- Home
- Entertainment
- గ్యాప్ లేకుండా ఐదు నెలలు రచ్చ చేయబోతున్న శ్రీలీల.. క్రేజీ బ్యూటీ దెబ్బకి కుర్రాళ్లు ఊగిపోవాల్సిందే!
గ్యాప్ లేకుండా ఐదు నెలలు రచ్చ చేయబోతున్న శ్రీలీల.. క్రేజీ బ్యూటీ దెబ్బకి కుర్రాళ్లు ఊగిపోవాల్సిందే!
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల గురించి టాలీవుడ్‌లో చర్చ లేని రోజు లేదు. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అంతా ఈ బ్యూటీ చుట్టే తిరుగుతున్నారు. అంతటి క్రేజీ, డిమాండ్ కలిగిన శ్రీలీల అసలైన రచ్చ స్టార్ట్ చేయబోతుంది. గ్యాప్ లేకుండా కొట్టబోతుంది.

శ్రీలీల ఎంట్రీ సింపుల్‌గానే సాగింది. `పెళ్లి సందడి` చిత్రంతో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఈ యంగ్ బ్యూటీని టాలీవుడ్‌కి పరిచయం చేశాడు. తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది. ఏకంగా మాస్ మహారాజా రవితేజతో కలిసి నటించే ఛాన్స్ దక్కించుకుంది. `ధమాఖా` చిత్రంతో ఉర్రూతలూగించింది. ఇందులో శ్రీలీల నటనతోపాటు డాన్సులు హైలైట్ అయ్యాయి. సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించింది. దీంతో ఈ బ్యూటీని వెతుక్కుంటూ యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోలు కూడా వచ్చారు. దీంతో ఇప్పుడు ఈ బ్యూటీ వద్ద సుమారు పది సినిమాలున్నాయి.
శ్రీలీల నటించిన సినిమాల్లో సుమారు ఐదు చిత్రాలు బ్యాక్ టూ బ్యాక్ విడుదల కాబోతుంది. సెప్టెంబర్ నుంచి జనవరి వరకు గ్యాప్ లేకుండా వెండితెరపై రచ్చ చేయబోతుంది శ్రీలీల. ప్రతి నెల ఒక్కో సినిమాతో సందడి చేయబోతుంది. తన అందాలు, డాన్సులతో ఫిదా చేయబోతుంది. ఓ రకంగా అన్ని రకాలుగా ఆడియెన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేయబోతుంది. దీంతో ఇక ఆమె ఫ్యాన్స్ కి నెల నెల పండగే పండగ. మరి ఏమేం సినిమాలతో ఈ క్రేజీ బ్యూటీ రాబోతుందో చూద్దాం.
శ్రీలీల వచ్చే నెల.. ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో కలిసి రాబోతుంది. ఇందులో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న `స్కంధ` చిత్రంతో రాబోతుంది శ్రీలీల. బోయపాటి మూవీ అంటే మాస్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్. ఈ సినిమాని కూడా అదే రేంజ్‌లో రూపొందించారని ఇప్పటికే విడుదలైన టీజర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. తాజాగా విడుదలైన పాట కూడా ఊపేస్తుంది. ఇందులో శ్రీలీల డాన్సులు మరోసారి హైలైట్ కాబోతున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదల కాబోతుంది. వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ రాబోతుంది.
అక్టోబర్ నెలలో బాలయ్య సినిమాతో రాబోతుంది శ్రీలీల. బాలకృష్ణ, కాజల్ జంటగా నటిస్తున్న `భగవంత్ కేసరి` చిత్రంలో శ్రీలీల బాలయ్యకి కూతురుగా నటిస్తుంది. కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దీనికి దర్శకత్వం వహిస్తుండగా, భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఇందులోనూ శ్రీలీల ఓ కొత్త తరహా పాత్రలో కనిపించబోతుందట. మొత్తానికి కూతురిగా అక్టోబర్‌లో హల్‌చల్ చేయబోతుందీ క్రేజీ బ్యూటీ.
నవంబర్‌లో.. యంగ్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ సినిమాతో రాబోతుంది. ఈ ఇద్దరు కలిసి నటించిన `ఆది కేశవ` చిత్రం నవంబర్ 10న రిలీజ్ కానుంది. దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుండటం విశేషం. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఇలా నవంబర్‌లో ఈ సినిమాతో హంగామా చేయబోతుంది శ్రీలీల.
ఇక డిసెంబర్‌లో నితిన్‌తో కలిసి రాబోతుంది. ఆయన హీరోగా రూపొందిన `ఎక్ట్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్` చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన మూవీ ఇది. ఈ సినిమా పాటలు, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఇక సినిమా డిసెంబర్ 2న విడుదల కాబోతుంది. ఇలా ఈ ఇయర్ ఎండ్‌లో నితిన్‌తో రొమాన్స్ చేస్తూ అలరించబోతుంది.
జనవరిలో సంక్రాంతికి `గుంటూరు కారం` సినిమాతో రాబోతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో మొదటగా పూజా హెగ్డే హీరోయిన్‌గా చేయగా, ఆమె తప్పుకోవడంతో ఆ స్థానంలో శ్రీలీలని తీసుకున్నారు. సెకండ్ హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి కనిపించబోతుంది. సంక్రాంతికి ఈఇద్దరు బ్యూటీలు రచ్చ రచ్చ చేయబోతున్నారు. అది మహేష్‌తో కావడం విశేషం. ఇలా శ్రీలీల గ్యాప్ లేకుండా ఐదు నెలలు ఐదు సినిమాలతో థియేటర్లలో సందడి చేయబోతుంది. అందాల విందు వడ్డించబోతుంది. డాన్సులతో మంత్రముగ్దుల్ని చేయబోతుందీ క్యూట్ బ్యూటీ.