MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ట్రోలర్స్ కి సోహైల్‌ వార్నింగ్‌.. తానేం స్కామ్‌ చేయలేదంటూ, ఫ్యామిలీ జోలికొస్తే వెతికమరీ కొడతానని ఫైర్‌

ట్రోలర్స్ కి సోహైల్‌ వార్నింగ్‌.. తానేం స్కామ్‌ చేయలేదంటూ, ఫ్యామిలీ జోలికొస్తే వెతికమరీ కొడతానని ఫైర్‌

తాను ఆఫర్‌ తీసుకుని వెళ్లడం పట్ల కొందరు కామెంట్లు చేస్తున్నారట. స్కామ్‌ చేశారని, ఫ్యామిలీ గురించి తప్పుగా కామెంట్లు పెడుతున్నారట. `లక్కీ లక్ష్మణ్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేదికగా వారికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు సోహైల్‌. తానేం బిగ్‌ బాస్‌ 4లో స్కామ్‌ చేసి రాలేదన్నారు. 

3 Min read
Author : Aithagoni Raju
| Updated : Dec 28 2022, 12:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బిగ్‌ బాస్‌ 4తో పాపులర్‌ అయిన సోహైల్‌(Sohel) హీరోగా దూసుకుపోతున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన తొలి చిత్రం `లక్కీ లక్ష్మణ్‌`(Lucky Lakshman) ఈ నెల 30న విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ మంగళవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా సోహైల్‌ ట్రోలర్స్ కి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఫ్యామిలీ జోలికొస్తే వెతికి మరీ కొడతా అంటూ ఫైర్‌ అయ్యారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

బిగ్‌ బాస్‌ 4 ఫైనల్‌లో సోహైల్‌ రూ. 25 లక్షల ఆఫర్‌ తీసుకుని బయటకొచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో అసలైన విన్నర్‌ సోహైల్‌ అంటూ అంతా కితాబిచ్చారు. చిరంజీవి, నాగార్జునలు కూడా ఆయన్ని అభినందించారు. ప్రశంసించారు. మొత్తంగా ఆ సీజన్‌లో అభిజిత్‌ బీబీ టైటిల్‌ విన్నర్ అయినా, ఆడియెన్స్ హృదయాలను గెలుచుకున్నది మాత్రం సోహైల్‌ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే తాను ఆఫర్‌ తీసుకుని వెళ్లడం పట్ల కొందరు కామెంట్లు చేస్తున్నారట. స్కామ్‌ చేశారని, ఫ్యామిలీ గురించి తప్పుగా కామెంట్లు పెడుతున్నారట. 

38

`లక్కీ లక్ష్మణ్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేదికగా వారికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు సోహైల్‌. తానేం బిగ్‌ బాస్‌ 4లో స్కామ్‌ చేసి రాలేదన్నారు. బిగ్‌ బాస్‌ ఇచ్చిన ఆఫర్‌ని తీసుకుని వచ్చానని, మా లాంటి మధ్యతరగతి కుటుంబానికి అది చాలా పెద్ద అమౌంట్‌ అని, రెండు కోట్లతో సమానమని తెలిపారు. కష్టాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో మాకు ఆ అమౌంట్‌ చాలా హెల్ప్ అయ్యిందని, ఆ అమౌంట్‌తో మా చెల్లి పెళ్లి చేశానని తెలిపారు. 

48

మా ఇంట్లో చెల్లి పెళ్లి చేయడం ఈజీ కాదని, చాలా పెద్ద విషయమని, అంతకంటే తనకు ఏం కావాలన్నారు. అంతేకాదు ఆ వచ్చిన డబ్బులోనే కొంత ఓల్డేజ్‌ హోంకి సహాయం చేశానని, తనకు వచ్చినదాంట్లో ఇతరులకు సహాయంచేస్తానని తెలిపారు. మాలాంటి వారిని ఆదరించి ఎంకరేజ్‌ చేస్తే ఇంకొంత మందికి సహాయం చేస్తానన్నారు సోహైల్‌. 
 

58

ఇప్పుడు చేస్తున్న `లక్కీ లక్ష్మణ్‌`ని ఆదరించి సక్సెస్‌ చేస్తే ఆ డబ్బుతో చాలా మందికి సహాయం చేయగలుగుతానని వెల్లడించారు. అయితే తాను నాలుగు సినిమాలు చేస్తున్నా, ఇప్పటి వరకు సొంత ఇళ్లు కొనుక్కోలేదని, చెల్లి పెళ్లికే అయ్యాయని చెప్పారు. ఈ సందర్భంగా ట్రోలర్స్ కి, మీమర్స్ వార్నింగ్‌ ఇచ్చారు సోహైల్‌. బిగ్‌ బాస్‌ నుంచి 25లక్షల ఆఫర్‌ తీసుకోవడం పట్ల కొందరు నెగటివ్‌ కామెంట్లు చేస్తున్నారట. తన ఫ్యామిలీ గురించి తప్పుడు కామెంట్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సోహైల్‌. 

68

సినిమా అంటే ఈజీ కాదు, కోట్లు ఖర్చుబెట్టి తీస్తామని, ఎంతో కష్టం ఉంటుందని, ఎంతో మంది కష్టపడితే ఒక సినిమా తయారవుతుందని, దాన్ని మీరు(ట్రోలర్స్‌)ని తప్పుపడుతూ నెగటివ్‌ కామెంట్లు పెడితే ఎలా అని ప్రశ్నించారు. సినిమా కష్టం ఏంటో మీకు తెలియదన్నారు. తననే కాదు, ఏ హీరోని, ఏ సినిమా గురించి ఇలా నెగటివ్‌ కామెంట్లు పెట్టొద్దన్నారు. ఇవి రిపీట్‌ అయితే ఒక్కొక్కడిని వెతికి మరీ కొడతా అని, సీన్‌ మామూలుగా ఉండదని వార్నింగ్‌ ఇచ్చారు సోహైల్‌. 
 

78

తన తండ్రి గురించి చెబుతూ తాము ఐదుగురు పిల్లలమని, ఓ వైపు సింగరేణిలో మానాన్న జాబ్‌ చేస్తూ, మరోవైపు ఇంటి వద్ద పొలం పనులు చూసుకునేవారని, అలా రాత్రి పగలు కష్టపడి మమ్మల్ని పెంచారని, ఇప్పుడు తాను ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణమని తెలిపారు సోహైల్‌. ప్రతి కొడుకు విజయం వెనకాల తండ్రి కష్టం ఉంటుందన్నారు. అదే సమయంలో తనని ఈస్థాయికి తీసుకొచ్చిన ఆడియెన్స్ కి, అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు సోహైల్‌. వాళ్లే తనకు గెస్ట్ లు అని, అందుకే ఈ ఈవెంట్‌కి ఎవరినీ గెస్ట్ గా పిలవలేదన్నారు. సినిమా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరు గెస్టులే అని వెల్లడించారు. 
 

88

సయ్యద్‌ సోహైల్‌, మోక్ష జంటగా, ఏఆర్‌ అభి దర్శకత్వంలో `లక్కీ లక్ష్మణ్‌` సినిమా రూపొందింది. దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హరిత గోగినేని నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 30న విడుదల కాబోతుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ఫన్నీగా మంచి కామెడీని పంచింది. ఫ్యామిలీ ఎలిమెంట్లు, వినోదం, ఎమోషన్స్ మేళవింపుగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
మోసం

Latest Videos
Recommended Stories
Recommended image1
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Recommended image2
ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..
Recommended image3
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved