- Home
- Entertainment
- Karthika Deepam: హేమచంద్ర ఇంటికి వెళ్లిన సౌందర్య.. కుటుంబాన్ని చూసి కుమిలిపోతున్న కార్తీక్ దీప?
Karthika Deepam: హేమచంద్ర ఇంటికి వెళ్లిన సౌందర్య.. కుటుంబాన్ని చూసి కుమిలిపోతున్న కార్తీక్ దీప?
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు డిసెంబర్ 30వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్లో కార్తీక్ నువ్వు ప్రతిరోజు డాక్టర్ బాబు డాక్టర్ బాబు అని పిలుస్తూనే ఉంటావు నేను డాక్టర్ అన్న సంగతి మర్చిపోయావా అని అనగా మరి నాకు ఈ టెస్ట్ లు చూడండి ఎందుకు చేయిస్తున్నారు డాక్టర్ బాబు నేను ఈ పొద్దు రేపు చనిపోయే మాదిరిగా ఇలా టెస్టులన్ని చేపిస్తున్నారు అనడంతో దీప అని అరవగా మాట వరసకు అన్నానులే డాక్టర్ బాబు అని అంటుంది దీప. సరదాగా కూడా అలా మాట్లాడకు దీప నీకేమైనా అయితే కార్తీక్ తట్టుకోలేడు. ఈ టెస్టులన్ని నేను చేయించమని చెప్పాను మొన్న కూడా స్ట్రోక్ వచ్చింది కదా అని అంటుంది. అప్పుడు కార్తీక్ విన్నావు కదా అనడంతో మీ ఇద్దరిని చూస్తే నా కోసమే పుట్టారేమో అనిపిస్తుంది అని అంటుంది దీప. అప్పుడు చారుశీల నేను అనుకున్న పని ఇంత తొందరగా వర్క్ అవుట్ అవుతుందని అనుకోలేదు ఈ భార్యాభర్తలు ఇద్దరు నన్ను పిచ్చిపిచ్చిగా నమ్మేస్తున్నారు నాకు కూడా అదే కావాల్సింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది.
ఆ తర్వాత మళ్లీ ఇంకొక స్కానింగ్ ఉంది అని చెప్పి చారుశీల అక్కడి నుంచి దీపని పిలుచుకొని వెళ్తుంది. మరొకవైపు సౌందర్య హిమ కోసం వెతుకుతూ ఉండగా ఇంతలో సౌర్య కనిపించడంతో హిమ ఎక్కడ సౌర్య అని అడగగా దాని గురించి నన్ను ఎందుకు అడుగుతావు నానమ్మ అని అంటుంది. ఇన్ని రోజులు ఏది చెప్పానో మళ్ళీ అదే మొదలు పెట్టావు నానమ్మ మీరు ఇక్కడికి వచ్చారని నీ మీద ఉన్న గౌరవంతో ఇక్కడికి వచ్చాను ఇక్కడ మళ్ళీ అదే మొదలు పెడుతున్నావు ఈసారి ఇలాగే మాట్లాడితే ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని అంటుంది శౌర్య. ఇంతలోనే హిమ అక్కడికి రావడంతో ఎక్కడికి వెళ్లావు హిమ అనగా అమ్మానాన్నల కోసం వెతకడానికి వెళ్లాను. ఫోటో చూపించి ఎవరిని అడిగినా చూడలేదనే చెబుతున్నారు అని అంటుంది హిమ. అప్పుడు హిమ తప్పుబడుతూ సౌర్య వెటకారంగా మాట్లాడడంతో సౌందర్య సీరియస్ అవుతుంది.
అప్పుడు సౌందర్య ఎంత చెప్పినా కూడా శౌర్య మాత్రం అమ్మ నాన్నలు దూరం అవ్వడానికి ఇదే కారణం అన్నట్టు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు సౌందర్య నువ్వు దాని గురించి ఏం పట్టించుకోకు హిమ ఎలా అయినా నీతో మాట్లాడుతుంది నువ్వు ఏడవకు అని ధైర్యం చెబుతుంది సౌందర్య. మరొకవైపు చారుశీల దీపకు స్కానింగ్ చేయించి అక్కడికి పిలుచుకుని వస్తుంది. అప్పుడు చారుశీల కార్తిక్ కి జాగ్రత్తలు చెబుతూ ఉండగా అప్పుడు దీప ఇద్దరు డాక్టర్లు నాకు ఏమీ లేదు అని చెప్పడానికి ఎంత ప్రయత్నిస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు చారుశీల ఒకసారి మందులు చెక్ చెయ్ కార్తీక్ అనడంతో నువ్వు చూసావు కదా చారుశీల అని అనగా వెంటనే మనసులో నువ్వు చూడవు కార్తీక్ ఒకవేళ చూసినా అందులో అన్ని కరెక్ట్ మందులె ఉంటాయి.
తేడా మందులు అన్నీ పండరితో ఇప్పిస్తున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు దీప ఈ మా టాబ్లెట్స్ ఎలా వాడాలో చెప్పాను కదా అదే విధంగా కరెక్ట్ గా వాడు అని అంటుంది పండరి. అప్పుడు దీప తనకు నిజం తెలియనట్టుగా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ బాబు ప్రాణం పోయేది మీకే కదా అని అనడంతో కార్తీక్ మరిన్ని అబద్ధాలు చెబుతూ దీపను నమ్మించడానికి ప్రయత్నిస్తాడు. ఏంటి దీప ఇలా మాట్లాడుతోంది ఆరోజు మేము మాట్లాడుకున్నది వినలేదా అని చారుశీల మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు నేను మాత్రమే కాదు డాక్టర్ బాబు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి చారుశీల నువ్వైనా చెప్పు అని అంటుంది దీప. ఆ తర్వాత దీప కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరొకవైపు హేమచంద్ర ఇంటికి సౌందర్య వస్తుంది. చెప్పండి అనడంతో మీరు డాక్టర్ అంట కదా బాబు అనగా అవును అని అంటాడు హేమచంద్ర.
అప్పుడు సౌందర్య కార్తీక దీపల గురించి చెబుతుండడంతో హేమచంద్రకు అనుమానం వస్తుంది. అప్పుడు సౌందర్య తన ఫోన్లో కార్తీక్, దీపల ఫోటో చూపించడంతో హేమచంద్ర షాక్ అవుతాడు. నా అనుమానమే నిజమైంది కార్తీక్ వాళ్ళ అమ్మానాన్నలు వీళ్ళే అని అనుకుంటూ ఉండగా ఎక్కడైనా చూసావా బాబు అనడంతో లేదు అని హేమచంద్ర అబద్ధం చెబుతాడు. అప్పుడు సౌందర్య బాధతో మాట్లాడడంతో హేమచంద్ర ఆలోచనలో పడతాడు. అప్పుడు సౌందర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా కూర్చోండి కాఫీ చేసి ఇస్తాను అని అంటాడు హేమచంద్ర. ఇప్పుడు దీప అన్నయ్య నేను డాక్టర్ బాబు ఇద్దరూ మీ ఇంటికి వస్తున్నాము 10 నిమిషాల్లో అక్కడ ఉంటాము అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. 10 నిమిషాల్లో వస్తున్నారు అని చెప్పారు మరి ఎలా చేయాలి అనుకుంటూ ఉండగా అప్పుడు సౌందర్య కాఫీ తీసుకుని రావడానికి వెళ్తుంది.
అప్పుడు హేమచంద్ర ఏమి కాదులే తల్లి కొడుకులే కదా కలిసేది ధైర్యంగా ఉంటే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు కార్తీక్ దీప అక్కడికి రావడంతో అప్పుడు ఇంద్రుడు ఏంటి ఇక్కడికి వచ్చారు మీ అమ్మ నాన్నలు తీసుకున్న ఇల్లు ఇదే ఇకనుంచి తొందరగా వెళ్ళిపోండి పిల్లలు బయటకు వస్తారేమో అనడంతో లేదులే ఇంద్రుడు మేము మా అన్నయ్య ఇంట్లోకి వెళ్లిపోతాము అని అక్కడికి వెళ్ళగా అప్పుడు హేమచంద్ర అక్కడికి వచ్చి వచ్చారా దేవుడు ఎక్కడ ఎప్పుడు ఎవరిని కలపాలో అలా కలుపుతాడు అనడంతో ఏం మాట్లాడుతున్నావ్ అన్నయ్య అని దీప అడగడంతో మీ అత్తయ్య కార్తీక్ వాళ్ళ అమ్మ అని అంటుండగా ఎదురింట్లో ఉన్నారని మాకు తెలుసు నువ్వు అలాంటి పిచ్చి వేషాలు ఏమి వేయకు అని కార్తీక్ అనడంతో ఎదురింట్లో కాదు కార్తీక్ మా ఇంట్లోనే ఉంది మీ అమ్మ అని అనగా కార్తీక్, దీప షాక్ అవుతారు.
అప్పుడు హేమచంద్ర వారికి నచ్చజెప్పి ఇప్పటికైనా కలిసిపోండి కార్తీక్ అనడంతో కార్తీక్ హేమచంద్ర పై సీరియస్ అవుతాడు. వాళ్ళని దూరం పెడుతూ మీరు మిమ్మల్ని దూరం చేసుకుని వాళ్ళు చాలా బాధపడుతున్నారు అని అంటాడు హేమచంద్ర. అప్పుడు ఏం మాట్లాడుతున్నావ్ అన్నయ్య నీకు మొత్తం చెప్పాను కదా మళ్లీ ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటి పద డాక్టర్ బాబు అని వెళుతుండగా ఇంతలో ఇంద్రుడు అక్కడికి వచ్చి పిల్లలు బయటే ఉన్నారు ఇప్పుడు అక్కడికి రావద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో కార్తీక్, దీప ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు సౌందర్య బాబు కాఫీ రెడీ తీసుకొస్తున్న అని బయటకు తీసుకురావడంతో కార్తీక్ దీప ఇద్దరు వెళ్లి పక్కన దాక్కుంటారు. అప్పుడు దీప ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇప్పుడు హేమచంద్ర సౌందర్య ఇద్దరు కాఫీ తాగుతూ ఉంటారు.
అప్పుడు దీపా నిద్ర లేచి ఎమోషనల్ అవుతూ బయట కూతుర్లు ఒకవైపు అత్తయ్య గారు పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు అనడంతో ఏం చేస్తాం దీప ఇది మన తలరాత అనడంతో లేదు డాక్టర్ బాబు ఇది మనం తీసుకుంటున్న గీత అని అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ బాధగా మాట్లాడుకుంటూ ఉంటారు . అప్పుడు దీప నేను ప్రమాదంలో చనిపోయాను మీరు ఒక్కరే బ్రతికేది అని చెప్పి అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్లిపోండి అని అంటుంది. అదేంటి దీపం నా ప్రాణాలు కదా పోయేది అనడంతో చాలా డాక్టర్ బాబు నాకు నిజం మొత్తం తెలుసు పోయేది నీ ప్రాణాలు కాదు నా ప్రాణాలు అని అంటుంది దీప.