- Home
- Entertainment
- శోభన్ బాబు కళ్ళముందు పెరిగి పెద్దవాడై ఆయనతోనే హీరోగా మల్టీస్టారర్ చేసిన ఏకైక కమెడియన్, ఎవరతడు ?
శోభన్ బాబు కళ్ళముందు పెరిగి పెద్దవాడై ఆయనతోనే హీరోగా మల్టీస్టారర్ చేసిన ఏకైక కమెడియన్, ఎవరతడు ?
టాలీవుడ్ లో శోభన్ బాబు ఒక చరిత్ర. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లతో పాటు సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరో శోభన్ బాబు. టాలీవుడ్ లో అందగాడు అంటే ముందుగా ఆయన పేరే చెబుతారు.

Sobhan Babu
టాలీవుడ్ లో శోభన్ బాబు ఒక చరిత్ర. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లతో పాటు సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరో శోభన్ బాబు. టాలీవుడ్ లో అందగాడు అంటే ముందుగా ఆయన పేరే చెబుతారు. శోభన్ బాబు తన కెరీర్ లో ఎన్టీఆర్ , కృష్ణ, కృష్ణం రాజు లాంటి అగ్ర హీరోలతో అనేక మల్టీస్టారర్ చిత్రాలు చేసేవారు.
కానీ శోభన్ బాబు ఒక కమెడియన్ తో కూడా హీరోగా మల్టీస్టారర్ చిత్రం చేసారని తెలుసా ? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. శోభన్ బాబుతో హీరోగా మల్టీస్టారర్ చిత్రం చేసిన కమెడియన్ ఎవరో కాదు.. అలీ. వీళ్ళిద్దరూ హీరోలుగా కలసి నటించిన చిత్రం హలో గురు. ఆశ్చర్యం ఏంటంటే శోభన్ బాబుకి అదే చిట్టచివరి చిత్రం. ఆ తర్వాత శోభన్ బాబు పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు.
దీని గురించి అలీ మాట్లాడుతూ నేను శోభన్ బాబు గారి కళ్ళ ముందు పెరిగి పెద్దవాడిని అయ్యాను. 8 ఏళ్ళ వయసులో ఆయన చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాను. పెద్దయ్యాక యమలీల లాంటి చిత్రాలతో నేను హీరోగా కూడా సక్సెస్ అయ్యాను. ఆ టైంలో శోభన్ బాబుగారితో హీరోగా నటించే అవకాశం వచ్చింది. హలో గురు షూటింగ్ జరుగుతున్న సమయంలో శోభన్ బాబుగారు.. రావయ్యా హీరో అని సరదాగా పిలిచేవారు. ఊరుకోండి గురువుగారు నేను హీరోని ఏంటి.. మీకు నేను శిష్యుడిని అని చెప్పేవాడిని. లేదురా మన ఆలోచనలు ఉన్నతంగా ఉంటేనే మనం ఎదుగుతాం.
నేను సినిమాల్లోకి రాకముందు ఎన్టీఆర్ గారితో కలసి నటించాలి అని కలలు కనేవాడిని. అది జరిగింది కదా అని అన్నారు. అయితే హలో గురు చిత్రం తర్వాత శోభన్ బాబు సినిమాలు మానేయడానికి కారణం ఉంది. ఆ విషయం నాతో చెప్పారు. వయసు మీద పడుతోంది. అందుకే సినిమాలు మానేయాలి అనుకుంటున్నా. ప్రేక్షకులు నన్ను ముసలివాడిగా గుర్తు పెట్టుకోకూడదు. వాళ్ళ దృష్టిలో నేను ఎప్పుడూ యంగ్ గా, శోభన్ బాబు లాగే ఉండాలి అని అన్నారు.
Comedian Ali
ఆ తర్వాత శోభన్ బాబుకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని చిత్రాలు అవకాశాలు వచ్చినా రిజెక్ట్ చేశారు. హీరోగా తప్ప ఇక ఇతర పాత్రలు చేయనని తేల్చేశారు. అతడు చిత్రంలో మహేష్ తాత పాత్రలో నటించేందుకు కూడా శోభన్ బాబు అంగీకరించలేదు.