MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: ఇంద్రుడు వాళ్ళపై అనుమాన పడుతున్న శౌర్య.. కార్తీక్ నిజస్వరూపం తెలుసుకున్న దీప?

Karthika Deepam: ఇంద్రుడు వాళ్ళపై అనుమాన పడుతున్న శౌర్య.. కార్తీక్ నిజస్వరూపం తెలుసుకున్న దీప?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు డిసెంబర్ 22వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Dec 22 2022, 08:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో దీప ప్రతిసారి ఇలాగే దొరికినట్టె దొరికి తప్పించుకుంటున్నాడు డాక్టర్ బాబు ఇలా అయితే మన సౌర్య ఎప్పటికీ దొరకుతుంది అని బాధపడుతూ మాట్లాడుతుంది. అప్పుడు దొరుకుతుంది దీప అన్ని రోజులు వాడివి కాదు కదా నేను వెతికి పట్టుకుంటాను నువ్వు ఇంటికి వెళ్ళు నేను హాస్పిటల్ కి వెళ్తాను నాకు చిన్న పని ఉంది అని అంటాడు కార్తీక్. మరొకవైపు ఇంద్రుడు హోటల్ దగ్గరికి వెళ్తాడు. ఈసారి కూడా ఎలాగో అలా దీపమ్మకు కనిపించకుండా తప్పించుకున్నాం అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే కార్తీక్ అక్కడికి రావడంతో దీపమ్మ వెళ్ళిపోయిందా సార్ అనడంతో వెళ్లిపోయింది అని అంటాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇలా ఎన్ని రోజులు తప్పించుకుని తిరగాలి సార్ అనడంతో నా సమస్యకు పరిష్కారం దొరికేంతవరకు అని అంటాడు కార్తీక్. అప్పుడు కార్తీక్ జరిగింది మొత్తం ఇంద్రుడికి చెప్పి ఈ పరిస్థితుల్లో నా భార్యను నా తల్లిదండ్రులకు నా కూతురికి చూపించలేను అని అంటాడు. అప్పుడు కార్తీక్ సరే నాకు కొంచెం పని ఉంది రేపు ఇదే సమయానికి ఇక్కడికే రా మళ్లీ కలుద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు సౌందర్య జరిగిన విషయాలు తలుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే ఆనందరావు అక్కడికి వస్తాడు. సౌర్యని అక్కడే వదిలేసి వచ్చావు కదా ఇంకా ఏమి ఆలోచిస్తున్నావు అనడంతో వదిలి వచ్చాను కానీ అక్కడి మనుషుల మీద చాలా అనుమానాలు వస్తున్నాయి అని అంటుంది సౌందర్య. అప్పుడు జరిగిన విషయాలు మొత్తం ఆనందరావుకి చెబుతూ ఉంటుంది సౌందర్య. మరొకవైపు దీప ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది.

36

 జరిగిన విషయాల గురించి బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి పండరి వస్తుంది. రేపు ఉదయాన్నే నీకేమైనా పని ఉందా పండరి అనడంతో చెప్పండి దీపమ్మ అనగా ఈరోజు ఉదయం ఇంద్రుడు కనిపించాడు. నేను డాక్టర్ బాబు పట్టుకుందాం అనుకునే లోపు తప్పించుకుని వెళ్ళిపోయాడు అని అంటుంది. అప్పుడు పండరీ తన మనసులో నువ్వేమో నీ బిడ్డ కోసం ఆరాటపడుతున్నావ్ కానీ కార్తీక్ సార్ మాత్రం నిన్ను నీ బిడ్డను కలపకూడదని ప్రయత్నాలు చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు పండగ ఏం చెప్పాలో తెలియక నాకు రేపు ఇంటి పనితో పాటు బయట పని కూడా ఉంది దీపమ్మ అని అబద్ధాలు చెబుతుంది. సార్ తో పాటు బయటకు వెళ్లి వెతకండి అని అనగా ఇలా చెప్పడానికి నాకు ఎలాగో ఉంది నా కూతుర్ని వెతకడం డాక్టర్ బాబుకి ఇష్టం లేదని నాకు అనిపిస్తుంది అని అంటుంది దీప.

46

ఏదైనా అడిగితే ఆరోగ్యం బాగోలేదని అంటున్నారు అని బాధపడుతూ మాట్లాడుతుంది దీప. ఇంతలోనే అక్కడికి చారుశీల కార్తీక్ ఇద్దరు వస్తారు. అప్పుడు కార్తీక్, దీపకి ఇంజక్షన్ చేయాలి అనడంతో మొన్నటి వరకు మాత్రలు అన్నారు ఇప్పుడు మళ్ళీ ఇంజక్షన్లా అని అంటుంది. అప్పుడు కార్తీక్ నిజం దీప నీకు ఎటువంటి ప్రమాదం లేదు ఆపరేషన్ చేసాం కదా అందుకే ఇవన్నీ వాడుతున్నాము అని అంటాడు. అప్పుడు చారుశీల కూడా అబద్ధాలు చెబుతుంది. ఇప్పుడు దీప కార్తీక్ మీద సీరియస్ అవుతూ మీ ప్రవర్తన మీద నాకు అనుమానంగా ఉంది డాక్టర్ బాబు శౌర్య కోసం వెతుకుదాము అంటే ఏదో ఒక రకంగా అడ్డుపడుతున్నారు వద్దని చెబుతున్నారు అని అంటుంది. అప్పుడు కార్తీక్ నీకు హెల్త్ బాగోలేదు కదా నేను వెతుకుతాను అని అంటాడు.

56

కళ్ళ ముందు బిడ్డ కనిపిస్తున్న కూడా ఎటువంటి చలనం లేకుండా ఉన్నారు అంటే ఏమనుకోవాలి డాక్టర్ బాబు అని అంటుంది దీప. అప్పుడు సౌర్య విషయంలో దీప కన్నీళ్లు పెట్టుకుంటూ కార్తీక్ ని నిలదీస్తుంది. అప్పుడు కార్తీక్ దీప ఇద్దరు వాదించుకుంటూ చారుశీల ఆనంద పడుతూ ఉంటుంది. అప్పుడు ఇప్పటికిప్పుడు నన్ను హైదరాబాద్ కి తీసుకెళ్లాలి అని పట్టుబడుతుంది. అప్పుడు కార్తీక్ చారుశీల ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెళ్లాల్సిందే అని అంటుంది దీప. అప్పుడు దీప బాధతో కుమిలిపోతూ ఉండగా ఇలా నీ కుటుంబం మొత్తాన్ని విడదీసి నిన్ను దూరం చేస్తాను దీపా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు శౌర్య నిద్రలో ఉలిక్కిపడి లేచి దీప గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు సౌర్య బాధ చూసి చంద్రమ్మ ఇంద్రుడు కంగారు పడుతూ ఉంటారు.
 

66

అప్పుడు సౌర్య నా దగ్గర మీదేదో దాస్తున్నారని నాకు అనుమానంగా ఉంది అని అంటుంది. ఇప్పుడు అబద్ధాలు చెప్పి సౌర్యకి నచ్చ చెబుతారు. మరొకవైపు దీప ఆటోలో ప్రయాణిస్తూ ఇంద్రుడు వాళ్ల గురించి తలుచుకొని ఆలోచిస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరొకవైపు కార్తీక్ ఇంద్రుడు హోటల్లో కలిసి జ్వాలకి కొన్ని టెస్టులు చేయించమని ఇంద్రుడికి చెబుతాడు. ఇంతలోనే కార్తీక్ వాళ్ళు ఉన్న హోటల్ దగ్గరికి దీప వస్తుంది. అప్పుడు కార్తీక్ ఇంద్రుడికి డబ్బులు ఇస్తూ ఉండగా అది చూసి దీప షాక్ అవుతుంది. అప్పుడు దీప ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: హేట్‌ చేయోద్దు, అమ్మాయి ఇంటి ముందు కూర్చొని ఎంజాయ్‌ చేయండి.. అభిమానులకు అల్లు అర్జున్‌ సందేశం
Recommended image2
150 కోట్ల హీరో, 40 కోట్ల హీరోయిన్, ఆ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?
Recommended image3
Toxic: హాలీవుడ్‌లో టాక్సిక్ మంత్రం.. యశ్ మాటలకు ఫారెన్ మీడియా ఫిదా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved