అవసరమైతే అడుక్కుతింటా, ఆ కమెడియన్ తో మాత్రం నటించను, నటి తీవ్ర వ్యాఖ్యలు
భిక్షాటన చేస్తానేమో కానీ ఆ కమెడియన్ తో మాత్రం నటించనని నటి సోనా బహిరంగంగా మాట్లాడటం షాకింగ్ గా మారింది.

అజిత్ నటించిన పూవెల్లం ఉన్ వాసం సినిమా ద్వారా సోనా సినిమాల్లోకి పరిచయమైంది. అజిత్ సినిమా తర్వాత విజయ్ సినిమా షాజహాన్‌లో కూడా నటించింది. ఆ తర్వాత ఆయుధం, శివపతికారం, కెల్వికురి, మృగం, కుసేలన్ వంటి అనేక చిత్రాల్లో నటించింది. 2001 నుంచి 2024 వరకు ఆమె నటించిన సినిమాలు వరుసగా విడుదలయ్యాయి.

సోనా దర్శకత్వం వహించిన స్మోక్:
తమిళంతో పాటు తెలుగు, మలయాళ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు. ఈ నేపథ్యంలో సోనా రాసి దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ స్మోక్. ఈ వెబ్ సిరీస్‌ను ఆమె స్వయంగా నిర్మించారు. అంటే, షార్ప్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థతో కలిసి యునిక్ ప్రొడక్షన్ సంస్థ ద్వారా ఆమె ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు.
సోనా జీవితంలోని 5 సంవత్సరాల కథ
నటి సోనా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ 2010 నుంచి 2015 వరకు జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో బిజీగా ఉన్న సోనా వరుసగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
నా జీవితంలో ఎక్కువ మోసాలే
అప్పుడు ఆమె గురించి చాలా మందికి తెలియని చాలా విషయాలు తెలిశాయి. ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, నా జీవితంలో నేను ఎక్కువగా మోసాలనే ఎదుర్కొన్నాను. అప్పుడు నాకు ఎవరూ లేరు. ఒకవేళ ఉన్నా ఎవరినీ నమ్మేది లేదు. నీ కోసం నేను ఉన్నాను అని చెప్పినా కూడా వారిని నేను నమ్మేదాన్ని కాదు. దానికి ముఖ్య కారణం నేను అందరి దగ్గర మోసపోయాను.
అలా ఉన్నప్పుడు నాకు నటన ఓదార్పునిచ్చింది. అందుకే నేను చాలా సినిమాల్లో శ్రద్ధగా నటించాను. అందులో కూడా నాకు ఒక సమస్య ఉంది. నన్ను అందరూ గ్లామర్‌గా చూశారు. దీంతో గ్లామర్ కోసం వచ్చిన అవకాశాలను నేను వద్దనుకున్నాను. ఒకానొక సమయంలో నటనపై విరక్తితో నా జీవితానికి సంబంధించిన విషయాలను తీయడం ప్రారంభించాను. గ్లామర్ క్వీన్ సిల్క్ స్మిత మరణం తర్వాత ఆమె జీవిత చరిత్ర అని చాలా మంది చెబుతూ వచ్చారు. కానీ, అప్పటికి అసలు కథ ఎవరికీ తెలియదు. అలానే నేను చనిపోయిన తర్వాత కూడా నా గురించి ఎవరైనా ఒక కథ చెప్పవచ్చు. అందుకే నా కథను నేనే చెప్పేయాలని నిర్ణయించుకున్నాను.
అమ్మ చావులో కూడా సెల్ఫీ అడిగిన అభిమాని
అమ్మ చనిపోయినప్పుడు ఆమెను ఖననం చేసి వచ్చినప్పుడు ఒక వ్యక్తి సెల్ఫీ తీసుకుంటానని నా దగ్గరకు వచ్చాడు. కానీ, నేను అమ్మ చనిపోయారు కుదరదు అని చెప్పగా ప్రపంచంలో జరగనిదా ఇప్పుడు జరిగింది, ఒక సెల్ఫీ కదా అన్నాడు. నేను గ్లామర్ నటిని కాబట్టే అతను అలా మాట్లాడాడు. అందుకే నేను గ్లామర్‌గా నటించడమే మానేశాను. ఇప్పుడు నన్ను అందరూ గౌరవిస్తున్నారు. కుసేలన్ సినిమాలో వడివేలుతో కలిసి నటించాను. ఆ సినిమా తర్వాత ఆయనతో కలిసి నటించడానికి నాకు 16 సినిమాల్లో అవకాశం వచ్చింది. కానీ, నేను నటించలేదు. అవసరమైతే అడుక్కుంటాను కానీ వడివేలుతో నటించనని సోనా తెలిపారు. వడివేలుతో సోనాకి ఎదురైన సమస్యలే అందుకు కారణం అనే ప్రచారం జరుగుతోంది.

