సోనాలి బింద్రే ని కలవాలని నీళ్లలో దూకి చనిపోయిన అభిమాని
సోనాలి మీడియాతో మాట్లాడుతూ.... ఆ సంఘటనను నమ్మలేకపోతున్నానని అన్నారు. ఈ క్రేజీ ఫ్యాన్ కల్చర్ తనకు అర్దం కాదు అన్నారు. తనకు ఇప్పటి దాకా ఆ సంఘటన

అభిమానం ఉండచ్చు కానీ వెర్రి తలలు వెయ్యకూడదు. ఆ విషయం మనకు రీసెంట్ గా జరిగిన దర్శన్ చేతిలో హత్యకు గురి కాబడ్డ రేణుకా స్వామి అనే అబిమాని ని చూస్తే అర్దమవుతుంది. అయితే సోనాలి బింద్రే అభిమాని ఒకరు ఆమెను చూడటం కోసం నీళ్లలో దూకి చనిపోయిన విషయం కూడా బాధాకరమే. అయితే ఈ సంఘటన ఇప్పడు జరిగింది కాదు. తొంబైలలో ఆమె వెలుగుతున్న సమయంలో జరిగింది. ఈ విషయం రీసెంట్ గా ఓ పాడ్ కాస్ట్ లో చర్చకు వచ్చింది. దానిపై సోనాలి ఏమని స్పందించింది..అసలేం జరిగిందో చూద్దాం.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగి స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది నటి సోనాలి బింద్రే (Sonali Bendre). పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న రీసెంట్ గా వెబ్ సీరిస్ తో పలకరించింది. తన రీ ఎంట్రీలో భాగంగా ఆమె పాడ్ కాస్ట్ లకు, మీడియా ప్రమోషన్స్ కు హాజరవుతోంది. తాజాగా అలా Mid-Day వారి The Bombay Film Podcast కు హాజరైతే అక్కడ ఆమెకు సంభందించిన ఓ పాత సంఘటనను గుర్తు చేసారు.
అప్పట్లో సోనాలి భూపాల్ వెళ్లినప్పుడు ఓ అభిమాని ఆమెను చూడటానికి వచ్చారు. అయితే ఈ క్రమంలో అక్కడున్న చిన్న చెరువులో దిగి అటు వైపు వెళ్ళి ఆమెను చూద్దామనుకున్నాడు. అయితే అది సాధ్యం కాలేదు. అతను మృతి చెందాడు. ఈ విషయమై ఆమెను ఇప్పుడు ప్రశ్నించారు.
సోనాలి స్పందిస్తూ....తాను ఆ సంఘటనను నమ్మలేకపోతున్నానని అన్నారు. ఈ క్రేజీ ఫ్యాన్ కల్చర్ తనకు అర్దం కాదు అన్నారు. తనకు ఇప్పటి దాకా ఆ సంఘటన గురించి తెలియదు అన్నారు. నిజంగా జరిగిందా అని ఎదురు ప్రశ్నించారు. అసలు ఒకరు తమ అభిమాన హీరోయిన్ ని చూడటం ప్రాణాలు తీసుకోవటం అనేది చాలా బాధాకరమైన విషయం, నమ్మలేని సంగతి అన్నారు.
ఫ్యాన్ మెయిల్స్ ఉన్నాయి. నాకు ఉత్తరాలు వచ్చేవి. కొందరు రక్తతో ఉత్తరాలు రాసేవారు. అయితే అది నిజంగా వాళ్ల రక్తమేనా, అసలు అది రక్తమేనా అనే సందేహం వచ్చేదన్నారు. ఎందుకు మనుష్యులు తమలాంటి మరో మనిషి కోసం ఇలా తాపత్రయపడతారో అర్దం కాదని చెప్పుకొచ్చారు. ఇక బాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ కల్చర్, హీరో,హీరోయిన్స్ పట్ల అబ్సెషన్ నాకు ఆశ్చర్యంగా ఉన్నా, అసలు ఇష్టం ఉండవని చెప్పుకొచ్చింది.
చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. గతంలో తాను నటించిన ఓ సినిమా నుంచి నేర్చుకున్న గుణపాఠాన్ని గుర్తుచేసుకున్నారు. అలాగే ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ఫేక్ న్యూస్‌లపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.‘‘నేను నటించిన ‘డూప్లికేట్’ చిత్రం నాకు వృత్తిపరంగా ఎన్నో పాఠాలు నేర్పింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాలని.. అది సినిమాకు ఎంతో కీలకమని చిత్ర టీమ్ చెప్పింది. అందులో నటించడం సవాలుగా అనిపించి షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఆత్రుతగా ఎదురుచూశా. కానీ, షూటింగ్ మొదలుపెట్టాక నేను చేస్తున్నది కీలకపాత్ర కాదని.. కార్టూన్ వంటిదేననే భావన కలిగింది.
కథను నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానని తెలుసుకున్నా. అప్పటి నుంచి వచ్చిన పాత్ర గురించి లోతుగా తెలుసుకోవడం మొదలుపెట్టాను. ఆలోచించి ఎంపిక చేసుకుంటున్నా. ఇప్పటికీ ఎవరైనా ఆ సినిమా పాటలు ప్లే చేసినా.. దాని ప్రస్తావన తెచ్చినా నాకు నా పాత్ర గుర్తుకు వస్తుంది. సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక అలాంటి వాటిని ఎంచుకోకుండా జాగ్రత్త పడుతున్నా’’ అని చెప్పారు. 1998లో విడుదలైన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ప్రధానపాత్రలో నటించగా జూహీ చావ్లా, సోనాలి కీలకపాత్రలు పోషించారు.
ఇటీవల వైరలవుతోన్న ఫేక్ న్యూస్‌ల గురించి సోనాలి స్పందిస్తూ.. ‘రూమర్స్, ఫేక్ న్యూస్ సృష్టించడం చాలా తేలిక. సినీ పరిశ్రమలో ఉన్నవారిపై ఇలాంటివి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కొన్ని రోజులుగా ఇవి నియంత్రణలోనే ఉన్నాయనిపిస్తుంది. సాంకేతికతను ఉపయోగించి నకిలీ వార్తలను సులభంగా గుర్తించగలుగుతున్నారు. గతంలో ఏదైనా నకిలీనా.. కాదా అని తెలుసుకోవడానికి 10 సంవత్సరాలు పట్టేది.. ఇప్పుడు 10 నిమిషాల్లో తెలుసుకోగలుగుతున్నారు’ అని తన అభిప్రాయాన్ని తెలిపారు.
90ల్లో సినిమా పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. అప్పటి నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘1994లో నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇప్పటితో కంపేర్ చేస్తే అప్పటి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండేవి. ఎంతోమంది సహనటులతో నాపై రూమర్స్ సృష్టించారు. వాటిలో ఒక్కటి కూడా నిజం లేదు. ఇప్పటికీ ఈ పనికిమాలిన ట్రెండ్ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. 90ల్లో సినిమా నిర్మాతలే హీరో-హీరోయిన్ల మధ్య ఇలాంటి గాసిప్స్ క్రియేట్ చేేసవారు. వాటిని మీడియా వాళ్లకు చెప్పేవాళ్లు . వాళ్ల సినిమాల ప్రమోషన్స్ కోసమే ఇలా చేసేవారు. అది తెలిశాక నేను ఆశ్చర్యపోయాను’ అని అన్నారు.
Sonali Bendre
అంతే కాదు అప్పట్లో కూడా బాడీ షేమింగ్ చేసేవారని ఆమె అన్నారు. హీరోయినగా కెరీర్ బిగిన చేసిన సమయంలో నేను సన్నగా ఉన్నందుకు అందరూ హేళన చేసేవారు. అప్పట్లో చాలామంది హీరోయిన్లు కొంచెం బొద్దుగా ఉండేవారు. వాళ్లతో పోలిస్తే నేను సన్నగా ఉండేదాన్ని. కొందరు నిర్మాతలు ఈ విషయాన్ని నా మొహం మీదే చెప్పేవారు. వాటిని నేనేం పట్టించుకోలేదు. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. నటనలో, డ్యాన్స్‌లో ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. ఇక్కడకు వచ్చాకే అన్ని నేర్చుకున్నా. స్టార్‌గా హీరోయిన్‌గా కొనసాగుతానని కూడా అనుకోలేదు. నాకు వచ్చిన అవకాశాలు, ఆదరించిన ప్రేక్షకుల వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నా’’ అని సోనాలి బింద్రే అన్నారు.