హిందీ బెల్ట్ లో సౌత్ మూవీస్ హవా.. అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలివే!
South Cinema Rules Hindi Belt: బాహుబలి నుంచి పుష్ప 2, కల్కి 2898 ఏడి వరకు సౌత్ సినిమాలు హిందీ బెల్ట్ బాక్స్ ఆఫీస్‌ని ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రభాస్, అల్లు అర్జున్, యశ్, రాజమౌళి సృష్టించిన రికార్డులు బాలీవుడ్‌ను వెనక్కి నెడుతున్నాయి.

హిందీ బెల్డ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలివే!
South Cinema Rules Hindi Belt: గత దశాబ్దం నుంచి భారతీయ సినిమా రంగంలో ఓ విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంది. ఎన్నాళ్లుగానో బాలీవుడ్ తన గ్లామర్, స్టార్ పవర్, మాస్ అప్పీల్‌తో ఇండియన్ సినిమా మార్కెట్‌ను ఏకపక్షంగా ఆక్రమించింది. కానీ బాహుబలి సిరీస్ నుంచి బాలీవుడ్ లో దక్షిణాది సినిమాల హవా కొనసాగుతోంది. ఇప్పుడు హిందీ బెల్ట్ బాక్స్ ఆఫీస్‌లో సౌత్ ఇండియా సినిమాలు కొత్త రికార్డు క్రియేట్ చేశాయి. భారతీయ సినీ చరిత్రను మార్చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. హిందీ బెల్ట్ లో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాలివే.
బాహుబలి: ది బిగినింగ్
2015లో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తీసిన బాహుబలి: ది బిగినింగ్ భారతీయ సినిమా చరిత్రనే మార్చేసింది. ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో ఇది గేమ్ ఛేంజర్ అయ్యింది. బాహుబలి 1 మొదటిసారి హిందీలో డబ్బింగ్ చేయబడి ₹100 కోట్ల మార్క్‌ను దాటిన దక్షిణాది సినిమాగా నిలిచింది. విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ కథనానికి ఉత్తరాది ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యింది.
బాహుబలి 2: ది కన్క్లూజన్
2017లో విడుదలైన బాహుబలి 2: ది కన్ క్లూజన్ ఇండియన్ సినిమా చరిత్రనే తిరగరాసింది. “కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు?” అనే ప్రశ్న దేశవ్యాప్తంగా హైప్ సృష్టించింది. ఈ చిత్రం మొత్తం రూ. 1030.42 కోట్లు వసూలు చేసి, భారతీయ సినిమాల్లో మొదటిసారి ₹1000 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా హిందీ బెల్ట్‌లోనే ఏకంగా రూ. 510.99 కోట్లు వసూలు చేసింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా లాంటి నటీనటుల పాత్రలు పాన్-ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించగా, రాజమౌళి సృజనాత్మకత, వీఎఫ్‌ఎక్స్ మాజిక్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
కేజీఎఫ్ (KGF)
స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 కన్నడ సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా తీసుకెళ్లింది. ఈ సినిమా రూ. 859.7 కోట్లు వసూలు చేసింది. హిందీ వెర్షన్ రూ. 435. 33 కోట్లు వసూళ్లు చేసింది. కేజీఎఫ్ మూవీ కన్నడ సినిమా స్థాయిని ఒక్కసారిగా పెంచేసింది.
ఆర్ఆర్ఆర్ (RRR)
RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్ (RRR). 2022 మార్చి 25న గ్రాండ్‌గా రిలీజైన ఈ ఫిక్షనల్ థ్రిల్లర్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ల కాంబో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమా మొత్తం రూ. 782.2 కోట్లు వసూళ్లు చేయగా , అందులో హిందీ వెర్షన్ రూ. 272 కోట్లు వసూళ్లు చేసి రికార్డు క్రియేట్ చేసింది.
పుష్ప: ది రైజ్' ( Pushpa 1)
'పుష్ప: ది రైజ్' ( Pushpa 1) సినిమాను సుమారు ₹150 కోట్లతో నిర్మించారు. ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ. 400 కోట్లు వసూలు చేసింది, అందులో హిందీ వెర్షన్ మాత్రం రూ.100 కోట్లు దాటింది. ఈ సక్సెస్ తో అల్లు అర్జున్ హిందీలో తనకంటూ ప్రత్యేక మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు.
పుష్ప 2 : ది రూల్
పుష్ప 1 సక్సెస్ కావడంతో పుష్ప 2 : ది రూల్ పై భారీ అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగినట్టుగానే మూవీ రూపొందించారు. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా ఇండియన్ హిస్టరీనే తిరగరాసింది. దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా వర్డల్ వైడ్ గా రూ. 1234.1 కోట్లు వసూలు చేసింది. అందులో హిందీ మార్కెట్ వసూళ్లు ₹812.1 కోట్లు. ఈ వసూళ్లను బట్టి పుష్ప 2 ఎలాంటి సక్సెస్ అందుకుందో అర్థమవుతుంది. ఈ స్థాయిలో హిందీ బెల్ట్ నుంచి వసూళ్లు రావడం, తెలుగు సినిమాల పవర్ ఏంటో నిరూపిస్తుంది.
కల్కి 2898 ఏడి
పురాణాలను భవిష్యత్‌ను కలుపుతూ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ రూపొందించిన సినిమా కల్కి 2898 ఏడి. గత ఏడాది రూ. 600 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడింది. ఈ చిత్రం 2024, జూన్ 27న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 1050 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. అందులో ఈ సినిమా హిందీలో రూ. 293.13 కోట్లు వసూళ్లు చేసింది. ప్రభాస్ పాపులారిటీతో పాటు నాగ్ అశ్విన్ విజన్ కు బాలీవుడ్ కు ఫిదా అయ్యింది.