- Home
- Entertainment
- AK 47 3 Days Collections: ఆదివారం ఆదర్శ కుటుంబం ఊహించని జంప్.. వెంకటేష్ మూవీ 3 రోజుల కలెక్షన్లు
AK 47 3 Days Collections: ఆదివారం ఆదర్శ కుటుంబం ఊహించని జంప్.. వెంకటేష్ మూవీ 3 రోజుల కలెక్షన్లు
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన `ఆదర్శ కుటుంబం` మూవీ బాక్సాఫీసు స్టడీగా రన్ అవుతుంది. అయితే ఆదివారం ఈ సినిమా వసూల్లు అనూహ్యంగా పెరిగాయి.

బాక్సాఫీసు వద్ద డీసెంట్‌గా వెంకటేష్ ఆదర్శ కుటుంబం
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం `ఆదర్శ కుటుంబం ఏకే 47`. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో నారా రోహిత్, నివేతా పేతురాజ్, రావు రమేష్, బ్రహ్మాజీ, సత్య వంటి వారు కీలక పాత్రలు పోషించారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ(చినబాబు) నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 30న విడుదలైంది. ఇది ఫన్, ఫ్యామిలీ, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. మొదటిసారి త్రివిక్రమ్ రూట్ మార్చి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యాక్షన్ వేరే లెవల్ లో ఉంటుంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. అదే సమయంలో కొంత మిక్స్ డ్ రియాక్షన్ కూడా వినిపించింది. బాక్సాఫీసు వద్ద డీసెంట్‌గా రన్ అవుతుంది.
ఆదర్శ కుటుంబం ఏకే 47 మూవీ కలెక్షన్లు
ఈ క్రమంలో `ఆదర్శ కుటుంబం` మూవీ బాక్సాఫీసు వద్ద ఎలా పర్‌ఫెర్మ్ చేస్తుందనేది చూస్తే, మొదటి రోజు డల్ ఓపెనింగ్‌ని తీసుకుంది. ఈ చిత్రానికి ఇండియాలో రూ.11.40కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. రెండో రోజు రూ.12.20కోట్లు రాబట్టింది. ఇక మూడో రోజు ఆదివారం మరింతగా పెరిగింది. ఏకంగా రూ.13.25కోట్లు వసూలు చేయడం విశేషం. టోటల్‌గా మూడో రోజు ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.16కోట్లు వచ్చాయి. మూడు రోజుల్లో ఆదివారం హైయ్యెస్ట్ ని రాబట్టింది. మొత్తంగా మూడు రోజుల్లో ఈ చిత్రానికి రూ.50.90కోట్లు వచ్చాయి. మరి ఇదే స్థాయిలో స్ట్రాంగ్‌గా ఉంటుందా, సోమవారం నుంచి పడిపోతుందా అనేది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా సోమవారం నుంచి వసూళ్ల డ్రాప్ ఉంటుంది. ఈ సినిమా పరిస్థితి ఏంటనేది చూడాలి.
ఆదర్శ కుటుంబం మూవీ బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్
ఈ సినిమాకి రూ.70కోట్లకుపైగానే బడ్జెట్ అయ్యిందట. థియేట్రికల్ బిజినెస్ రూ.63కోట్లు అని సమాచారం. నైజాంలో రూ.17కోట్లు, సీడెడ్‌లో ఏడు కోట్లు, ఆంధ్రాలో రూ.20కోట్ల వ్యాపారం జరిగిందట. ఏపీ, తెలంగాణలో కలిపి రూ.44కోట్లు, ఇతర స్టేట్స్ అన్నీ కలిపి రూ.6కోట్లు, ఓవర్సీస్‌లో రూ.13కోట్ల బిజినెస్ జరిగిందని సమాచారం. సినిమా హిట్ కావాలంటే దాదాపు రూ.130కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావాలి. ఇప్పటి వరకు ఈ మూవీకి 45శాతం కలెక్షన్లు వచ్చాయి. ఇంకా బాగానే రాబట్టాల్సి ఉంది.మరి టార్గెట్‌ని రీచ్ అవుతుందా లేదా అనేదిచూడాలి. దీపావళి సెలవులు మూవీకి కలిసి వచ్చే అవకాశం ఉంది.





