- Home
- Entertainment
- Karthika Deepam: రుద్రాణి చెంప చెళ్లుమనిపించిన సౌందర్య.. మరోవైపు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కార్తీక్!
Karthika Deepam: రుద్రాణి చెంప చెళ్లుమనిపించిన సౌందర్య.. మరోవైపు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కార్తీక్!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమౌతున్న ఈ సీరియల్ రేటింగులో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

పిల్లలు స్కూల్లో జరిగిన విషయాన్ని దీపకు (Deepa) చెప్పటంతో దీప కోపంతో రగిలిపోతుంది. ఎలాగైనా రుద్రాణి (Rudrani) పనిచేయాలని అనుకుంటుంది. మరోవైపు కార్తీక్ తన అమ్మనాన్నలను తలచుకొని బాధ పడతాడు. వాళ్లు దగ్గరలో ఉన్న ఏం చేయలేని పరిస్థితి అని కుమిలిపోతాడు.
రుద్రాణికి (Rudrani) ఇవ్వాల్సిన పార్సల్ ఇవ్వకుండా హోటల్ కి వచ్చి తన మనసు బాలేదని చెప్పి ఆ పార్సల్ ను అప్పు కి ఇస్తాడు. మరోవైపు రుద్రాణి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలని హడావిడి చేస్తోంది. అంతలోనే అబ్బులు (Abbulu) తనకు ప్రకృతి వైద్యశాల లో పని ఉందని చెప్పటంతో దారిలో వెళ్లవచ్చని చెబుతుంది.
ఇక ప్రకృతి వైద్యశాలలో సౌందర్య (Soundarya), ఆనందరావు లకు అక్కడున్న గురువు ధ్యానం గురించి వివరిస్తాడు. అదే సమయంలో అబ్బులు వచ్చి గురువును విసిగిస్తాడు. మరోవైపు రుద్రాణి (Rudrani) రిజిస్ట్రేషన్ సమయానికి ఆలస్యం అవటంతో కోపంతో రగిలిపోతుంది. ఇక తాను కూడా లోపలికి వస్తుంది.
అప్పటికే సౌందర్య (Soundarya) అబ్బులుతో కాస్త మర్యాదగా మాట్లాడమని చెబుతుంది. ఇక రుద్రాణి వచ్చి తన మాటలతో అక్కడ రెచ్చి పోతూ ఉండగా వెంటనే సౌందర్య లేచి రుద్రాణి చెంప చెల్లుమనిపించింది. దీంతో రుద్రాణి (Rudrani) కి వెంటనే గతంలో దీప కొట్టిన సీన్ గుర్తుకొస్తుంది.
ఇక సౌందర్య తనకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. రుద్రాణి కోపంతో మండిపోతుంది. రెండవది అంటూ అక్కడినుంచి కోపంగా వెళ్ళిపోతుంది. దీప (Deepa) రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ రుద్రాణి మాటలను తలుచుకుంటుంది. అప్పుడే రుద్రాణి (Rudrani) కారు వేగంగా అక్కడి నుంచి వెళుతుంది.
దాంతో దీప (Deepa) అరవడంతో అబ్బులు కారు ఆపుతాడు. రుద్రాణి దీప ను చూసి వెళ్లాలనుకున్నప్పుడు తన మనుషులు తనను ఆపేస్తారు. రుద్రాణి (Rudrani) మనుషులు దీప దగ్గరికి వెళ్లగా అక్కడ అబ్బులు మర్యాద లేకుండా మాట్లాడటంతో దీప గట్టి చెంపదెబ్బ ఇస్తుంది.
వెంటనే మరో మనిషి వాళ్ళను అక్కడ నుంచి పంపి ప్రకృతి వైద్యశాల లో జరిగిన విషయాన్ని దీపకు (Deepa) చెబుతాడు. అప్పుడే రుద్రాణి అక్కడికి రావడంతో దీప చెంప దెబ్బలు గుర్తుచేస్తూ మరి వెటకారం గా మాట్లాడుతుంది. అప్పటికి మండిపోతున్న రుద్రాణి (Rudrani) దీప మాటలకు మరింత మండిపోతుంది.
మోనిత (Monitha) విన్నీతో బస్తీ వాళ్ల గురించి చెబుతుండగా విన్నీ మిమ్మల్ని చూస్తే భయమేస్తుందని అనటంతో మోనిత విన్నీ (Vinni) కి తాను అమాయకురాలు అని నచ్చచెబుతుంది. మరోవైపు పిల్లలు ఆడుతూ ఉండగా కార్తీక్ వాళ్లను చూసి బాధపడతాడు.
ఇక పిల్లలు కార్తీక్ (Karthik) తో కాసేపు మాట్లాడుతూ ఉండగా వెంటనే రుద్రాణి గుర్తుకు రావడంతో అక్కడి నుంచి వెళ్తాడు. మరోవైపు సౌందర్య వాళ్ళు రుద్రాణి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక దీప ప్రకృతి వైద్యశాల దగ్గరికి వచ్చి రుద్రాణిని (Rudrani) కొట్టిన ఆవిడ ఎవరో అని తనని చూడాలని అనుకుంటుంది. తరువాయి భాగం లో రుద్రాణికి కార్తీక్ గట్టి వార్నింగ్ ఇస్తాడు.