Acharya: చిరు, చరణ్ ఇద్దరికీ కలిసొచ్చిన హీరోయిన్.. కనీసం కాజల్ పేరు కూడా చెప్పలేదే
కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ఆచార్య. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 29న ఆచార్య గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు.

kajal aggarwal
కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ఆచార్య. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 29న ఆచార్య గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. శనివారం రోజు హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.
kajal aggarwal
రాజమౌలి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరంజీవి తదుపరి చిత్రాల దర్శకులు బాబీ, మెహర్ రమేష్, మోహన్ రాజా కూడా అతిథిలుగా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంతా బాగానే జరిగింది. కానీ ఒక విషయం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.
kajal aggarwal
ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా మెయిన్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. కాజల్ ఇటీవలే తల్లి కావడంతో ఆచార్య ప్రచార కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. కానీ మెగా ఫ్యామిలీకి కాజల్ అగర్వాల్ చాలా ముఖ్యమైన హీరోయిన్ అనే చెప్పాలి. కాజల్ మెగా హీరోలతో నటించిన దాదాపు అన్ని చిత్రాలు హిట్సే.
kajal aggarwal
ముఖ్యంగా రాంచరణ్ తో నటించిన మగధీర, నాయక్ సూపర్ హిట్స్ గా నిలిచాయి. గోవిందుడు అందరివాడేలే మూవీ పర్వాలేదనిపించింది. ఇక మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ నెం 150 లో హీరోయిన్ కాజల్ అగర్వాలే. మెగా ఫ్యామిలీతో కాజల్ కి ఇంతటి అటాచ్మెంట్ ఉంది.
kajal aggarwal
ఇప్పుడు ఆచార్యలో మరోసారి చిరంజీవితో కాజల్ నటిస్తోంది. కొన్ని రోజుల క్రితమే కాజల్, గౌతమ్ కిచ్లు దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. దీనితో ఆమె ఆచార్య ప్రమోషన్స్ కి రావడం కుదరడం లేదు. ఇది సమస్య కాదు. కానీ ఆచార్య ప్రచార కార్యక్రమాల్లో.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎక్కడా కాజల్ పేరు వినిపించడం లేదు.
kajal aggarwal
దీనితో అభిమానులు సంథింగ్ ఏదో తేడా జరిగినట్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. కాజల్ తో పాటు ఈ చిత్రంలో విలన్ గా నటించిన సోనూ సూద్ పేరు కూడా వినిపించలేదు. సాధారణంగా అయితే సోనూ సూద్ పేరు వినిపించకపోయినా నెటిజన్లు పెద్దగా పట్టించుకునేవారు కాదు.
kajal aggarwal
ప్రస్తుతం సోనూ సూద్ నేషనల్ హీరో. దీనితో అతడి గురించి కూడా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా కాజల్ వ్యవహారంలో.. ముందుగా చెప్పిన దానికంటే ఆమె పాత్రని బాగా తగ్గించేశారని.. అందుకే కాజల్ హర్ట్ అయినట్లు ఒక రూమర్ వైరల్ అవుతోంది. మరి ఇందులో వాస్తవం ఏంటో తెలియాలంటే ఏప్రిల్ 9 వరకు ఎదురు చూడాల్సిందే.