- Home
- Entertainment
- తన ఫ్యామిలీకి ఇష్టం లేకుండా శోభన్ బాబు నటించిన ఒకే ఒక్క చిత్రం, లేడీ ఫ్యాన్స్ ఏమన్నారో తెలుసా
తన ఫ్యామిలీకి ఇష్టం లేకుండా శోభన్ బాబు నటించిన ఒకే ఒక్క చిత్రం, లేడీ ఫ్యాన్స్ ఏమన్నారో తెలుసా
Sobhan Babu: లెజెండ్రీ నటుడు శోభన్ బాబుకి మహిళా ప్రేక్షకుల్లో అభిమానులు ఎక్కువగా ఉంటారు. టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా నీరాజనాలు అందుకున్న శోభన్ బాబు అనేక చిత్రాల్లో నటించి అలరించారు.

Sobhan Babu
లెజెండ్రీ నటుడు శోభన్ బాబుకి మహిళా ప్రేక్షకుల్లో అభిమానులు ఎక్కువగా ఉంటారు. టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా నీరాజనాలు అందుకున్న శోభన్ బాబు అనేక చిత్రాల్లో నటించి అలరించారు. శోభన్ బాబు తాను హీరో వేషాలు తప్ప ఇక ఎలాంటి పాత్రల్లో నటించనని అప్పట్లోనే తేల్చి చెప్పేశారు. సినిమాలకు దూరమైనా ఖాళీగా ఉన్నారు తప్ప ఇతర పాత్రల్లో నటించలేదు.
కానీ శోభన్ బాబు ఒకే ఒక్కసారి తనకి ఇష్టం లేని పాత్రలో నటించారట. ఆ పాత్రలో నటించడం తనకి మాత్రమే కాదు తన కుటుంబ సభ్యులకు కూడా ఏమాత్రం ఇష్టం లేదు అని ఓ మీటింగ్ లో శోభన్ బాబు తెలిపారు. శోభన్ బాబు సినీ కెరీర్ చివరి దశలో ఉన్న తరుణంలో బలరామ కృష్ణులు అనే చిత్రంలో నటించారు.
ఈ చిత్రంలో రాజశేఖర్, జగపతి బాబు, శోభన్ బాబు ముగ్గురూ హీరోలు. అయితే శోభన్ బాబు పాత్ర మాత్రం కాస్త నెగిటివ్ షేడ్స్ లో విలన్ తరహాలో ఉంటుంది. ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు కుటుంబ సభ్యులు అసలు చేయవద్దు అని చెప్పారట. నాకు కూడా ఇష్టం లేదు. కానీ ప్రొడ్యూసర్ కి ఇచ్చిన మాట ప్రకారం ఆ చిత్రంలో నటించినట్లు శోభన్ బాబు తెలిపారు.
శోభన్ బాబు ఊరి పెద్దగా కోపిష్టి పాత్ర తరహాలో కనిపిస్తారు. శోభన్ బాబు, రాజశేఖర్ అన్నదమ్ములుగా నటించారు. 1992లో ఈ చిత్రం విడుదలయింది. ఈ చిత్రం విడుదలయ్యాక తన లేడీ ఫ్యాన్స్ రియాక్ట్ అయిన విధానాన్ని శోభన్ బాబు గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రంలో మీ పాత్ర చాలా బాగా నచ్చింది అని చెప్పారట. అదేంటమ్మా నా స్వభావానికి తగ్గ పాత్ర కాదు, నేనెప్పుడూ ఇలాంటి పాత్రలో నటించలేదు. ప్రొడ్యూసర్ కి ఇచ్చిన మాట కోసం నటించా.. అదెలా నచ్చింది అని అడిగారట. అందంతా కాదు సార్.. మీరు ఏం చేసినా మాకు నచ్చుతుంది అని మహిళా అభిమానులు శోభన్ బాబుతో అన్నారు.
Sobhan Babu
వాళ్లన్న ఆ మాటతో తన జన్మ ధన్యం అయింది అని శోభన్ బాబు ఎమోషనల్ అయ్యారు. శోభన్ బాబు 1996లో పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత చాలా చిత్రాల్లో ప్రత్యేక పాత్రలకు ఆయనకు అవకాశాలు వచ్చాయి. కానీ హీరో కాని పాత్రలు చేయనని శోభన్ బాబు రిజెక్ట్ చేశారు. అతడు చిత్రంలో మహేష్ బాబు తాత పాత్రలో ముందుగా అనుకున్నది శోభన్ బాబునే. కానీ చివరికి ఆ పాత్ర నాజర్ చేశారు.