MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • శ్రీలీలకి దెబ్బ మీద దెబ్బ.. మరో కృతి శెట్టి అవుతుందా?.. తప్పు తెలుసుకోకపోతే తిప్పలే?

శ్రీలీలకి దెబ్బ మీద దెబ్బ.. మరో కృతి శెట్టి అవుతుందా?.. తప్పు తెలుసుకోకపోతే తిప్పలే?

టాలీవుడ్‌ క్రేజీ బ్యూటీ శ్రీలీల తాజాగా `ఆదికేశవ` సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. కానీ ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టింది. దీంతో కృతి శెట్టితో పోల్చుతున్నారు నెటిజన్లు.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 25 2023, 03:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్‌ హీరోయిన్లలో అత్యంత క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌ ఎవరైనా ఉన్నారంటే ఠక్కున గుర్తొచ్చేది శ్రీలీల పేరే. ఆమె అంతగా ప్రభావాన్ని చూపిస్తుంది. అంతగా హాట్‌ కేక్‌ అయిపోయింది. ఆమె కోసం హీరోలు, దర్శక, నిర్మాతలు వెయిట్‌ చేస్తున్నారు. పారితోషికం ఎంతైనా ఇచ్చేందుకు ముందుకు వస్తుండటం విశేషం. అయితే ఇప్పుడు పరిస్థితులు తేడా కొడుతున్నాయి. సినిమా ఫలితాలు షాకిస్తున్నాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

శ్రీలీల `పెళ్లిసందడి`తో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చింది. ఆ వెంటనే ఆమెకి రవితేజ్‌తో `ధమాఖా` చిత్రంలో నటించే అవకాశం వరించింది. దీంతో ఒక్కసారిగా స్టార్‌ అయిపోయింది. ఈ సినిమా విజయంలో ఆమె దాదాపు పది ఆఫర్లు వచ్చాయి. పది సినిమాలకు సైన్‌ చేసింది. వాటిలో `స్కంద`, `భగవంత్‌ కేసరి`, `ఆది కేశవ`, విజయ్‌ దేవరకొండ-గౌతమ్‌ తిన్ననూరి సినిమా, నితిన్‌ `ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్‌`, మహేష్‌బాబు `గంటూరు కారం`, పవన్‌ `ఉస్తాద్ భగత్‌ సింగ్‌`, కన్నడ మూవీ, అలాగే చిరంజీవి చిత్రంలో ఆమె పేరు వినిపించింది. 

37

వీటిలో రెండు సినిమాలు క్యాన్సిల్‌ అయ్యాయి. `స్కంద`, `భగవంత్‌ కేసరి`, `ఆదికేశవ` సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో బాలయ్యకి కూతురు పాత్రలో కనిపించిన `భగవంత్‌ కేసరి` మూవీ ఫర్వాలేదనిపించుకుంది. బలవంతపు హిట్‌గా నిలిచింది. రామ్‌తో నటించిన `స్కంద` డిజాస్టర్‌ అయ్యింది. వైష్ణవ్‌ తేజ్‌తో చేసిన `ఆదికేశవ` రిజల్ట్ కూడా తేడా కొట్టింది. ఈ నేపథ్యంలో శ్రీలీలకి ఇలా దెబ్బ మీద దెబ్బ పడటంతో ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. 

47

శ్రీలీల మరో రెండు వారాల్లో `ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్‌` చిత్రంతో రాబోతుంది. నితిన్‌ హీరోగా రూపొందిన చిత్రమిది. వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. ఈ మూవీపై కూడా బజ్‌ లేదు. ఈ సినిమా ఒకటి వస్తున్నారని కూడా ఆడియెన్స్ గుర్తించలేని స్థితిలో ఉంది. సినిమా బిజినెస్‌ పరంగానూ స్ట్రగుల్‌ అవుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది నెక్ట్స్ కృతి శెట్టి లాంటి పరిస్థితి అవుతుందా? అనే సందేహం కలుగుతుంది. 
 

57

కృతిశెట్టి `ఉప్పెన` చిత్రంలో సంచలనంగా మారింది. ఆమెకి వరుసగా ఐదారు సినిమా ఆఫర్లు వచ్చాయి. అందులో `శ్యామ్‌ సింగరాయ్‌`, `బంగార్రాజు` జస్ట్ ఓకే అనిపించాయి. `ది వారియర్స్`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, `కస్టడీ`, `మాచర్ల నియోజకవర్గం` చిత్రాలు బోల్తా కొట్టాయి. దీంతో ఒక్కసారిగా జీరో అయిపోయింది కృతి. ఆమె చేతిలో ఆఫర్లు లేకుండా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు శర్వానంద్‌తో ఒక సినిమా చేస్తుంది. ఇతర భాషలో ఒక్కోసినిమా చేస్తుంది. కానీ కృతి శెట్టికి క్రేజ్‌ తగ్గిపోయింది.
 

67

ఇప్పుడు శ్రీలీలకి కూడా అలాంటి పరిస్థితే వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్‌ మీడియాలో ఇదే చర్చ నడుస్తుంది. అతిక్రేజ్, అతి స్టార్‌ డమ్‌ హీరోయిన్ల పాలిట శాపంగా మారుతుంది.ఆ క్రేజ్‌లో కుప్పలు తెప్పలుగా ఆఫర్లు వచ్చి పడటం, వచ్చిన ఆనందంలో, ఎగ్జైట్‌మెంట్‌లో ఆ సినిమాలకు కమిట్‌ కావడం, ఒక్కోక్కటిగా బోల్తా కొడుతుంటే డీలా పడటం చూస్తుంటే కృతి లా శ్రీలీల మారిపోతుందా అనిపిస్తుంది. 

77

అయితే శ్రీలీల చేతిలో `గుంటూరు కారం`, `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` వంటి రెండు భారీ ప్రాజెక్ట్ లు కూడా ఉన్నాయి. అవి మినిమమ్‌ గ్యారంటీ మూవీలు. మిగిలినవి తేడా కొట్టినా అవి నిలబెడతాయనే హోప్‌లో ఉంది శ్రీలీల. ఏదేమైనా శ్రీలీల ఆఫర్లకు సైన్‌ చేయడంలో విఫలమయ్యిందంటే కెరీర్‌ రివర్స్ అవుతుంది.ఆ విషయాన్ని తెలుసుకుని సినిమాలు చేస్తే నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved