- Home
- Entertainment
- రష్మిక, పూజా, కృతి, కీర్తిలకు వణుకు పుట్టిస్తున్న శ్రీలీలా.. ఒక్క దెబ్బతో స్టార్ హీరోయిన్ల సీన్ రివర్స్?
రష్మిక, పూజా, కృతి, కీర్తిలకు వణుకు పుట్టిస్తున్న శ్రీలీలా.. ఒక్క దెబ్బతో స్టార్ హీరోయిన్ల సీన్ రివర్స్?
టాలీవుడ్‌లో మొన్నటి వరకు అత్యంత క్రేజీ హీరోయిన్లుగా రాణించారు రష్మిక మందన్నా, పూజా హెగ్డే, కృతి శెట్టి, కీర్తిసురేష్, రాశీఖన్నా. కానీ వీరికి శ్రీలీలా రూపంలో గట్టి స్ట్రోక్ తగలబోతుంది.

శ్రీలీలా యంగ్ సెన్సేషన్‌గా మారిపోయింది. `పెళ్లి సందడి`తో ఒక్కసారిగా దూసుకొచ్చిన ఈ భామ ఇప్పుడు ఊహించిన ప్రాజెక్ట్ లను దక్కించుకుంటూ దూసుకెళ్తుంది. స్టార్ హీరోయిన్లకి మైండ్ బ్లాక్ చేస్తుంది. అంతేకాదు ఒకదెబ్బకి అరడజనుకుపైగా సినిమా ఆఫర్లని దక్కించుకుని జెట్ స్పీడ్‌లో ముందుకెళ్తుంది. స్టార్ హీరోయిన్లకి వణుకు పుట్టిస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాల లెక్క చూస్తే ఈ స్టార్ ముద్దుగుమ్మలకి మతిపోవాల్సిందే.
శ్రీలీలా ఇప్పటి వరకు నటించింది రెండే రెండు సినిమాలు. `పెళ్లిసందడి` మామూలుగా ఆడింది. కానీ రవితేజతో కలిసి నటించిన `ధమాఖా` గట్టిగానే ఆడింది. సినిమాలో మ్యాటర్ లేకపోయినా, శ్రీలీలా డాన్సులు, ఆమె స్క్రీన్ ప్రజెన్స్, రవితేజ మాస్ ఎలిమెంట్లు, కమర్షియల్ అంశాలు, పాటలు ఈ సినిమాని నిలబెట్టాయి. సింగిల్‌గా వచ్చి హిట్ కొట్టేసింది. సినిమా సక్సెస్‌లో శ్రీలీలా పాత్ర చాలా ఉందని చెప్పొచ్చు. ఈ సినిమాతో శ్రీలీలా లెక్క మారిపోయింది.
శ్రీలీలా ఇప్పుడు యువ సంచలనంగా మారింది. మతిపోయేలా అవకాశాలను దక్కించుకుంటూ జోరుమీదుంది. స్టార్లుగా రాణిస్తున్న హీరోయిన్ల అవకాశాలను తను కొల్లగొడుతూ, లేక సెకండ్ హీరోయిన్‌గా వారితోపాటే నటిస్తూ ఆ క్రెడిట్ మొత్తం తాను కొట్టేయబోతుంది. ప్రస్తుతంఈ బ్యూటీ చేతిలో ఎనిమిది సినిమాలున్నాయంటే అతిశయోక్తి కాదు. అందులో భాగంగా బాలయ్య- అనిల్ రావిపూడి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలయ్యకి కూతురు పాత్ర అని ప్రచారం జరుగుతుంది.
దీంతోపాటు మహేష్‌బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న `ఎస్‌ఎస్‌ఎంబీ28`లో పూజా హెగ్డే మెయిన్ ఫీమేల్ లీడ్‌గా చేస్తుండగా, సెకండ్ హీరోయిన్‌గా శ్రీలీలా ఎంపికయ్యింది. దీంతోపాటు నవీన్ పొలిశెట్టితో `అనగనగా ఓ రాజు`, బోయపాటి శ్రీను- రామ్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాలో, నితిన్32లో, పంజా వైష్ణవ్ తేజ్ కొత్త సినిమాలో, కన్నడ నటుడు కిరీటి `జూనియర్` సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది శ్రీలీలా. దీంతోపాటు పవన్-హరీష్ శంకర్ మూవీలోనూ సెకండ్ హీరోయిన్‌గా ఎంపికైందని సమాచారం. పూజా మెయిన్ హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ప్రధానంగా పూజా హెగ్డేకి డబుల్ స్ట్రోక్ ఇవ్వబోతుంది శ్రీలీలా. రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా చేస్తుంది. ఇప్పుడు ఆమెకి ఉన్న క్రేజ్ దృశ్యా అందరి దృష్టి శ్రీలీలా పైనే పడుతుంది. పైగా పూజా క్రమంగా కాస్త ఫామ్ కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది. గతేడాది ఆమెకి వరుసగా నాలుగు పరాజయాలు పడటంతో మునుపటి క్రేజ్ తగ్గిపోయింది. కొంత డౌన్ అయ్యింది. అది శ్రీలీలాకి ప్లస్ కాబోతుంది. ఇదే ఇప్పుడు బుట్టబొమ్మని షేక్ చేస్తుందట. పూజాని ఆడియెన్స్ ఆల్‌రెడీ చూసేశారు, కాబట్టి శ్రీలీలాపై ఫోకస్ ఉంటుంది. అది ఈ యంగ్ సెన్సేషన్‌కి ప్లస్ కాబోతుందని సోషల్ మీడియాలో జరుగుతున్న టాక్.
మరోవైపు రష్మిక మందన్నాకి కూడా శ్రీలీలా పెద్ద స్ట్రోకే ఇవ్వబోతుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో `పుష్ప2`, `యానిమల్` మూవీలే ప్రధానంగా ఉన్నాయి. రష్మికకి `పుష్ప` తర్వాత హిట్ పడలేదు. `సీతారామం`లో నటించినా, క్రెడిట్ ఆమెకి దక్కలేదు. మిగిలిన `ఆడవాళ్లు మీకు జోహార్లు`, బాలీవుడ్‌లో చేసిన `గుడ్‌బై`, `మిషన్ మజ్ను` చిత్రాలు పెద్దగా ఆదరణ పొందలేదు. దీంతో ఆమెకి గ్లామర్‌కి ఉన్న క్రేజ్ సినిమా ఆఫర్ల విషయంలో కనిపించడం లేదు. కొత్తగా ఇప్పటి వరకు రష్మిక మరే సినిమా ప్రకటించలేదు. ఈ అమ్మడికి అవకాశాలు రాకపోవడంతో శ్రీలీలా ఎఫెక్ట్ కూడా ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. యంగ్ హీరోలతో సినిమాలన్నీ శ్రీలీలా దక్కించుకోవడంతో రష్మిక వరకు రావడంలేదని నెట్టింట వినిపిస్తున్న టాక్.
మరోవైపు శ్రీలీలా ప్రభావం కృతి శెట్టిపై కూడా పడింది. `ఉప్పెన` చిత్రంతో ఉప్పెనలా దూసుకొచ్చింది కృతి శెట్టి. ఈ సినిమా విజయంతో వరుస అవకాశాలను దక్కించుకుంది. రామ్‌తో `ది వారియర్స్`, నితిన్‌తో `మాచర్ల నియోజకవర్గం`, నానితో `శ్యామ్ సింగరాయ్`, నాగచైతన్యతో `బంగార్రాజు`, సుధీర్‌బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` చిత్రాలు చేసింది. అందులో `బంగర్రాజు` ఫర్వాలేదు. `శ్యామ్ సింగరాయ్`లో ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదు. మిగిలిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి.
దీంతో ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఈ బ్యూటీ క్రేజ్ పడిపోయింది. ప్రస్తుతం నాగచైతన్యతో `కస్టడీ`లో నటిస్తుంది. మలయాళంలో ఓ సినిమా చేస్తుంది. కానీ ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. ఈ బ్యూటికీ రావాల్సినవి శ్రీలీలాతోపాటు ఇతర యంగ్ బ్యూటీస్ కొల్లగొడుతున్నట్టు టాక్. వీరేకాదు కీర్తిసురేష్, శృతిహాసన్, రాశీఖన్నా, తమన్నా, అనుపమా పరమేశ్వరన్ వంటి కథానాయికలకు కూడా శ్రీలీలా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎఫెక్ట్ చూపించబోతుందని టాక్.