- Home
- Entertainment
- నాని, రామ్, చైతు దెబ్బైపోయారు.. నియోజకవర్గంలో దూసుకుపోతున్న నితిన్, గెలుపుకి పక్కా స్కెచ్
నాని, రామ్, చైతు దెబ్బైపోయారు.. నియోజకవర్గంలో దూసుకుపోతున్న నితిన్, గెలుపుకి పక్కా స్కెచ్
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మాచర్ల నియోజకవర్గం'. నితిన్ ఈ మూవీపై చాలానే హోప్స్ పెట్టుకుని ఉన్నాడు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాల కలెక్షన్స్ ప్రతి ఒక్కరిని కలవర పెడుతున్నాయి.

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మాచర్ల నియోజకవర్గం'. ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న చిత్రం ఇది. నితిన్ ఈ మూవీపై చాలానే హోప్స్ పెట్టుకుని ఉన్నాడు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాల కలెక్షన్స్ ప్రతి ఒక్కరిని కలవర పెడుతున్నాయి.
ముఖ్యంగా టైర్ 2 హీరోల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గతంలో సినిమా ఓ మోస్తరుగా ఉన్నా కలెక్షన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప వసూళ్లు రావడం లేదు. దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్స్ కూడా తలలు పట్టుకుంటున్నారు. కలెక్షన్స్ ఇంత దారుణంగా పడిపోవడానికి పూర్తి కారణాలు ఎవరికీ అర్థం కావడం లేదు కానీ.. కొన్ని సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆడియన్స్ అభిరుచి మారుతోంది. ఓటిటి ఎఫెక్ట్ పడింది. దీనితో ప్రేక్షకులు ఎక్కువగా యాక్షన్ అండ్ మాస్ చిత్రాలనే ఇష్టపడుతున్నారు. అఖండ, బంగార్రాజు, పుష్ప, ఆర్ఆర్ఆర్, విక్రమ్, భీమ్లా నాయక్, కెజిఎఫ్2 చిత్రాల విజయానికి కారణం అదే.
నాని నటించిన 'అంటే సుందరానికీ'.. నాగ చైతన్య 'థాంక్యూ' చిత్రాలు క్లాస్ మూవీస్. అంటే సుందరానికీ చిత్రానికి ఒక మోస్తరు టాక్ వచ్చింది.కానీ రిజల్ట్ తీవ్రంగా నిరాశపరిచింది. థాంక్యూ చిత్రానికి తొలి రోజునుంచే మిక్స్డ్ టాక్ మొదలు కావడంతో డిజాస్టర్ రన్ కొనసాగుతోంది. రామ్ నటించిన 'ది వారియర్' చిత్రం కమర్షియల్ చిత్రమే. కానీ ఫ్రెష్ ఫీలింగ్ ఇవ్వలేకపోయింది.. బజ్ క్రియేట్ చేయలేక బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది.
ఈ పరిస్థితిపై నితిన్ అప్రమత్తంగా ఉన్నట్లు ఉన్నాడు. మాచర్ల నియోజకవర్గం చిత్రం చాలా కాలం తర్వాత నితిన్ చేస్తున్న మాస్ మూవీ. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మొదటి నుంచి పక్కాగా ప్రమోషన్స్ చేస్తున్నారు. నితిన్ అండ్ టీం చేస్తున్న ప్రమోషన్స్ బాగా కలిసి వస్తున్నాయి. దీనితో మాచర్ల నియోజకవర్గం చిత్రంపై సాలిడ్ బజ్ క్రియేట్ అయింది.
టీజర్ వర్కౌట్ ఐంది. అంజలితో చేసిన ఐటెం సాంగ్, ఇటీవల విడుదలైన అదిరిందే సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ప్రతి అంశం ఈ చిత్రంలో ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తోంది. అదిరిందే సాంగ్ లో నితిన్ స్టైల్, కృతి శెట్టి కాస్ట్యూమ్స్ చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. స్లో మోషన్ స్టెప్పులతో ఇద్దరూ కిక్కెక్కిస్తున్నారు. దీనితో నియోజకవర్గంలో గెలుపుకి నితిన్ పక్కా స్కెచ్ రెడీ చేసుకున్నాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆగష్టు 12 న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. మరి చూద్దాం.. ఇప్పుడున్న బాక్సాఫీస్ పరిస్థితిని అధికమించి నితిన్ విజయం సాధిస్తాడో లేదో..