- Home
- Entertainment
- Soundarya: ఇండస్ట్రీలో సౌందర్య అన్నయ్య అని పిలిచే ఏకైక హీరో ఎవరో తెలుసా? అంతనంటే ఎందుకంత అభిమానం..
Soundarya: ఇండస్ట్రీలో సౌందర్య అన్నయ్య అని పిలిచే ఏకైక హీరో ఎవరో తెలుసా? అంతనంటే ఎందుకంత అభిమానం..
Soundarya: ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది సౌందర్య. అయితే అంత మంది హీరోలలో ఆమె అన్నయ్య అని ప్రేమగా పిలుచుకునే నటుడు ఎవరో తెలుసా?

సౌందర్య అన్నయ్యా అని పిలిచే ఏకైక హీరో?
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య పరిచయాలు, స్నేహాలు సహజం. అయితే కొందరి మధ్య ఏర్పడే అనుబంధం సినిమాలకే పరిమితం అవ్వకుండా కుటుంబ బంధంలా మారుతుంది. అలాంటి అనుబంధమే దివంగత నటి సౌందర్యతో ఓ హీరోకు ఉండేది. ఆయన ఎవరో కాదు సీనియర్ నటుడు సురేష్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సౌందర్య తో ఆమె ఫ్యామిలీతో తనకు ఉన్నఅనుబంధాన్ని సురేష్ గుర్తు చేసుకున్నారు.
సౌందర్యతో పరిచయం ఎలా ?
సౌందర్య తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి. అద్భుతమైన నటనతో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో భాగమయ్యారు. ఆమెతో కలిసి సినిమాలు చేసిన అనుభవం తనకు ప్రత్యేకమని నటుడు సురేష్ గుర్తుచేసుకున్నారు. తాను అప్పట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తున్న సమయంలోనే సౌందర్య స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు.
ఇద్దరి వయసులో పెద్దగా తేడా లేకపోవడంతో పరిచయం త్వరగానే స్నేహంగా మారిందని వివరించారు.సౌందర్య ఎప్పుడూ సురేష్ ను అన్నయ్య అని పిలిచేవారట. ఇద్దరి మధ్య చనువు పెరిగిన తర్వాత తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారట. వ్యక్తిగత విషయాలు, సందేహాలు కూడా ఒకరితో ఒకరు షేర్ చేసుకునేవారట. తమ బంధం కేవలం సినిమా షూటింగులకే పరిమితం కాలేదని, కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉండేవాళ్లమని సురేష్ గుర్తుచేసుకున్నారు.
సౌందర్య కుటుంబంతో ప్రత్యేక అనుబంధం
సౌందర్య సోదరుడు అమర్నాథ్తో తనకు ముందుగానే పరిచయం ఉందని సురేష్ వెల్లడించారు. ఆయనతో మంచి స్నేహం ఉండటంతో సౌందర్య కుటుంబానికి మరింత దగ్గరయ్యానని అన్నారు. ముఖ్యంగా తమిళ సినిమా షూటింగుల కోసం వెళ్లినప్పుడు వారి ఇంట్లోనే సురేష్ ఉండేవారట.
సౌందర్య స్టార్ హీరోయిన్ అయినప్పటికీ, ఆమెతో తనకున్న స్నేహంలో ఎలాంటి దూరం ఉండేది కాదట. సురేష్ పెళ్లికి కూడా సౌందర్య తన్ ఫ్యామిలీతో సహా వెళ్లారట. ఇక ఆయన భార్యతో కూడా సౌందర్య ఎంతో ఆప్యాయంగా ఉండేవారని సురేష్ చెప్పారు. సినిమా కార్యక్రమాలకు వెళ్లినప్పుడు ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకునేవారని వివరించారు. తన వివాహానికి సౌందర్య స్వయంగా హాజరుకావడం ఇప్పటికీ మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయిందని అన్నారు.
సౌందర్య భర్తతోనూ స్నేహం
సౌందర్య భర్తతో తనకు ఏర్పడిన పరిచయం గురించి కూడా సురేష్ మాట్లాడారు. మొదటిసారి కలిసినప్పుడు ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని సౌందర్య పరిచయం చేశారట. ఆ తర్వాత ఆయన కూడా షూటింగ్ సెట్‌కు రావడంతో పరిచయం మరింత పెరిగి స్నేహంగా మారిందని తెలిపారు. తమ కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉండేదని చెప్పారు.
సౌందర్యతో కలిసి పలు సినిమాల్లో నటించిన సురేష్, ఆమెతో గడిపిన రోజులను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. తమ మధ్య ఎప్పుడూ అపార్థాలు లేదా చెడు అభిప్రాయాలు రాలేదని ఆయన స్పష్టం చేశారు. తెరపై హీరో హీరోయిన్లుగా నటించినా.. నిజ జీవితంలో మాత్రం తమది అన్నాచెల్లెళ్ల బంధం అని ఆయన అన్నారు.





