిస్తూంటారు.

ముఖ్యంగా సెలబ్రెటీలు, సినిమా స్టార్స్ విషయాలు అంటే బాగా ఆసక్తి. ఆ విషయాలను ఫాలో అవుతూ స్పందిస్తూంటారు. ఇలా ఇప్పుడు శ్రీలీల పై వారి దృష్టి పడింది. శ్రీలల పాత వీడియో ఒకటి వైరల్ చేస్తున్నారు. ఎందుకు అంటే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Sreeleela, Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2,

Sreeleela, Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2,

పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ శ్రీలీల. మొదటి సినిమాతోనే సెన్సెషన్ సృష్టించిన ఈ బ్యూటీకి ఆ తర్వాత వెంటనే ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.దీంతో తెలుగులో దాదాపు అరడజనుకు పైగా చిత్రాల్లో ఛాన్స్ కొట్టేసింది.

కానీ ఈ బ్యూటీకి వరుసగా ప్లాప్స్ రావడంతో కొన్ని రోజులపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయితే శ్రీలీల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది. నిత్యం లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. తాజాగా గ్లామర్ డోస్ పెంచేసింది హీరోయిన్ శ్రీలీల. ఈ క్రమంలో ఆమెకు పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చిందని సమాచారం. గుంటూరు కారంలో మహేష్ తో పోటీగా ఆమె వేసిన స్టెప్స్ కు ఫిదా అయిన టీమ్ ఈ నిర్ణయానికి వచ్చారని సమాచారం. 

36
Sreeleela, Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2,

Sreeleela, Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2,


ఈ నేపధ్యంలో గతంలో ఆమె ఐటెం సాంగ్ లు చేయనని చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. భగత్ సింగ్ కేసరి ప్రమోషన్ టైమ్ లో ఆమె మాట్లాడుతూ..స్పెషల్ సాంగ్ మీకు ఆఫర్ చేస్తే చేస్తారా అని మీడియావారు ఓ ఇంటర్వూలో  అడిగారు.

దానికి శ్రీలీల సమాధానం ఇస్తూ...తాను ఇలాంటివి చేయాలనుకోవటం లేదని చెప్పారు. విజ్జిపాప లాంటి పాత్రల్లో తాను తెరపై కనిపిస్తూ స్పెషల్ సాంగ్స్ చేస్తే బాగుండదని అన్నారు. అభిమానులు నన్ను అలా చూడటానికి ఇష్టపడరు అన్నట్లు గా చెప్పుకొచ్చింది. 

46
sreeleela

sreeleela


సుకుమార్‌ సినిమా అంటే స్పెషల్‌ సాంగ్స్‌కు ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. ఇప్పటివరకూ ఆయన తెరకెక్కించిన పలు సినిమాల్లోని.. ‘అ అంటే అమలాపురం’, ‘రింగ రింగా’, ‘జిగేల్‌ రాణి’ వంటి పాటలు సూపర్‌హిట్‌ అందుకున్నాయి.

‘పుష్ప ది రైజ్‌’లోని ‘ఊ అంటావా మావ’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్‌ అవతార్‌లో అల్లు అర్జున్‌, క్లాసీ లుక్‌లో సమంత స్టెప్పులు అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘పుష్ప ది రూల్‌’లో కూడా అదేస్థాయిలో ఓ సాంగ్‌ ఉంటుందని ఇప్పటికే చిత్ర టీమ్ ప్రకటించింది. 

56
Sreeleela

Sreeleela


అయితే ఆ ఐటం సాంగ్ లో ఎవరు కనిపించనున్నారనే విషయంలో బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్‌ (Shraddha Kapoor)తోపాటు పలువురు స్టార్స్ పేర్లు వినిపించాయి. రెమ్యునరేషన్  కారణంగా శ్రద్ధాకపూర్‌ ఈ టీమ్‌లో భాగం కాలేకపోయారని సమాచారం. ఈక్రమంలోనే చిత్ర టీమ్ శ్రీలీలను సంప్రదించినట్లు తెలుస్తోంది.

ఈమేరకు జరుగుతోన్న ప్రచారంపై నెటిజన్లు స్పందిస్తున్నారు. వీరిద్దరికి డ్యాన్స్‌లో సూపర్‌ టాలెంట్‌ ఉంది. కాబట్టి ఈసారి థియేటర్లు దద్దరిల్లిపోవడం పక్కా అనుకుంటున్నారు. మరోవైపు అల్లు అర్జున్‌ - శ్రీలీల ఇప్పటికే ఓ యాడ్‌ కోసం వర్క్‌ చేశారనే విషయం తెలిసిందే. 

66
Sreeleela

Sreeleela

అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప ది రూల్‌’ (Pushpa the Rule). 2021లో విడుదలైన ‘పుష్ప ది రైజ్‌’(Pushpa The Rise) కు సీక్వెల్‌గా వస్తోన్న  ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ‘పుష్ప’ తీర్చిదిద్దారు. కూలీగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన పుష్పరాజ్‌.. ఎర్రచందనం సిండికేట్‌ను శాసించే స్థాయికి ఎలా వెళ్లాడనే ఆసక్తికర అంశాలతో ‘పుష్ప ది రైజ్‌’ చిత్రీకరించారు. ఆ తర్వాత అతడికి ఎదురైన ఇబ్బందులు ఏమిటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అనే అంశాలతో ‘పుష్ప ది రూల్‌’ సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇది షూటింగ్ దశలో ఉంది.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Meenakshi Chaudhary: ఆ రొమాంటిక్‌ హీరోతో డేట్‌కి వెళ్తా.. మీనాక్షి చౌదరీ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌
Recommended image2
Hi Movie Box Office: నయనతార మూవీకి షాకింగ్‌ కలెక్షన్లు.. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా మరీ ఇంతనా?
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి స్టార్‌ కమెడియన్స్.. రేటింగ్‌ కోసం నాగార్జున అదిరిపోయే ప్లాన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved