- Home
- Entertainment
- ఇంకా పెళ్లే కాలేదు, అప్పుడే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన శ్రీలీల.. ఏం జరిగిందో తెలుసా?
ఇంకా పెళ్లే కాలేదు, అప్పుడే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన శ్రీలీల.. ఏం జరిగిందో తెలుసా?
యంగ్ సెన్సేషన్ శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా ఉంది. నేడు తన 24వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. ఈ క్రమంలో శ్రీలీలకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.

టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన శ్రీలీల
శ్రీలీల టాలీవుడ్‌లో యంగ్ సెన్సేషన్. తొలి చిత్రంతోనే టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన హీరోయిన్. రెండు మూడేళ్లలోనే టాలీవుడ్‌లో ఓ ఊపు ఊపేసింది. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ఓ రౌండ్ చుట్టేసింది. తనదైన డాన్సులతో అలరించింది.
అయితే వరుసగా ఆఫర్లు వచ్చినా చాలా వరకు సినిమాలు ఆడకపోవడంతో ఒక్కసారిగా డౌన్ అయ్యింది శ్రీలీల. ఆమె ఎంత వేగంగా దూసుకొచ్చిందో, అంతే వేగంగా డౌన్ అయిపోయింది. తన క్రేజ్ మొత్తం పడిపోయింది.
వరుస ఫెయిల్యూర్స్ తో శ్రీలీల కెరీర్ డౌన్
శ్రీలీల `పెళ్లి సందడి` చిత్రంతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ కి జోడీగా చేసింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన ఈ మూవీలో తనదైన డాన్సులతో ఆకట్టుకుంది. ఆ వెంటనే రవితేజతో `ధమాఖా` చిత్రంలో నటించి హిట్ అందుకుంది. ఈ మూవీలో శ్రీలీల డాన్సులకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.
అంతే ఒక్కసారిగా శ్రీలీలకి ఆఫర్లు కుప్పలు తెప్పలుగా అవకాశాలు వచ్చాయి. `స్కంద`, `భగవంత్ కేసరి`, `ఆదికేశవ`, `ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్`, `గుంటూరు కారం`, `రాబిన్‌హుడ్` వంటి చిత్రాల్లో నటించింది. ఈ మూవీస్‌లో `భగవంత్ కేసరి` ఒక్కటే ఆకట్టుకుంది. మిగిలిన అన్నీ పరాజయం చెందాయి.
మళ్లీ పుంజుకున్న శ్రీలీల
అల్లు అర్జున్‌తో కలిసి `పుష్ప 2`లో స్పెషల్ సాంగ్ చేసింది. `కిస్సిక్` అంటూ ఆమె అదరగొట్టింది. ఈ పాటతో నేషనల్ వైడ్‌గా ఫేమస్ అయ్యింది. దీంతో ఇతర భాషల్లోనూ ఆఫర్లని అందుకుంటోంది. ప్రస్తుతం శ్రీలీల మళ్లీ బిజీ అవుతోంది. తెలుగులో `మాస్ జాతర`, `ఉస్తాద్ భగత్ సింగ్`, `లెనిన్` చిత్రాలు చేస్తోంది.
ఇక తమిళంలో `పరాశక్తి`, హిందీలో `ఆషిఖి 3`, కన్నడలో `జూనియర్` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈ సినిమాలు హిట్ అయితేనే ఆమె స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంటుంది. లేదంటే కథ మళ్లీ మొదటికొస్తుంది. అయితే ఈ సారి మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది శ్రీలీల. కంటెంట్ ఉన్న చిత్రాలకే ప్రయారిటీ ఇస్తోంది.
పెళ్లికి ముందే తల్లి అయిన శ్రీలీల
ఇదిలా ఉంటే శ్రీలీల నేడు తన 24వ పుట్టిన రోజుని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె నటిస్తోన్న కొత్త సినిమాల కొత్త లుక్‌లు వచ్చాయి. ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా శ్రీలీలకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
ఆమె పెళ్లి చేసుకోక ముందే తల్లి అయ్యింది. ఇద్దరు పిల్లలకు తల్లి కావడం విశేషం. అదేంటో చూస్తే, శ్రీలీల కన్నడలో `బై టూ లవ్` అనే సినిమాలో నటించింది. ఈ మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక అనాథ శరణాలయానికి వెళ్లింది. అక్కడ అనాథలను చూసి చలించిపోయింది శ్రీలీల. వారికోసం ఏదైనా చేయాలని భావించింది.
అందులో భాగంగా బుద్ధి మాంద్యం ఉన్న ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. తన గొప్ప హృదయాన్ని చాటుకుంది. ఇప్పుడు వారి పోషణ, థెరఫీకి సంబంధించిన అన్నీ తానే చూసుకుంటుంది. ఓ రకంగా వారికి తల్లిలా మారిపోయింది శ్రీలీల. కానీ ఈ విషయాన్ని ఆమె ఎప్పుడూ బయటకు చెప్పలేదు.
శ్రీలీల జీవితంలోనే బెస్ట్ మూమెంట్
ఇలా పెళ్లి చేసుకోకముందే ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది శ్రీలీల. ఆ పిల్లలను దత్తత తీసుకోవడంపై శ్రీలీల స్పందిస్తూ తన జీవితంలో అత్యంత సంతోషకరమైన మూమెంట్ ఏదైనా ఉందంటే అది ఇదే అని ఆమె తెలిపింది. స్వతహాగా డాక్టర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన శ్రీలీల కూడా డాక్టరే.
ఆ మధ్యనే ఎంబీబీఎస్ ఫైనల్ ఎగ్జామ్స్ రాసింది. అందుకోసం సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు డాక్టర్ ప్రాక్టీస్ కంటే సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. వరుసగా సినిమాలుండటంతో డాక్టర్ వృత్తిలో కొనసాగలేకపోతుంది. అయితే భవిష్యత్‌లో మాత్రం ఆ దిశగా ప్లాన్స్ చేసే అవకాశం ఉందట.