MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దోష నివారణ పూజలో కార్తీక్, మోనిత.. కుమిలి కుమిలి ఏడుస్తున్న వంటలక్క?

దోష నివారణ పూజలో కార్తీక్, మోనిత.. కుమిలి కుమిలి ఏడుస్తున్న వంటలక్క?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ కు అభిమానం కూడా బాగానే ఉంది. రేటింగ్ లో మాత్రం ఈ సీరియల్ మొదటి స్థానంలో దూసుకెళ్తోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం..

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 08 2021, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

దోష నివారణ పూజ గురించి సౌందర్య (Soundarya) ఆనంద రావు తో చెబుతుంది. ఆనందరావు సౌందర్య మాటలు విని షాక్ అవుతాడు. కోపంతో రగిలిపోతాడు. సౌందర్య కార్తీక్ (Karthik) ను ఒప్పించమని కోరుకుంటుంది. కానీ ఆనంద్ రావు కోపంతో సౌందర్య పై అరుస్తాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

అంతలోనే కార్తీక్ (Karthik) వచ్చి ఈ తప్పు నేను చేశాను అని ఎలా అనుకుంటున్నావు అనేసరికి.. అప్పటికే కోపంతో ఉన్న ఆనందరావు కార్తీక్, సౌందర్య (Soundarya) లను మీ బాధ మీరు పడండి అన్నట్లు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

310

ఇక దీప (Deepa) పిల్లలను నిద్ర లేపడానికి రాగా పిల్లలు నాన్న ఎక్కడికి వెళ్లాడు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటారు. ఇక దీప కోపంతో చిరాకుగా కనిపిస్తుంది. పిల్లలు అడుగుతున్న ప్రశ్నలకు చిరాకు పడుతూ సమాధానం చెబుతుంది.

410

ఇక సౌందర్య కార్తీక్ (Karthik) ను పూజకు రమ్మని బ్రతిమాలుతుంది. కార్తీక్ మాత్రం అస్సలు ఒప్పుకోడు. కానీ సౌందర్య (Soundarya) బాగా బతిమాలి చివరకు కార్తీక్ ను ఒప్పిస్తుంది. కార్తీక ఏమి అనలేక పూజకు సిద్ధమవుతాడు.

510

మరోవైపు మోనిత (Monitha) పూజకు అందంగా రెడీ అవుతుంది. ఇక ప్రియమణితో ఆనందరావును తయారు చేయమని చెబుతుంది. మోనిత కార్తీక్ (Karthik) తో పూజ లో కూర్చుంటునందుకు సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇక మెడలో కార్తీక్ కట్టినట్లుగా తాళిబొట్టు వేసుకుంటుంది.

610

వెంటనే ప్రియమణి (Priyamani) చూసి షాక్ అవుతుంది. అలా వేసుకోకూడదు అని హెచ్చరిస్తుంది. కానీ మోనిత (Monitha) మొండితనం గురించి అందరికీ తెలిసిందే. పేపర్స్ పై సైన్ చేసినప్పుడే కార్తీక్ నా భర్త అయ్యాడు అంటూ మెడలో తాళిబొట్టు చూసుకొని మురిసిపోతుంది..

710

ఇక పిల్లలను స్కూలుకి రెడీ చేసి ఎప్పుడూ లేని విధంగా పిల్లలకు కోపంగా తినిపిస్తుంది. పిల్లలు మేము తింటాము అని అన్నా కూడా వినకుండా గట్టిగా నోట్లోకి కుక్కుతుంది. ఇక అక్కడే కూర్చున్న ఆనందరావు (Anand rao) దీప (Deepa) ని చూసి బాధపడతాడు.

810

ఇక ఆనందరావు (Anand rao) ని డాక్టర్ బాబు, అత్తయ్య గారు ఎక్కడికి వెళ్లారు అని అడిగేసరికి.. తనకు తెలియదు అన్నట్టుగా సమాధానం చెబుతాడు. ఇక దీప (Deepa) ఏదో కొత్త కొత్త గా మాట్లాడినట్టు అనిపిస్తుంది. పిల్లలు కూడా అడగటంతో వాళ్ళ పై కోపంగా అరుస్తుంది.

910

ఇక పిల్లలిద్దరూ నాన్న సరిగా ఉండటం లేదు అని నువ్వు కూడా సరిగా ఉండటం లేదు అని అనేసరికి దీప (Deepa) కోపంతో అరుస్తుంది. నాన్న ఎక్కడికి వెళ్ళాడో నాకు కూడా చెప్పలేదు అని హిమ (Hima) అనేసరికి దీప వెటకారంగా సమాధానం ఇస్తుంది.

1010

తరువాయి భాగం లో దీప (Deepa) గుడి దగ్గరికి వెళ్లగా అక్కడ పూజలో కూర్చున్న మోనితను (Monitha), డాక్టర్ బాబు ను చూసి షాక్ అవుతుంది. బయట పూజారిని అడగటంతో ఆ దంపతులిద్దరూ దోష నివారణ పూజ చేసుకుంటున్నారు అని అనేసరికి ఏడుస్తూ బాధపడుతుంది.

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image2
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image3
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved