MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `అమ్మోరు` సినిమాని సౌందర్య ఎవరికి డెడ్‌కేట్‌ చేసిందో తెలుసా?.. అరుదైన విషయాలు చెప్పిన అద్భుత నటి..

`అమ్మోరు` సినిమాని సౌందర్య ఎవరికి డెడ్‌కేట్‌ చేసిందో తెలుసా?.. అరుదైన విషయాలు చెప్పిన అద్భుత నటి..

సౌందర్య అద్బుతమైన నటిగా ఆకట్టుకుంది. ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకి మాత్రం `అమ్మోరు` మాత్రం చాలాస్పెషల్‌ అట. ఆ విషయాలను పంచుకుంది. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Apr 02 2024, 12:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సౌందర్య మన నుంచి దూరమై 20ఏళ్లు అవుతుంది. కానీ ఆమె మాత్రం ఇప్పటికీ మన మధ్యలోనే ఉందనే ఫీలింగ్‌ని కలిగిస్తుంది. ఆమె సంబంధించిన సినిమాలు కావచ్చు, ఆమె వీడియోలు కావచ్చు, ఆమెకి సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదో రూపంలో కనిపిస్తూ, వినిపిస్తూ, అలరిస్తూనే ఉంది. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సౌందర్య కర్నాటక చెందిన నటి. కానీ ఆమె తెలుగులో ఎక్కువ సినిమా చేయడం వల్ల తెలుగు నటిగానే గుర్తిండిపోతుంది. అయితే ఆమె కన్నడలో హీరోయిన్‌గా కెరీర్‌ ని ప్రారంభించింది. కొన్ని సినిమాల అనంతరం తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగుకి కమిట్‌ అయిన తొలి చిత్రం `అమ్మోరు`. మొదట ఈ మూవీ షూటింగ్‌లోనే పాల్గొంది. అందుకే ఈ సినిమాని చాలా స్పెషల్‌ గా భావిస్తుంది 
 

36

ఈ సినిమా గురించి సౌందర్య ఓపెన్‌ అయ్యింది. ఆరుదైన విషయాలను పంచుకుంది. `అమ్మోరు` లాంటి మూవీ తన కెరీర్‌ ప్రారంభంలో దొరికినందుకు చాలా ఆనందంగా, లక్కీగా భావిస్తున్నట్టు చెప్పింది సౌందర్య. అలాంటి గొప్ప పాత్ర దొరికినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. నేను కూడా నటించగలనని నిరూపించినందుకు, ఆడియెన్స్ కి చూపించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది సౌందర్య. 
 

46

`అమ్మోరు` సినిమా విడుదలైన తర్వాతనే తనకు పర్ఫెర్మెన్స్ ఓరియెంటెడ్‌ రోల్స్ రావడం ప్రారంభమైనట్టు తెలిపింది సౌందర్య. నటిగా తనకు కాస్తో, కూస్తో వచ్చిందే ఈ సినిమాతో అని, నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డికి థ్యాంక్స్ చెప్పుకోవాలని, ఎందుకంటే ఈ సినిమాని నేను మా నాన్నకి అంకితం చేస్తాను. అలాంటి గొప్ప సినిమాని నాకు అందించిన నిర్మాతకు రుణపడి ఉంటాను అని వెల్లడించింది సౌందర్య. ఓ ఇంటర్వ్యూలో సౌందర్య ఈ విషయాను పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. 
 

56

సౌందర్య తెలుగులో అనేక సినిమా చేసింది. కానీ ఆమె మొదటి మూవీ `అమ్మోరు` ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఫీమేర్‌ ఓరియెంటెడ్‌ రోల్‌లో అద్భుతమైన నటనతో మెప్పించింది. ఇందులో ఆమెకి జోడీగా సురేష్‌ నటించడం విశేషం. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సౌందర్య, సురేష్‌లతోపాటు రమ్యకృష్ణ, రామిరెడ్డి కీలకపాత్రలు పోషించారు. 1995లో ఈ మూవీ విడుదలైంది.
 

66

సహజ నటిగా, సహజమైన అందంతో మెప్పించే సౌందర్య అద్భుతమైన నటనతో తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యింది. దశాబ్దం పాటు తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. సౌందర్య.. 2004లో ఎన్నికల ప్రచారం చేస్తూ వస్తూ విమాన ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ ఘటన దేశాన్ని కదిలించింది. సౌందర్య లాంటి స్టార్‌ హీరోయిన్‌ మరణించడంతో అభిమానులు భోరున విలపించారు. ఆ తర్వాత ఆమె ఆస్తి కోసం చాలా గొడవలు జరిగాయి. ఆమె ఓ సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Jason Sanjay: నాన్నని హాలీవుడ్ కి తీసుకెళతా, సీఎం కొడుకులా భావించకండి.. దళపతి విజయ్ కొడుకు జేసన్ కామెంట్స్
Recommended image2
August Movies: ఆగష్టు రిలీజ్‌లు, డేంజర్ జోన్ లో ఉన్న హీరోలు ఇద్దరే.. దారుణమైన ఫ్లాపులకు బ్రేకులు పడతాయా ?
Recommended image3
Chennai Love Story 8 Days Collections: బాక్సాఫీసు వద్ద చెన్నై లవ్‌ స్టోరీ డ్రాప్‌.. కిరణ్‌ సినిమా ఎంత రాబట్టిందంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved