MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • శ్రీలీల బ్యాడ్‌ లక్.. బిగ్ బ్లాక్‌ బస్టర్‌ మిస్‌ చేసుకున్న యంగ్‌ సెన్సేషన్‌.. చేస్తే కథ వేరే ఉండేది..

శ్రీలీల బ్యాడ్‌ లక్.. బిగ్ బ్లాక్‌ బస్టర్‌ మిస్‌ చేసుకున్న యంగ్‌ సెన్సేషన్‌.. చేస్తే కథ వేరే ఉండేది..

శ్రీలీల యంగ్‌ సెన్సేషన్‌గా మారింది. ఆమె రెండేళ్లపాటు టాలీవుడ్‌ని ఊపేసింది. కానీ ఒక్కసారిగా డౌన్‌ అయిపోయింది. వరుస పరాజయాలను ఫేస్‌ చేయడంలో ఈ బ్యూటీ కెరీర్‌ తలకిందులైంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 06 2024, 04:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Sreeleela

Sreeleela

శ్రీలీలకి `పెళ్లి సందడి` సినిమా లైఫ్‌ ఇచ్చింది. కె రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీకాంత్‌ కొడుకు రోషన్‌కి జోడీగా నటించింది శ్రీలీల. ఇందులో ఆమెచేసిన డాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి. బాడీలో ఈజ్‌ అందరిని ఆకర్షించింది. దీంతో వెంటనే మేకర్స్ ఈ అమ్మడిని హీరోయిన్లుగా తీసుకున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన `ధమాఖా` చిత్రంలో ఆయనకు జోడీగా చేసింది. ఈ చిత్రంలో మరోసారి డాన్సులతో రచ్చ చేసింది. సినిమా పెద్ద హిట్‌ కావడంతో శ్రీలీల క్రేజ్‌ మరింత పెరిగింది. ఈ సినిమా విజయంలో ఆమె డాన్సులు కీలక పాత్ర పోషించాయని అన్నారు. అప్పటికే శ్రీలీలకి ఆఫర్లు క్యూ కట్టాయి. దీనింతో ఆ తాకిడి మరింత పెరిగింది. 

37

ఆ తర్వాత వరుసగా ఆరేడు సినిమాలకు సైన్‌ చేసింది శ్రీలీల. `స్కంద`, `ఆదికేశవ`, `ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‌`, `భగవంత్‌ కేసరి`, `గుంటూరు కారం చిత్రాల్లో నటించింది. ఇందులో `భగవంత్‌ కేసరి`ఫర్వాలేదు. మిగిలిన మూవీస్‌ అన్నీ పరాజయం చెందాయి. దీంతోపాటు విజయ్‌ దేవరకొండ సినిమా నుంచి తప్పుకుంది. ఓ కన్నడ చిత్రం నుంచి కూడా ఆమె తప్పుకుంది. ఇలా తప్పుకున్న సినిమాల్లో పెద్ద బ్లాక్‌ బస్టర్‌ కూడా ఉండటం ఆశ్చర్యంగా మారింది. 

47
Tillu Square

Tillu Square

ఆ మూవీ ఏంటో కాదు, `టిల్లు స్వ్కేర్‌`. ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట శ్రీలీలని అనుకున్నారు. ఆమె ఆల్మోస్ట్ ఖరారు అయ్యింది. కానీ అనూహ్యంగా సినిమా నుంచి తప్పుకుంది. బోల్డ్ సీన్లు ఉండటం, లిప్‌ లాక్ సీన్లు ఉండటంతో సినిమా నుంచి ఆమె తప్పుకుందట. ఆ తర్వాత అనుపమా పరమేశ్వరన్‌ అనుకున్నారు. ఆమె కూడా తప్పుకుంది. మీనాక్షి చౌదరీ, మడోన్నా పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ వాళ్లు నో చెప్పారు. 
 

57
Sreeleela

Sreeleela

ఆ తర్వాత మళ్లీ అనుపమా పరమేశ్వరన్‌ వచ్చింది. ఆమె డేట్స్ అడ్జెస్ట్ కావడంతో తాను ఈ మూవీలోకి వచ్చినట్టు తెలిపింది అనుపమా. ఆమె ఖాతాలో పెద్ద హిట్‌ పడింది. అంతేకాదు నటిగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంది. కొత్త డోర్లు ఓపెన్‌ చేసుకుంది. కొత్త సినిమా అవకాశాలకు మార్గం ఈజీ అయ్యిందని చెప్పొచ్చు. ఇకపై అనుపమా రేంజ్‌ వేరే ఉండబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

67

ఈ సినిమా ఇప్పుడు వంద కోట్ల వరకు వెళ్తుంది. కానీ ఇంతటి పెద్ద బ్లాక్‌ బస్టర్‌ని మాత్రం శ్రీలీల మిస్‌ చేసుకుంది. ఈ సినిమా చేస్తే ఆమె లెక్క మారిపోయింది.మళ్లీ పుంజుకుని ఇండస్ట్రీని ఊపేసేది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ బ్యాడ్‌ లక్ అని చెప్పొచ్చు. 

77
Tillu Square Movie Review

Tillu Square Movie Review

ప్రస్తుతం శ్రీలీల పవన్‌ కళ్యాణ్‌తో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` సినిమాలో నటిస్తుంది. ఇది రావడానికి మరో ఏడాది పట్టే ఛాన్స్ ఉంది. మరోవైపు నితిన్‌తో కలిసి `రాబిన్‌హుడ్‌` చిత్రంలో నటిస్తుంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన చిత్రమిది. షూటింగ్‌ దశలో ఉంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved