MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • సౌందర్యకి బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా, ఆమె తన కంటే జూనియర్ ?

సౌందర్యకి బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా, ఆమె తన కంటే జూనియర్ ?

నటన విషయంలో సౌందర్య చాలా మంది హీరోయిన్లకు, నటులకు ఆదర్శంగా నిలిచారు. గ్లామర్ జోలికి వెళ్లకుండా ప్రేక్షకులని ఎలా మెప్పించవచ్చు, వాళ్ళ మనసులు ఎలా గెలుచుకోవచ్చు అనేదానికి సౌందర్య ఉదాహరణ. 

1 Min read
Author : Tirumala Dornala
| Updated : Mar 17 2025, 07:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Soundarya

Soundarya

చిత్ర పరిశ్రమలో సౌందర్య ఎన్నో ఘన విజయాలు సాధించారు. పిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు సౌందర్య వెళ్లిపోయారు. అయితే నటన విషయంలో సౌందర్య చాలా మంది హీరోయిన్లకు, నటులకు ఆదర్శంగా నిలిచారు. గ్లామర్ జోలికి వెళ్లకుండా ప్రేక్షకులని ఎలా మెప్పించవచ్చు, వాళ్ళ మనసులు ఎలా గెలుచుకోవచ్చు అనేదానికి సౌందర్య ఉదాహరణ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Soundarya

Soundarya

ఎంతో మందికి అభిమాన నటి అయిన సౌందర్యకి కూడా ఇష్టమైన నటీనటులు ఉన్నారు. ఒక హీరోయిన్ విషయంలో సౌందర్యకి ఆసక్తికర సంఘటన ఎదురైంది. సౌందర్యకి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని ప్రశ్నించగా సౌందర్య బదులిచ్చారు. టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక అమ్మాయి నటన నాకు బాగా నచ్చుతోంది. ఆమె పేరు లయ అని సౌందర్య చెప్పారు. 

35

లయ చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తోంది అని సౌందర్య ప్రశంసలు కురిపించారు. అప్పటికి సౌందర్యతో లయకి అసలు పరిచయం లేదు. సౌందర్య ఇంటర్వ్యూ చూసిన లయ వెంటనే ఆమె ఇంటికి వెళ్లారట. ఏంటి ఇలా వచ్చారు అని సౌందర్య అడిగితే.. నా గురించి మీరు ఇంటర్వ్యూలో మాట్లాడారు. దానికి థ్యాంక్స్ చెబుదామని వచ్చాను అని లయ చెప్పిందట. 

45

అయ్యో దానికి ఇంత దూరం రావాలా అని సౌందర్య అడిగారు. లేదు మేడం, మీ నోటి నుంచి నా పేరు వచ్చింది అంటే అది నాకు చాలా పెద్ద విషయం అని లయ చెప్పింది. అదే సమయంలో లయ పెళ్లి చేసుకుందాం కన్నడ రీమేక్ లో నటిస్తున్నారు. తెలుగులో వెంకటేష్, సౌందర్య నటించిన హిట్ చిత్రం అది. పెళ్లి చేసుకుందాం రీమేక్ గురించి కూడా సౌందర్య లయకి సలహాలు ఇచ్చారట. 

55

నాలాగా ఇమిటేట్ చేయమన్నా, కాపీ చేయమన్నా చేయకు. నీ స్టైల్ లో నువ్వు చేయి, బావుంటుంది అని సౌందర్య సలహా ఇచ్చారట. సౌందర్యతో మాట్లాడిన ఆ క్షణాలు తన జీవితంలో మెమొరబుల్ అని లయ పేర్కొన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Recommended image2
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 మూవీస్‌.. టాక్సిక్‌ ఉందా?.. టాలీవుడ్‌ దే హవా
Recommended image3
Rajinikanth Net Worth : తలైవా ఆస్తి ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved