MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దీప ఎంట్రీతో సౌందర్య గుండెల్లో రాయి.. ప్రియమణిని ఇంట్లో నుంచి గెంటేసిన వంటలక్క

దీప ఎంట్రీతో సౌందర్య గుండెల్లో రాయి.. ప్రియమణిని ఇంట్లో నుంచి గెంటేసిన వంటలక్క

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం ( Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సీరియల్ కు మంచి అభిమానం ఉండటంతో రేటింగులో కూడా దూసుకుపోతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 05 2021, 12:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మోనిత (Monitha) దగ్గరికి ప్రియమణి (Priyamani) వెళ్లి కాసేపు మాట్లాడుతుంది. మోనిత కూడా ఇప్పుడు మొత్తం అనుకూలంగా ఉన్న రోజులే అని మాట్లాడుతుండగా అప్పుడే డాక్టర్ భారతి వచ్చి సౌందర్య చెప్పిన విషయాలు అన్నీ చెబుతుంది. ఇక మోనిత భారతి మాట్లాడుతున్న మాటలను పట్టించుకోకుండా ఓవర్ గా ప్రవర్తిస్తుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇక మోనిత వెంటనే కోపంతో రగిలిపోతూ తను చెబితే నువ్వు ఎలా చెబుతావు అన్నట్లు ప్రశ్నిస్తుంది. సౌందర్య (Soundarya) గారు నీకోసం ఒక మెట్టు దిగి వచ్చారు అని అన్న కూడా మోనిత (Monitha) మొండిగా ప్రవర్తిస్తుంది. కావాలంటే తానే స్వయంగా వచ్చి చెబితే సరిపోతుంది కదా అని అంటుంది.
 

38

మోనిత మాట్లాడుతున్న మాటలకు భారతీకి (Bharathi) కోపం రావడంతో ఏమనలేక సైలెంట్ గా ఉండిపోతుంది. మరోవైపు ఇంట్లో సౌందర్య కార్తీక్ తో దోష నివారణ పూజ గురించి మాట్లాడుతుంది. ఇక కార్తీక్ (Karthik) కూడా నీకోసమే పూజకు సరే అంటున్నాను అని  అంటాడు.
 

48

కానీ మోనిత (Monitha) గురించి ఆలోచించే వరకు టెన్షన్ పడుతుంటాడు. సౌందర్య మాత్రం ఏం కాదు అంటూ ఈ పూజ ఒక్కటి అయిపోతే నాకు మనశ్శాంతి గా ఉంటుందని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. అంతలోనే దీప (Deepa) ఎంట్రీతో సడెన్ షాక్ ఇస్తుంది.
 

58

ఇంత చీకట్లో ఇక్కడ ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తుంది. సౌందర్య, కార్తీక్ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ టెన్షన్ పడిపోతారు. దీప (Deepa) మాత్రం వాళ్ల వైపు అదో రకంలా చూస్తూ మాట్లాడుతుంది. వెంటనే సౌందర్య (Soundarya) రేపు దేవుడి గది శుభ్రం చేయడం గురించి మాట్లాడుతున్నాను అని అబద్దం చెబుతుంది.
 

68

సౌందర్య ఆ జవాబు చెప్పే సరికి దీప.. దేవుడి గురించి ఈ సమయంలో మాట్లాడటం మంచి ఆలోచనే అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. సౌందర్య ఏమి అనలేక సరిదిద్దుకోవాలని చూస్తుంది. మొత్తానికి దీప (Deepa) సౌందర్యకు (Soundarya) గుండెల్లో రాయి వేసింది.
 

78

ఇక ప్రియమణి (Priyamani) మోనిత ఇంటి నుండి బాగా చీకటి పడ్డాక రావడంతో దీపకు అనుమానం వచ్చి గట్టిగా అడుగుతుంది. ఇక ఏమి చేసేది లేక మోనిత (Monitha) వాళ్ళ ఇంటికి వెళ్ళానని అనేసరికి దీప కోపంతో రగిలిపోతుంది. ఇక్కడ విషయాలన్నీ అక్కడ చెబుతున్నావా అంటూ అరుస్తుంది. వెంటనే ఈ ఇంటి నుంచి వెళ్ళిపో అని పంపించేస్తుంది 
 

88

హిమ (Hima) కార్తీక్ ను పిలిచి ఈ రోజు ఇక్కడే పడుకో నాన్న అంటూ బ్రతిమాలుతుంది. అందరం కలిసి కబుర్లు చెప్పుకోకా చాలా రోజులు అయ్యింది అని బాధపడుతుంది. సౌర్య అమ్మను తీసుకురాడానికి వెళ్ళింది అనేసరికి దీప (Deepa) వస్తుంది అని తెలియటంతో కార్తీక్ భయపడతాడు.

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image2
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image3
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved