గ్రీన్ డ్రెస్ లో శ్రీలీలా మెరుపులు.. యంగ్ సెన్సేషన్ అందానికి వంక పెట్టగలమా..
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ త్వరలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించబోతోంది. ఈ సందర్భంగా ఆమె సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ.. నయా లుక్స్ లో మెరుస్తోంది. పద్ధతిగా దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది.
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా (Sreeleela) కెరీర్ ప్రస్తుతం పీక్స్ లో ఉంది. అగ్ర హీరోలు, భారీ చిత్రాల్లో నటిస్తూ చిన్న వయస్సులోనే బిజీయేస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె నటించిన ఒక్కో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
అక్టోబర్ 19న ‘భగవంత్ కేసరి’తో ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో బాలయ్యకు కూతురి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో శ్రీలీలా పాత్రపై మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే వచ్చే నెలలో ‘ఆదికేశవ’తోనూ రాబోతోంది.
ఈ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రాబోతుండటంతో శ్రీలీలా ప్రమోషన్స్ లో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా నయా లుక్స్ లో ఫొటోషూట్లు కూడా చేస్తూ ఆకట్టుకుంటోంది. గ్లామర్ షోకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ క్యూట్ లుక్స్ తో మాత్రం అదరగొడుతోంది.
తాజాగా గ్రీన్ డ్రెస్ లో మెరిసింది. చుడీదార్ లో మెస్మరైజ్ చేసింది. అయితే ట్రెడిషనల్ లుక్ లో రెడీ అయితే.. కెమెరా కళ్లు తనను సిగ్గుపడేలా చేస్తున్నాయంటూ.. ఫన్నీగా ఆ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ఇక శ్రీలీలా ఎక్కడ మెరిసినా ఆ ముద్దుగుమ్మకున్న క్రేజ్ కు కెమెరాలు ఆమెపైనే వాలిపోతుండటం గమనార్హం.
శ్రీలీలా బ్యూటీఫుల్ లుక్స్ కు ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె క్యూట్ స్మైల్ కు మంత్రముగ్ధులు అవుతున్నారు. ఈ సందర్భంగా ఆ ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ గా మారుతున్నారు. యంగ్ బ్యూటీ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.
ఇప్పటి వరకు శ్రీలీలా వెండితెరపై ‘పెళ్లి సందD’, ‘ధమకా’ వంటి చిత్రాలతో అలరించింది. ఈ రెండు చిత్రాల్లోని తన టాలెంట్ కే టాలీవుడ్ లో భారీ ఆఫర్లు దక్కుతున్నాయి. ఒక తెలుగు హీరోయిన్ గా శ్రీలీలాకు ఏకంగా పది ప్రాజెక్ట్స్ లో అవకాశం దక్కడం గొప్ప విషయమే. ఇక ‘గుంటూరు కారం’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తదితర చిత్రాల్లోనూ నటిస్తోంది.