MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rajasekhar: ఆ కారణంతోనే నా కెరీర్‌ ట్రాక్‌ తప్పింది, లేదంటే మెగాస్టార్‌ రేంజ్‌.. నిజాన్ని ఒప్పుకున్న రాజశేఖర్‌

Rajasekhar: ఆ కారణంతోనే నా కెరీర్‌ ట్రాక్‌ తప్పింది, లేదంటే మెగాస్టార్‌ రేంజ్‌.. నిజాన్ని ఒప్పుకున్న రాజశేఖర్‌

రాజశేఖర్‌ ఒకప్పుడు చిరంజీవి స్థాయిలో రాణించారు. కానీ ఆ తర్వాత కెరీర్‌ డౌన్‌ అయ్యింది. దానికి రకరకాల కారణాలు, వివాదాలు అని అంటుంటారు, కానీ అసలు నిజం ఏంటనేది రాజశేఖర్‌ వెల్లడించారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 28 2026, 08:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ప్రారంభంలో చిరంజీవికి పోటీ ఇచ్చిన రాజశేఖర్‌
Image Credit : Youtube/ TFPC

ప్రారంభంలో చిరంజీవికి పోటీ ఇచ్చిన రాజశేఖర్‌

యాంగ్రీయంగ్‌ మ్యాన్‌గా రాణించారు రాజశేఖర్‌. వరుసగా యాక్షన్‌ చిత్రాలతో అదరగొట్టారు. టాలీవుడ్‌లో ఒక్కసారిగా తిరుగులేని స్టార్‌గా ఎదిగారు. `అంకుశం`, `ఆహుతి`, `అన్న`, `అల్లరి ప్రియుడు` చిత్రాలతో రాజశేఖర్‌ రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. అప్పట్లో టాలీవుడ్‌లో నెంబర్‌ 1 అని ఎవరూ లేరు. రాజశేఖర్‌ ఆ సమయంలో వరుస విజయాలతో దూసుకుపోయారు. టాలీవుడ్‌లో ఎవరికీ సాధ్యం కాని కలెక్షన్లు ఆయన సినిమాలకు వచ్చేవి. మాస్‌ ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. దీంతో ఆ సమయంలో చిరంజీవి స్థాయిలో స్టార్‌గా ఎదిగారు రాజశేఖర్‌. ఇంకా చెప్పాలంటే నువ్వా, నేనా అనేలా ఉండేది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అనూహ్యంగా కెరీర్ డౌన్‌.. కారణం చెప్పిన రాజశేఖర్‌
Image Credit : our own

అనూహ్యంగా కెరీర్ డౌన్‌.. కారణం చెప్పిన రాజశేఖర్‌

కానీ రాజశేఖర్‌ అనూహ్యంగా డౌన్‌ అయ్యారు. చాలా రోజులు చిరుకి గట్టి పోటీ ఇచ్చినా క్రమంగా ఆయన కెరీర్‌ డౌన్‌ అవుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా రాజశేఖర్‌ స్పందించారు. తన కెరీర్‌ ట్రాక్‌ తప్పిన మాట నిజమే అని ఒప్పుకున్నారు. అందుకు అసలు కారణాలు చెప్పారు. ``అంకుశం`, `ఆహుతి`, `అన్న`, `అల్లరి ప్రియుడు` వంటి హిట్లతో తాను టాప్‌లోకి వెళ్లిన మాట నిజమే, చిరంజీవికి పోటీగా వస్తున్నారని ఆ సమయంలో అంతా మాట్లాడుకున్నారు. కానీ ఆ తర్వాత నా కెరీర్‌ అంత బాగా సాగలేదు. ఫెయిల్యూర్స్ ఎక్కువగా చూడాల్సి వచ్చింది. అందుకు కారణం సరైన ప్లానింగ్ లేకపోవడమే. చిరంజీవిగారు వరుసగా హిట్ల నేపథ్యంలో నెక్ట్స్ ఎవరితో సినిమా చేయాలని, పెద్ద బ్యానర్‌, పెద్ద దర్శకులు, పెద్ద టెక్నీషియన్లు ఇలా సరైన ప్లానింగ్‌గా, సెలక్టీవ్‌గా సినిమాలు చేశార`ని తెలిపారు రాజశేఖర్‌.

34
ప్లానింగ్‌ లేకపోవడమే మెయిన్‌ రీజన్‌
Image Credit : our own

ప్లానింగ్‌ లేకపోవడమే మెయిన్‌ రీజన్‌

`కానీ నాకు అలాంటి ప్లానింగ్‌ లేదు. ఎవరైనా వచ్చి కథ చెబితే నచ్చితే చేసేవాడిని, ఆ దర్శకుడు చేయగలడా? ఆ నిర్మాత బాగా తీయగలడా అనేది చూడలేదు. మెయిన్‌గా దర్శకులు, నిర్మాతల విషయంలో పెద్దగా ఫోకస్‌ చేయలేదు, కొత్తవాళ్లతో ఎక్కువగా చేశాను, పెద్ద దర్శకులు, నిర్మాతలతో రిపీట్‌ చేయలేకపోయాను, కథల ఎంపికలోనూ ప్లానింగ్‌ మిస్‌ అయ్యింది` అని చెప్పారు రాజశేఖర్‌. వచ్చిన సినిమా, నచ్చిన కథలు చేసుకుంటూ రావడంతో అవి సరిగ్గా ఆడలేదని, కొన్ని సరిగ్గా తీయలేకపోయారని, ప్రొడక్షన్స్ పరంగానూ ఇబ్బందులు ఫేస్‌ చేయాల్సి వచ్చిందని తెలిపారు రాజశేఖర్‌. దీంతో కెరీర్‌ ఆశించిన స్థాయిలో రన్‌ కాలేదని వెల్లడించారు. తన కెరీర్‌ గాడి తప్పడానికి సరైన ప్లానింగ్‌ లేకపోవడమే పెద్ద మిస్టేక్‌ అని ఆయన స్పష్టం చేశారు. ఆర్కే టాక్‌ షోలో రాజశేఖర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

44
రాఘవేంద్రరావుతో గొడవ కూడా కొంప ముంచింది
Image Credit : our own

రాఘవేంద్రరావుతో గొడవ కూడా కొంప ముంచింది

ఇదే కాదు, దీనికితోడు మరో మెయిన్‌ రీజన్‌ కూడా ఉంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో గొడవ కూడా మరో కారణంగా చెప్పొచ్చు. తన మరదలి విషయంలో దర్శకుడు తప్పు చేస్తున్నాడని, ఇతరులు చెబితే విన్న రాజశేఖర్‌ తాగిన మత్తులో ఆయన ఇంటికెళ్లి గొడవ పెట్టుకున్నాడట. పెద్దగా అరిచాడట. దీంతో రాఘవేంద్రరావు హర్ట్ అయ్యారని తెలిపారు. ఆ విషయంలో తనదే మిస్టేక్‌ అని, ఆ తర్వాత ఆయన్ని కలిసి సారీ చెప్పామని, బతిమాలమని, కానీ ఆయన తనతో సినిమాలు చేయలేదని చెప్పారు. రాఘవేంద్రరావు `అల్లరి ప్రియుడు` మూవీతో తన ఇమేజ్‌ని మార్చేశారని, ఆ తర్వాత ఆయనతో మరికొన్ని సినిమాలు చేసి ఉంటే కెరీర్‌ మరోలా ఉండేదనే అభిప్రాయాన్ని రాజశేఖర్‌ వెల్లడించారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramya Krishnan: బిగ్ బాస్ హోస్ట్‌గా రమ్యకృష్ణ.. ఒక్క ఎపిసోడ్ కు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Recommended image2
ANR: నాగార్జునని పొగడడం అప్పటి వరకు జరగదు, అలాంటి సినిమాలు చేస్తేనే.. సొంత కొడుక్కే షాకిచ్చిన ఏఎన్నార్
Related Stories
Recommended image1
Husharu 2 Teaser: క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా ఆర్‌ నారాయణ మూర్తి, థియేటర్లో బ్లాస్టే.. హుషారు 2 టీజర్ ఎలా ఉందంటే?
Recommended image2
NTR Accident: నువ్వు అడుగుపెట్టావ్‌, ఎన్టీఆర్‌కి యాక్సిడెంట్.. శ్రీనివాస్‌ రెడ్డికి ఫ్యూజులు ఔట్‌.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved